S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/22/2018 - 01:09

దుబాయ్, జూన్ 21: దుబాయ్‌లో శుక్రవారం నుంచి జరుగనున్న ఆరు దేశాల మధ్య జరిగే ‘కబడ్డీ మాస్టర్స్ దుబాయ్ 2018’లో భారత్ జట్టు ఫేవరిట్‌గా నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఆసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, ఇరాన్, కొరియా టీమ్‌లకు ఈ టోర్నమెంట్ అద్భుత అవకాశాలకు వేదిక కానుంది.

06/22/2018 - 01:26

న్యూఢిల్లీ, జూన్ 21: భారత్ షటిల్ బ్యాడ్మింటన్‌లో అగ్రశ్రేణి క్రీడాకారునిగా కొనసాగుతున్న కిడాంబి శ్రీకాంత్ మరో ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యాడు. స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ 2017 సంవత్సరానికిగాను శ్రీకాంత్‌ను ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేసింది. షటిల్ బ్యాడ్మింటన్‌లో అద్భుత ప్రదర్శనకుగాను అతను ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.

06/22/2018 - 01:07

టాంటన్, జూన్ 21: ఇంగ్లాండ్ క్రికెట్‌లో పురుషులు, మహిళల జట్లు రికార్డులను తిరగరాస్తున్నారు. రెండు రోజుల కిందట ఆస్ట్రేలియాతో జరిగిన పురుషుల మూడో వనే్డలో ఇంగ్లాండ్ (481/6) ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇపుడు తాజాగా మహిళల జట్టు సైతం సరికొత్త రికార్డును తిరగరాసింది.

06/22/2018 - 01:05

సోచి (రష్యా), జూన్ 21: బ్రెజిల్ సాకర్ స్టార్ దిగ్గజ ఆటగాడు నేమార్ తన తదుపరి మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అన్న అనుమానం ఎవరికీ అక్కర్లేదని, అతను తప్పకుండా బిగ్ ఫైట్‌లో పాల్గొంటాడని బ్రెజిల్ సాకర్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో తమ తదుపరి మ్యాచ్‌లో కోస్టారికా జట్టుతో బ్రెజిల్ తలపడనుంది. ఇందుకు వీలుగా రెండురోజులపాటు ఈ జట్టు సభ్యులంతా గట్టి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడారు.

06/21/2018 - 02:16

మాస్కో: ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ బి మ్యాచ్‌ను క్రిస్టియానో కిక్కెక్కించాడు. మాడ్రిడ్ స్టార్ మహా వేగాన్ని చూసి ఫుట్‌బాల్ అభిమానులు నోరెళ్లబెట్టారు. 1-0తో మొరాకోను మట్టికరిపించిన పోర్చుగల్ ప్రతాపాన్ని చూసి ‘రోనాల్డో ఒక్కడు చాలు’ అంటూ నినాదాలు చేశారు. ఆట మొదలైన దగ్గర్నుంచీ ముగిసే వరకూ మైదానం మొత్తం ‘సీఆర్7 సీఆర్7’ (రొనాల్డో ముద్దుపేరు) అంటూ హోరెత్తిపోయింది.

06/21/2018 - 02:11

యెకాటెరిన్‌బర్గ్ (రష్యా), జూన్ 20: ప్రపంచాన్ని ఊపేస్తున్న ఫీవర్ ఫిఫా వరల్డ్ కప్ 2018. డిఫెండింగ్ చాంపియన్లు, హాట్ పేవరేట్లు, గ్రూపు ఫేవరేట్లు, ఆయా జట్లలో స్టార్ ఆటగాళ్లు.. ఎవరెన్ని గోల్స్ చేశారు.. ఎన్ని చేస్తారు.. అనుసరిస్తున్న వ్యూహాలు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ. రష్యాలో లైవ్ చూస్తున్నా, ఇళ్లలో టీవీల ముందు కూర్చుని మ్యాచ్‌లు పరికిస్తున్నా ఈ సీజన్ హాట్ టాపిక్ మాత్రం ఫిఫా వరల్డ్ కప్.

06/21/2018 - 02:13

రొస్టోవ్ ఆన్ డాన్, జూన్ 20: ఫిపా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం రాత్రి గ్రూప్-ఏలో జరిగిన రెండో మ్యాచ్‌లో సౌదీ అరేబియాపై ఉరుగ్వే 1-0 తేడాతో విజయం సాధించింది. ఈ సౌతాఫ్రికన్ దేశ కీలక ఆటగాడు లూయిస్ సూరెజ్ ఉరుగ్వేను ఒంటిచేత్తో గెలిపించాడు. ఇది సూరెజ్‌కు 100వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఆట ఆరంభం నుండే ఇరు జట్ల మధ్య హోరాహోరీగా పోరు కొనసాగింది.

06/21/2018 - 02:09

చిత్రం: మలి విడత గ్రూప్ మ్యాచ్‌లోనూ ఆతిథ్య దేశం రష్యా తన సత్తా చాటుకుంది. ప్రత్యర్థి జట్టు ఈజిప్ట్‌ను మట్టికరిపించి 3-1 స్కోరుతో ఆధిక్యంతో పరిగెడుతుంది. ఆట ప్రథమార్థంలో రెండు జట్లూ ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. హోరాహోరీగా మొదలైన ద్వితీయార్థం ఆటలో 47వ నిమిషంలో ఈజిప్ట్ ఆటగాడు అహ్మద్ ఫతే సెల్ఫ్ గోల్ చేసి రష్యాను ఆధిక్యంలో నిలబెట్టాడు.

06/21/2018 - 01:40

న్యూఢిల్లీ, జూన్ 20: దేశంలో అథ్లెటిక్స్‌ను క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడం ద్వారా క్రీడాకారులను తయారు చేసేందుకు వీలుగా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఐఎఫ్) రానున్న ఐదేళ్ల కాలంలో వెయ్యిమంది నైపుణ్యం కలిగిన కోచ్‌లను నియమించనుంది. తగిన కార్యాచరణతో ముందుకెళ్తూ, గతనెలలో దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో లెవెల్-1 పేరిట తొమ్మిది వర్క్‌షాపులు నిర్వహించింది.

06/21/2018 - 01:39

న్యూఢిల్లీ, జూన్ 20: మంగోలియాలో జరుగుతున్న ఉలాన్‌బాతర్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఆరుగురు భారత బాక్సర్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల విభాగంలో ఆశిష్ (64 కేజీలు), మన్‌దీప్ జంగ్రా (69 కేజీలు), సల్మాన్ షేఖ్ (52 కేజీలు), శివతోపాటు మహిళల విభాగంలో జాతీయ చాంపియన్ సర్జుబాల దేవి (51 కేజీలు), సీనియర్ బాక్సర్ సరితాదేవి క్వార్టర్ ఫైనల్‌లో చోటు దక్కించుకున్నారు.

Pages