S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/25/2018 - 05:04

యెకటెరిన్‌బర్గ్‌లో ఆదివారం రాత్రి జపాన్ -సెనెగల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బంతిని ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సెనెగల్ ఆటగాడు యూసఫ్ సెబాలి (పైన), జపాన్ ఆటగాడు జెన్కీ హరగుచి. గ్రూప్-హెచ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు చెరి రెండు గోల్స్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆట ప్రారంభం నుంచి ఇరు జట్లు గోల్ కోసం బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడానికే ఎక్కువసేపు ప్రాధాన్యమిచ్చాయి.

06/25/2018 - 05:02

బ్రెడా (నెదర్లాండ్), జూన్ 24: చాంపియన్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ ఖాతాలో మరో గెలుపు చేరింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను శనివారం జరిగిన మ్యాచ్‌లో 4-0తో మట్టికరిపించిన భారత్ సేన ఆదివారం జరిగిన మరో రెండో మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్స్ అర్జెంటీనాపై 2-1తో విజయం సాధించింది.

06/25/2018 - 05:00

సాల్ట్ లేక్ సిటీ (యూఎస్‌ఏ), జూన్ 24: భారత ఆర్చర్ (విలువిద్య) అభిషేక్ వర్మ ఇక్కడ ఆదివారం జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో కాంస్య, రజత పతకాలు కైవసం చేసుకున్నాడు. వ్యక్తిగత ఈవెంట్‌లో రజతం, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకం అందుకున్నాడు. డెన్మార్క్ ఆర్చర్ స్టీఫెన్ హాన్‌సెన్ ఆర్చరీలో సాధించిన వరల్డ్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడానికి అభిషేక్ వర్మ ఎంతగానో శ్రమించాడు.

06/25/2018 - 04:59

న్యూఢిల్లీ, జూన్ 24: మంగోలియా ఉలాన్‌బాటర్ కప్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో భారత బాక్సర్లు ఐదు పతకాలు కైవసం చేసుకున్నారు. మన్‌దీప్ జంగ్రా (69 కేజీలు) గోల్డ్ మెడల్‌ను సాధించాడు. మహిళల విభాగంలో సోనియా లాథర్ (57 కేజీలు), లవ్‌లినా బోర్గోహెయిన్ (69 కేజీలు), హిమాంశు శర్మ (49 కేజీలు), ఇతాష్ ఖాన్ (56 కేజీలు) సిల్వర్ పతకాలు అందుకున్నారు.

06/25/2018 - 04:59

చెన్నై, జూన్ 24: చెన్నైకి చెందిన 12 ఏళ్ల ఆర్.ప్రజ్ఞానంద ప్రపంచంలోనే అతిచిన్న రెండో గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. ఇటలీలో ఆదివారం జరిగిన చెస్ గ్రెండైన్ ఓపెన్‌లో పాల్గొన్న ఈ చెన్నై చిన్నోడు తన ప్రత్యర్థి, గ్రాండ్‌మాస్టర్ ప్రుజ్‌సెర్స్ రొనాల్డ్‌ను ఫైనల్ రౌండ్‌లో ఓడించడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

06/25/2018 - 05:16

ఫిఫా వరల్డ్‌కప్ గ్రూప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అప్రతిహత విజయాలు నమోదు చేసింది. ఆదివారం పసికూన పనామాను రికార్డు గోల్స్ (6-1)తో చిత్తుచేసి నాకౌట్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌తో ఇంగ్లాండ్ రికార్డులను తిరగరాసింది. హ్యాట్రిక్ గోల్స్‌తో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ రికార్డుల మోత మోగించాడు.
*

06/24/2018 - 06:41

బ్రెడా (నెదర్లాండ్స్), జూన్ 23: భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో శనివారం జరిగిన చాంపియన్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఓపెనింగ్ మ్యాచ్‌లో 4-0తో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైన భారత్ ఆటగాళ్లు ఈ మ్యాచ్ ద్వారా ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకున్నారు.

06/24/2018 - 06:41

మాస్కో, జూన్ 23: ఫిపా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో పనామాతో జరిగిన పోరులో రెండు గోల్స్ చేసిన బెల్జియం స్టార్ స్ట్రయికర్ రొమేలు లుకాకు 3-0తో జట్టును గెలిపించాడు. ఇపుడు శనివారం టునీషియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో తన సత్తా ఏమిటో మరోసారి లోకానికి చాటిచెప్పాడు. టునీషియాతో గ్రూప్-జీలో జరిగిన మ్యాచ్‌లో రొమేలు మరింత రెచ్చిపోయి ఆడాడు.

06/24/2018 - 06:40

కిలినిన్‌గ్రాడ్, జూన్ 23: గోల్ చేసిన ఆటగాడు గర్జించటం ప్రపంచకప్‌లో సర్వసాధారణం కావొచ్చు. కానీ, ఆ గర్జనకు అర్థం, సంకేతానికి పరమార్థం ఉంటే.. కచ్చితంగా చర్చకు తావిస్తుంది. కిలినిన్‌గ్రాడ్ వేదికగా శుక్రవారం అర్థరాత్రి స్విట్జర్లాండ్ -సెర్బియా జట్ల మధ్య సాగిన ఫుట్‌బాల్ యుద్ధమే ఇందుకు నిదర్శనం. మ్యాచ్‌లో స్విస్ జట్టు 2-1 తేడాతో సెర్బియాపై విజయం సాధించింది.

06/24/2018 - 06:39

రొస్టోవ్ ఆన్ డాన్ (రష్యా), జూన్ 23: ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీకి చుక్కలు చూపించిన మెక్సికో శనివారం దక్షిణ కొరియాతో గ్రూప్-ఎఫ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 2-1తో ఘన విజయం సాధించింది. మెక్సికో స్టార్ ఆటగాడు హెర్నాండెజ్ తమ దేశం తరఫున ఇంతవరకు 104 మ్యాచ్‌లు ఆడగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో గోల్ చేయడంతో అతని ఖాతాలో మొత్తం 50 గోల్స్ నమోదయ్యాయి.

Pages