S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/07/2018 - 02:41

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: జాతిపిత మహాత్మా గాంధీ బోధనలు, అనుసరించిన విలువలను చాటిచెప్పే రీతిలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ శనివారం ఇక్కడ ఒక ముషాయిరాను నిర్వహించింది. గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఇక్కడి డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

10/07/2018 - 02:07

కోల్‌కతా, అక్టోబర్ 6: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అస్తవవ్యస్త విధానల వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైందని తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఆర్థిక స్థిరత్వం లేకపోతే దేశాభివృద్ధి సాధ్యం కాదన్న మమత‘మోదీ ప్రభుత్వంలో మొత్తం వ్యవస్థ ధ్వంసమైంది’అని ధ్వజమెత్తారు. ‘ఆర్‌ఎస్‌ఎస్ పెత్తనం పెరిగిపోయింది.

10/07/2018 - 02:05

జాబువా(మధ్యప్రదేశ్), అక్టోబర్ 6: గిరిజనులు,దళితుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని, ఊకదంపుడు ఉపన్యాసాలతో ఈ వర్గాలను మోసం చేసిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ధ్వజమెత్తారు. గిరిపుత్రుల సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

10/07/2018 - 02:03

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: న్యాయవాదులు సమ్మె చేయరాదని 16 ఏళ్ల క్రితం విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. న్యాయవాదుల సమ్మెపై నిషేధం ఎందుకు ఎత్తి వేయాలని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శనివారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వాహకులు కొత్తగా ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రంజన్ గొగోయ్‌ను సత్కరించాయి.

10/07/2018 - 02:02

చెన్నై, అక్టోబర్ 6: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే జయలలిత మృతికి సంబంధించి విచారణ నిమిత్తం నియమించిన కమిటీకి అపోలో ఆసుపత్రి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో తమ ఆసుపత్రి ఆవరణలో ముఖ్యమంత్రి జయలలిత కదలికలకు సంబంధించిన సమయంలో సీసీటీవీ కెమెరాలను స్విచాఫ్ చేయాలని పోలీసులు ఆదేశించారని పేర్కొన్నారు.

10/07/2018 - 02:02

చెన్నై, అక్టోబర్ 6: తమిళనాడులో వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్సలర్లనియామకంపై కోట్లాది రూపాయలు చేతులు మారాయని గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ అన్నారు. తాను గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించకముందు ఈ అవకతవకలు జరిగాయన్నారు. గవర్నర్ వ్యాఖ్యలపై ఎఐఎడిఎంకె ప్రభుత్వం స్పందించింది. వీసీల నియమాకంలో ప్రభుత్వం పాత్ర ఉండదని పేర్కొంది.

10/07/2018 - 01:59

చిత్రాలు.. 86వ ఎయర్ ఫోర్స్‌డే సందర్భంగా ఘజియాబాద్ గగనతలంలో వాయుసేన అద్భుత విన్యాసాలు

10/07/2018 - 01:54

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారతీయ యువతను నిర్వీర్యం చేసేందుకు పాకిస్తాన్ కుయుక్తులను పన్నుతోందని, మాదకద్రవ్యాల అక్రమరవాణాకు పాల్పడుతోందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. దీని వల్ల ఆర్మీలో చేరే వారి సంఖ్య తగ్గిపోతుందన్నారు. హిందూస్తాన్ టైమ్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పంజాబ్‌లోకి మాదకద్రవ్యాల అక్రమ రవాణా విపరీతంగా పెరిగిందన్నారు. సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నామన్నారు.

10/07/2018 - 01:42

మొరేనా(ఎంపీ), అక్టోబర్ 6: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహల్ గాంధీ తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. దేశంలో కొద్ది మంది ధనికుల ప్రయోజనాల కోసమే బీజేపీ పనిచేస్తోందని శనివారం ఇక్కడ విమర్శించారు. పేదలు, అట్టడుగు వర్గాలు, రైతుల గురించి ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని కాంగ్రెస్ చీఫ్ విరుచుకుపడ్డారు. పేదల ఉద్ధరణ కోసమే కాంగ్రెస్ పాటుపడుతోందని ఆయన స్పష్టం చేశారు.

10/07/2018 - 01:36

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గడ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని బీజేపీ సీనియర్ నేత, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, రాజస్తాన్‌లో తమ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఆయన అన్నారు. ఆయన ఇక్కడ మాట్లాడుతూ కార్యకర్తలు, నేతలు సమిష్టిగా పనిచేసి పార్టీ విజయానికి పాటుపడాలన్నారు.

Pages