S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/09/2018 - 01:02

ఉన్నావ్ (యూపీ), అక్టోబర్ 8: రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల్లో తనతో పోటీ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంథీకి మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్ సవాల్ విసిరారు. ఆ ఎన్నికల్లో రాహుల్ తనను ఓడిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆయన స్పష్టం చేశారు.

10/09/2018 - 03:26

న్యూఢిల్లీ: శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నది. ఈ క్రమంలో ఆయన సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో సమావేశమయ్యారు. అనంతరం పరిపూర్ణానంద విలేఖరులతో మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాల మేరకు తన ప్రచారం ఉంటుందని చెప్పారు.

10/09/2018 - 03:27

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేయాలని సీపీఎం నాయకత్వం పిలుపునిచ్చింది. అలాగే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకూడదని, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు బీఎల్‌ఎఫ్‌ను ఏర్పాటు చేయాలని సీపీఎం సెంట్రల్ కమిటీ నిర్ణయించింది.

10/09/2018 - 00:05

నాగ్‌పూర్, అక్టోబర్ 8: భారత రక్షణ పాటవంలో అత్యంత కీలక భూమిక పోషిస్తున్న బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన కీలక సాంకేతిక సమాచారాన్ని పాకిస్తాన్‌కు లీక్ చేస్తున్న ఏరోస్పేస్ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

10/08/2018 - 17:36

నాగపూర్: మహారాష్టల్రోని నాగపూర్ క్షిపణి కేంద్రంలో పనిచేస్తున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన నిషాంత్ అగర్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శ రక్షణ వ్యవస్థలో కీలకమైన బ్రహ్మోస్‌ సాంకేతిక సమాచారాన్ని ఐఎస్‌ఐ ద్వారా నిషాంత్‌ పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు.

10/08/2018 - 16:41

న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. కాగా సుప్రీం తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసేంతవరకు చర్చలు జరిపే ప్రసక్తిలేదని పండాళం రాజ కుటీంబుకులు, ఆలయ పూజరులు స్పష్టం చేశారు.

10/08/2018 - 16:39

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఛాతి ఇన్‌ఫెక్షన్‌తో లీలావతి ఆసుపత్రిలో చేరారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

10/08/2018 - 12:32

లక్నో: రానున్న మూడేళ్లలో నక్సలిజం అనేది లేకుండా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆయన లక్నోలోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్ ఆఫీసులో జరిగిన రాపిడి యాక్షన్ ఫోర్స్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకప్పుడు 126 జిల్లాల్లో ఉండే వామపక్ష తీవ్రవాదం నేడు 10 నుంచి 12 జిల్లాల్లో మాత్రమే ఉందని, దీన్ని కూడా రానున్న కాలంలో తుదిముట్టిస్తామని చెప్పారు.

10/08/2018 - 02:56

డెహ్రాడూన్: ప్రపంచంలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశంగా భారత్ అవతరించిందని, సామాజిక, ఆర్థిక రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల వృద్ధిరేటు ఊపందుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రం తొలిసారిగా ఏర్పాటు చేసిన మొదటి ఇనె్వస్టర్ల సదస్సు 2018ను ప్రారంభించారు.

10/08/2018 - 01:23

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: భారత్ రక్షణ రంగంలో స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. రష్యాతో ఎస్-400 ట్రింఫ్ మిసైళ్ల కొనుగోళ్ల ఒప్పందం నేపథ్యంలో అమెరికా ఆంక్షలు విధిస్తుందన్న భయాలను ఆయన కొట్టిపారేశారు. ఇటువంటి ఆందోళనల వల్ల ప్రయోజనం లేదన్నారు.

Pages