S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/26/2016 - 01:07

న్యూఢిల్లీ, జనవరి 25: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్, ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ మెట్రోరైల్‌లో కలిసి ప్రయాణం చేశారు. గుర్‌గావ్‌లో ఇంటెరం సెక్రెటేరియట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ (ఐఎస్‌ఏ) ప్రారంభోత్సవానికి ఇరుదేశాధినేతలు వెళ్లారు. మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు హోలాన్, మోదీలు మెట్రో ప్రయాణం చేసినట్టు అధికార వర్గాలు తెలిపారు.

01/26/2016 - 01:10

న్యూఢిల్లీ, జనవరి 25: దేశ ఎన్నికల్లో అంగబలం, అర్థబలం పెచ్చరిల్లిపోవడం పట్ల రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమాలు ప్రజాస్వామ్య స్ఫూర్తినే దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఇప్పటివరకు డిజిటల్, సామాజిక మీడియా వేదికలకు దూరంగా ఉన్న యువ ఓటర్లకు చేరువకావాలని ఎన్నికల కమిషన్‌కు రాష్టప్రతి విజ్ఞప్తి చేశారు.

01/26/2016 - 00:27

న్యూఢిల్లీ, జనవరి 25: ఉగ్రవాద ధోరణిని విడనాడాలని పాకిస్తాన్‌కు భారత్, ఫ్రాన్స్ ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశాయి. పఠాన్‌కోట్‌పై దాడికి కుట్ర పన్నిన వారిని కఠినంగా శిక్షించాలని గట్టిగా కోరాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ మధ్య సోమవారం జరిగిన విస్తృత భేటీలో పాక్ ఉగ్రవాదం సహా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

01/26/2016 - 00:26

112 మందికి పద్మ అవార్డులు 10మంది ప్రముఖులకు పద్మవిభూషణ్
19మందికి పద్మభూషణ్ 83మంది ప్రముఖులకు పద్మశ్రీ
తెలుగు రాష్ట్రాలకు 12 పద్మలు యార్లగడ్డ, సైనా, సానియాలకు పద్మభూషణ్ కర్నాటక నుంచి దర్శకుడు రాజవౌళికి పద్మశ్రీ

01/26/2016 - 00:21

న్యూఢిల్లీ, జనవరి 25: తుపాకీ గుళ్ల మధ్య శాంతి చర్చలు కుదరవని భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తెగేసి చెప్పారు. సమస్యలు సామరస్య పూర్వకంగా పరిష్కృతం కావాలంటే దేశాల మధ్య నిరంతర ప్రాతిపదికన చర్చలు జరగాలని ఉద్ఘాటించిన ఆయన ‘బులెట్ల వర్షంలో శాంతిని చర్చించలేం’అని స్పష్టం చేశారు.

01/26/2016 - 00:20

న్యూఢిల్లీ, జనవరి 25: గణతంత్ర వేడుకలకు యావద్భారతం సన్నద్ధమైంది. ఐసిస్ హెచ్చరికల నేపథ్యంలో భద్రతాపరంగా ఎలాంటి లోపాలకు తావులేకుండా విస్తృతస్థాయి నిఘా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీపై భద్రతా దళాలు డేగకన్ను వేశాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ ముఖ్య అతిధిగా హాజరవుతున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను కనీవినీ ఎరుగని రీతిలో ముమ్మరం చేశారు.

01/25/2016 - 18:23

దిల్లీ: దిల్లీ నుంచి నేపాల్ రాజధానికి సోమవారం సాయంత్రం బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉందంటూ ఆగంతకులు ఫోన్ చేయడంతో భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. విమానంలో నుంచి ప్రయాణికులందరినీ కిందకు దింపేసి బాంబు కోసం గాలించారు. 108 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది విమానంలో ఉన్నారు.

01/25/2016 - 18:22

దిల్లీ: ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ‘ఆదర్శ సిఎం’ పురస్కారాన్ని ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ అనే సంస్థ సోమవారం ప్రకటించింది. ఈ నెల 30న పూణెలో జరిగే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకుంటారు.

01/25/2016 - 17:43

దిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం పద్మ అవార్డులను ప్రకటించింది. అత్యంత ఉన్నతమైన పౌర పురస్కారం ‘ భారత రత్న’ ను ఈ ఏడాది ఎవరికీ ప్రకటించలేదు.

01/25/2016 - 15:24

దిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండేతో లంచ్‌లో పాల్గొనే అవకాశం మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య బచ్చన్‌కు దక్కింది. మంగళవారం దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాలాండే హాజరవుతున్న సందర్భంగా అత్యంత ప్రముఖులకు విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విందులో పాల్గొనాల్సిందిగా ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ఐశ్వర్యను ప్రత్యేకంగా ఆహ్వానించింది.

Pages