S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/29/2016 - 17:19

దిల్లీ: భారత్‌ సందర్శనకు వచ్చే విదేశీ మహిళలు స్కర్టులు ధరించి రాకూడదని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేశ్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. దీనిపై పలువురు విమర్శలు, ట్విట్టర్‌లో కామెంట్లు చేస్తుండడంతో మంత్రి వివరణ ఇచ్చారు. కేవలం మత సంబంధ ప్రదేశాల గురించి మాత్రమే మాట్లాడానని, మహిళలు ఏం ధరించాలో.. ఏం ధరించవద్దో తాను కామెంట్‌ చేయలేదని సోమవారం మహేశ్‌ శర్మ వివరణ ఇచ్చారు.

08/29/2016 - 17:13

దిల్లీ: బులంద్‌షహర్‌లో తల్లీకూతుళ్లపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఆజంఖాన్‌కి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. అధికారంలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

08/29/2016 - 16:31

కోల్‌‌కతా: పశ్చిమ బెంగాల్ పేరును ఇంగ్లీష్‌లో బెంగాల్‌గా, బెంగాళీలో బంగ్లాగా మారుస్తూ చేసిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. పశ్చిమ (West) అనే పదం తొలగింపుతో ప్రస్తుతం ఇంగ్లీష్‌లో 31వ వరుస క్రమంలో ఉన్న రాష్ట్రం టాప్‌లోకి చేరుతుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తీర్మానానికి కేంద్రం అంగీకారం తెలపాల్సి ఉంది.

08/29/2016 - 15:30

శ్రీనగర్‌ : 51 రోజులుగా కొనసాగుతున్న కర్ఫ్యూ సోమవారం ఎత్తివేయడంతో కాశ్మీర్‌ లోయలో ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు షాపుల వద్ద బారులు తీరారు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు కాల్చివేశారు. శ్రీనగర్‌, పుల్వామా జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది.

08/29/2016 - 13:34

ఢిల్లీ: పోలవరం పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఒడిశా వాసి వేసిన పిటిషన్‌పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) లో విచారణ వాయిదా పడింది. సెప్టెంబర్ 5న పూర్తి సమాచారంతోనైనా లేదా సంబంధిత అధికారితో రావాలని కేంద్రానికి ఎన్‌జీటీ ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖపై ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

08/29/2016 - 05:26

హైదరాబాద్, ఆగస్టు 28: భారత విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. బ్రెజిల్, ఇస్తాంబుల్‌లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో సిఐఎస్‌ఎఫ్ (కేంద్ర పరిశ్రమల భద్రతా దళం) ప్రత్యేక శిక్షణతో దేశంలోని విమానాశ్రయాల్లో భద్రతను పెంచింది. క్విక్ రియాక్షన్ టీమ్స్ ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని, విమానాశ్రయాల్లో భద్రతకు ఢోకా లేదని సిఐఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు.

08/29/2016 - 05:25

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఒక పార్టీకి చెందిన ‘స్టార్ క్యాంపెయినర్’ తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం వెలుపల తన పార్టీ కోసం ప్రచారం చేయడానికి హెలికాప్టర్లలో ప్రయాణం చేస్తే అందుకు అయ్యే వ్యయం ఆయన వ్యక్తిగత ఎన్నికల ప్రచార వ్యయం పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

08/29/2016 - 05:27

అహ్మదాబాద్, ఆగస్టు 28: అతనో ఆటో రిక్షా డ్రైవర్. రోజూ ఆటోనడుపుకుంటే తప్ప జీవితం గడవడం కష్టం. జాతీయ స్థాయిలో మంచి షూటర్‌గా ఎదిగిన కూతురు మరింత రాణించేందుకు తాను ఆమె వివాహం కోసం దాచిపెట్టిన అయి దు లక్షల రూపాయలను ఖర్చు చేసి జర్మన్ తయారీ రైఫిల్‌ను బహుమతిగా కొనిచ్చాడు. మనిలాల్ గోహిల్(50), అనే ఈ ఆటో డ్రైవర్ కూతురు మిట్టల్ (27) 2012నుంచి షూటింగ్ పోటీల్లో పాల్గొంటోంది.

08/29/2016 - 04:59

న్యూఢిల్లీ, ఆగస్టు 28: పదిహేను సంవత్సరాలు, అంతకు పైబడిన దాదాపు 15 లక్షల భారీ వాహనాలను మొదటి దశలో రద్దుగా మార్చడానికి ఉద్దేశించిన వాహనాల రద్దు విధానం ముసాయిదా 15 రోజుల్లో సిద్ధమవుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

08/29/2016 - 03:17

బెంగళూరు, ఆగస్టు 28: రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదవాలని, ప్రభుత్వ, పరిపాలనకు సంబంధించిన అంశాల్లో భాగస్వాములై సమాజంలో కోరుకున్న మార్పును తీసుకురావాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ విద్యార్థులకు సూచించారు. ఆదివారం బెంగళూరులో ఆయన ఎన్‌ఎల్‌ఎస్‌ఐయు (నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ) 24వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఈ విజ్ఞప్తి చేశారు.

Pages