S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/30/2018 - 00:55

న్యూఢిల్లీ, జూన్ 29: లండన్‌లో జరగనున్న మహిళల వరల్డ్ కప్ హాకీ టోర్నీకి భారత జట్టు ఎంపికైంది. జూలై 21నుంచి జరుగనున్న టోర్నీ గ్రూప్-బిలో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ (వరల్డ్ నెంబర్ 2) సహా యూఎస్ (వరల్డ్ నెంబర్ 7), ఐర్లాండ్ (వరల్డ్ నెంబర్ 16), భారత జట్లు ఉంటాయి. భారత జట్టుకు కెప్టెన్‌గా ఫార్వార్డ్ స్ట్రైకర్ రాణీ రాంపాల్, వైస్ కెప్టెన్‌గా గోల్ కీపర్ సవిత వ్యవహరిస్తారు.

06/30/2018 - 00:54

బ్రెడా (నెదర్లాండ్స్), జూన్ 29: వరుస విజయాలతో దూసుకెళ్లిన భారత హాకీ జట్టుకు ఆతిథ్య దేశం నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ప్రాణ సంకటంగా మారింది. బ్రెడాలో జరుగుతున్న చాంపియన్స్ హాకీ ట్రోఫీ టోర్నమెంట్‌లో శుక్రవారం జరుగనున్న చివరి మ్యాచ్ భారత్‌కు అగ్నిపరీక్షే. ఆరు దేశాల జట్లు ఆడుతున్న రౌండ్ రాబిన్ టోర్నీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే ఫైనల్లో తలపడతాయి.

06/30/2018 - 00:52

డబ్లిన్, జూన్ 29: భారత బ్యాట్సమెన్లు రెచ్చిపోయారు. ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ-20లో పరుగుల విధ్వంసం సృష్టించారు. వరుస బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయిన భారత్ 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. లోకేష్ రాహుల్ (70, 36 బంతుల్లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు), సురేష్ రైనా (69, 45 బంతుల్లో 5్ఫర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోయారు.

06/30/2018 - 00:50

ఫ్లోరిడా, జూన్ 29: డోపింగ్ పరీక్ష నమూనాల సేకరణకు అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ దొరకలేదా? అంటే అవుననే అంటున్నారు. నమూనాల సేకరణకు యూఎస్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆమె ఇంటికి వెళ్లినపుడు ఆమె అందుబాటులో లేదు. ఎదురుచూసిన యూఎస్‌ఏడిఏ సభ్యులు చివరకు నమూనాలు సేకరించకుండానే తిరుగుముఖం పట్టారట.

06/30/2018 - 00:49

కౌలాలంపూర్, జూన్ 29: మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పోరులో భారత షట్లర్‌లు కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధు ప్రతిభావంతమైన ఆటతీరు కోనసాగిస్తున్నారు. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ 750 టోర్నీ పురుషుల సింగిల్స్‌లో కిదాంబి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు.

06/29/2018 - 05:01

సమర (రష్యా): ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో గ్రూప్-హెచ్‌లో గురువారం ముగిసింది. సంచలనాల సెనెగల్‌పై కొలంబియా 1-0తో గెలుపొందగా, మరో మ్యాచ్‌లో జపాన్‌పై పోలాండ్ 1-0తో విజయం సాధించింది. ఈ రెండు జట్లు తమ తదుపరి మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ లేదా బెల్జియంతో తలపడతాయి.

06/28/2018 - 23:52

మాస్కో, జూన్ 28: రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ చిత్తుగా ఓడిపోయినందుకు ఇంటర్నెట్ వేదికగా పరిహాసాలు, చలోక్తులు, విమర్శలు, జోక్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్‌లో జర్మనీ ఒక గోల్ కూడా చేయకుండా 2-0తో ఘోరంగా అవమానం పాలైంది.

06/29/2018 - 00:01

నిజ్‌హ్నీ నొవ్‌గోరాడ్ (రష్యా)/మాస్కో, జూన్ 28: రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో లీగ్ దశలో పోరు దాదాపు ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి గ్రూప్-ఈలో స్విట్జరాండ్, కోస్టారికా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు సమానంగా రెండేసి గోల్స్ చేయడంతో మ్యాచ్ డ్రా అయింది.

06/28/2018 - 23:47

ఫ్రాంక్‌ఫర్ట్ అమ్ మెయిన్, జూన్ 28: ఫిఫా వరల్డ్ కప్‌లో దక్షిణ కొరియా చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ గురువారం స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా ‘సారీ..మీ అందరి అంచనాలను అందుకోలేకపోయాం..అన్నింటా విఫలమయ్యాం..క్షమించండి’ అంటూ జట్టు తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో దేశ ప్రజలు, అభిమానులను కోరింది.

06/28/2018 - 23:46

మలహైడ్ (ఐర్లాండ్), జూన్ 28: అంతర్జాతీయ ఫార్మాట్‌లో జరుగుతున్న టీ-20లో ప్రత్యర్జి జట్టును అశ్చర్యానికి గురిచేసే విధంగా పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఐర్లాండ్‌తో జరుగనున్న రెండు టీ-20 మ్యాచ్‌లతో పాటు ఇంగ్లాండ్‌తో జరుగనున్న టీ-20 సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ మిడిలార్డర్‌లో భారీ ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపాడు.

Pages