S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/08/2018 - 01:21

లక్నో, అక్టోబర్ 7: కాంగ్రెస్ కంచుకోటగా భావించే యూపీలోని రాయ్‌బరేలి నియోజకవర్గంలో ఆ పార్టీ ప్రతిష్టను తగ్గించడానికి బీజేపీ కొత్త ఎత్తుగడ వేస్తోంది.

10/08/2018 - 01:20

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)తో సీట్ల సర్దుబాటు చర్చలు విఫలంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘రాష్ట్రాల స్థాయిలో చర్చలు విఫలమైనంత మాత్రాన లోక్‌సభ పొత్తులపై ఎలాంటి ప్రభావం ఉండదు. మహాకూటమిపై ఏ మాత్రం ప్రభావం చూపదు’అని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

10/08/2018 - 01:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏను ఓడించాలంటే కాంగ్రెస్ హైకమాండ్ తన అహంభావాన్ని కొద్దిగా తగ్గించుకుని మిత్రపక్షాలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేయటం మంచిదని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సలహా ఇచ్చారు.

10/08/2018 - 01:28

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలలో బీజేపీకి భంగపాటు తప్పదా? అంటే తప్పదనే వెల్లడిస్తున్నాయి ఒపీనియన్ పోల్స్. వసుంధర రాజే నేతృత్వంలోని రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వానికి ఈసారి భారీ ఓటమి ఖాయమని, రెండు దశాబ్దాల బీజేపీ హవాకి ఇక తెరపడినట్టేనని చెబుతున్నాయి ఈ ఒపీనియన్ పోల్స్.

10/08/2018 - 01:27

లక్నో, అక్టోబర్ 7: వచ్చే మూడేళ్లలో దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని సంపూర్ణంగా తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. శాంతి భద్రతలు నియంత్రణలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఆదివారం ఇక్కడ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) 26వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ఆర్‌ఏఎఫ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు.

10/07/2018 - 03:57

న్యూఢిల్లీ: స్వలింగసంపర్కంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాను ఏకీభవించనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. లైంగికత్వం అనేది వాక్‌స్వాతంత్య్రంలో భాగమని అభిప్రాయం సరికాదన్నారు. వాక్‌స్వాతంత్య్రంలో భాగమని చెప్పడం వల్ల పాఠశాలల హాస్టళ్లు, జైళ్లు, ఆర్మీలో స్వలింగసంపర్కం, ఉభయ లైంగిక సంపర్కంను నియంత్రించాలా వద్దా అనే సందేహాలు తలెత్తుతాయన్నారు.

10/07/2018 - 02:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: మరో నాలుగు కొత్త సరుకులకు సంబంధించి ఆప్షన్స్ కాంట్రాక్టులను ప్రారంభించడానికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి అనుమతి లభించిందని కమాడిటి ఎక్స్చేంజ్ ఎన్‌సీడీఈఎక్స్ శనివారం తెలిపింది. నేషనల్ కమాడిటి అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ (ఎన్‌సీడీఈఎక్స్) ఈ కాంట్రాక్టులను వచ్చే వారం తొలినాళ్లలో ప్రారంభించే అవకాశం ఉంది.

10/07/2018 - 02:47

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలుకు భారత్ ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పందాన్ని కుదుర్చుకుందో అమెరికా అర్థం చేసుకుందని, అందువల్ల ఆ దేశం భారత్‌పై ఆంక్షలు విధించకపోవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

10/07/2018 - 02:47

ముంబయి, అక్టోబర్ 6: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు. ఆ పార్టీ నాయకుడు జితేంద్ర అహ్వద్ శనివారం ఇక్కడ ఈ విషయం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పుణే లోక్‌సభ నియోజకవర్గం నుంచి పవార్ పోటీ చేస్తారనే ఊహాగానాలకు అహ్వద్ ప్రకటన ముగింపు పలికింది.

10/07/2018 - 02:44

తిరువనంతపురం, అక్టోబర్ 6: శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కేరళ రాజకీయాలు వేడెక్కాయి. ప్రజల మనోభావాలు, అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలంటూ రాష్ట్రంలో అనేక చోట్ల ఉద్యమం ఊపందుకుంటోంది.

Pages