S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/13/2016 - 05:48

శ్రీనగర్, అక్టోబర్ 12: దాదాపు 60గంటల పాటు ఎడతెగని ఎదురుకాల్పులు...ఇక్కడి పాంపోర్‌లోని ఓ ప్రభుత్వ భవనంలోకి చొరబడ్డ ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు దాదాపు మూడు రోజుల పాటు శ్రమించాయి. అంతిమంగా బుధవారం మధ్యాహ్నం ఇద్దరు ఉగ్రవాదులూ హతులైనట్టుగా ప్రకటించారు. వీరిని లష్కరే తోయిబా మిలిటెంట్లుగా గుర్తించారు.

10/11/2016 - 06:07

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడులు ఇలాగే కొనసాగితే మెరుపుదాడులు తప్పవని ఎన్డీయే సర్కారు పాకిస్తాన్‌కు గట్టి సందేశం పంపించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే వాస్తవాధీన రేఖ (ఎల్‌ఓసి) ప్రాముఖ్యత కోల్పోతుందని కేంద్రం ఇటీవల పాక్‌కు పంపిన సందేశంలో స్పష్టం చేసినట్టు చెబుతున్నారు.

10/11/2016 - 05:44

న్యూఢిల్లీ, అక్టోబరు 10:విశాఖ-చెనె్న పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన ఏడిబి (ఏసియా డెవలప్‌మెంట్ బ్యాంక్) అధ్యయనం పూర్తయిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి వెల్లడించారు. ఇక త్వరలోనే పనులు లప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. ఐఐఎఫ్‌టి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ ప్యాకేజీంగ్ సంస్థలను కాకినాడలోని ఎక్స్‌పోర్టు జోన్‌లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించిందని చెప్పారు.

10/11/2016 - 05:43

న్యూఢిల్లీ, అక్టోబరు 10:ఏపీ నూతన రాజధాని నగరం అమరావతి నిర్మాణంపై స్టే ఇవ్వలేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) స్పష్టం చేసింది. అయితే ట్రిబ్యునల్ తుది తీర్పునకు లోబడే అమరావతి నిర్మాణాలు చేపట్టాలని తెలిపింది. ధర్మాసనం పరిధిలో ఉన్న ఈ కేసు గురించి పిటిషనర్లు,ప్రతివాదులు మీడియాతో మాట్లాడేప్పుడు బాధ్యతతో వ్యవహరించాలని వ్యాఖ్యానించింది.

10/11/2016 - 05:40

శ్రీనగర్, అక్టోబర్ 10: ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను భారత సైనికులు మట్టుబెట్టిన నేపథ్యంలో సోమవారం ముగ్గురు తీవ్రవాదులు శ్రీనగర్‌లోని ఓ ప్రభుత్వ భవనంలోకి చొరబడ్డ సంఘటన కలకలం రేపింది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు బలగాలను రంగంలోకి దింపారు. గంటల తరబడి జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ఓ సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు.

10/10/2016 - 07:01

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: మనం త్వరలో జరుపుకోనున్న విజయదశమికి చాలా ప్రత్యేక ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లో గల ఉగ్రవాద స్థావరాలపై ఇటీవల భారత సైన్యం విజయవంతంగా లక్షిత దాడులను నిర్వహించిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రానున్న రోజుల్లో మనం విజయదశమిని జరుపుకోనున్నాం.

10/10/2016 - 06:53

లక్నో, అక్టోబర్ 10: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ (ఎస్‌పి) పార్టీలకు ఓట్లేస్తే వృథాయేనని బహజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. బిఎస్‌పి వ్యవస్థాపకుడు కాన్షీరామ్ 10వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం లక్నోలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాయావతి ముస్లిం ఓటర్లపై దృష్టి సారించారు.

10/10/2016 - 06:51

చెన్నై, అక్టోబర్ 9: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా ఆదివారం అనేక మంది రాజకీయ ప్రముఖులు ఇక్కడ అపోలో ఆసుపత్రికి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులు తనకు అన్ని విషయాలు చెప్పారని, జయ ఆరోగ్యం గురించి ఎలాంటి వదంతులను ప్రచారం చేయటం సమంజసం కాదని అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెంకయ్యనాయుడు అన్నారు.

10/10/2016 - 06:49

పలన్‌వాలా, అక్టోబర్ 9: కొన్ని వారాలుగా కాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో భయం తాండవించింది. ఇరువైపులా సైనికుల నిత్య ఘర్షణలతో, ఉగ్రవాద దాడులతో భయభ్రాంతులైన గ్రామస్థులు తట్టాబుట్టా సర్దుకుని ఊళ్లను వదిలి పారిపోయారు. ఆ భయం వారిలో ఇంకా కనిపిస్తూనే ఉంది. రెండుమూడు రోజుల్లో సరిహద్దుల్లో ఎలాంటి కాల్పులు లేకపోయినా, ఇళ్లను వదిలి వెళ్లిన గ్రామస్థులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు.

10/10/2016 - 06:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశంలో గృహహింస చట్టం పరిధిని విస్తృతం చేస్తూ సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ చట్టం పరిధిలో ఎవరినైనా విచారించేందుకు వీలుగా ఇందులోని ‘‘అడల్ట్ మేల్ (మేజర్ అయిన పురుషులు)’’ అన్న పదాల్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పదాన్ని తొలగించటం వల్ల ఇకపై ఈ చట్టం కింద మహిళలను, మేజర్ కానివాళ్లను కూడా విచారించేందుకు అవకాశం లభిస్తుంది.

Pages