S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/12/2018 - 03:57

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 11: భారత సీనియర్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ కామనె్వల్త్ గేమ్స్‌లో పతకాల వేటను కొనసాగిస్తున్నది. మహిళల 48 కిలోల విభాగంలో సెమీ ఫైనల్‌లో ఆమె తన ప్రత్యర్థి, శ్రీలంక బాక్సర్ అనుష దిల్‌రుక్షి కొడితువకును సులభంగా ఓడించి, టైటిల్‌వైపు మరో అడుగు వేసింది.

04/12/2018 - 03:55

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 11: కామనె్వల్త్ గేమ్స్ మహిళల షూటింగ్‌లో భారత్‌కు బుధవారం మరో స్వర్ణ పతకం లభించింది. డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో గట్టిపోటీని ఎదుర్కొన్న శ్రేయాసీ సింగ్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా షూటర్ ఎమ్మా కాక్స్ నుంచి ఆమెకు తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. ఇద్దరూ చెరి 96 పాయింట్లు సంపాదించారు.

04/12/2018 - 04:24

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 11: ఈసారి కామనె్వల్త్ గేమ్స్‌లో షూటర్ ఓం ప్రకాశ్ మిథర్వాల్ రెండో పతకాన్ని సాధించాడు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అతనికి కాంస్యం లభించింది. క్వాలిఫయర్స్‌లో అద్భుతంగా రాణించి, టాపర్‌గా ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన అతను మెడల్ రౌండ్‌లో అదే స్థాయిలో ప్రతిభ కనబరచలేకపోయాడు. మొత్తం 201.1 పాయింట్లు సంపాదించి మూడో స్థానంలో నిలిచాడు.

04/12/2018 - 04:30

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 11: బాడ్మింటన్ విభాగంలో భారత్ దూకుడును కొనసాగిస్తున్నది. కామనె్వల్త్ గేమ్స్ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌ను ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్న భారత్ సింగిల్స్ పోటీల్లోనూ రాణిస్తున్నది. తెలుగు తేజం పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ తదితరులు తమతమ విభాగాల్లో ప్రీ క్వార్టర్స్ చేరారు. బుధవారం పురుషుల సింగిల్స్‌లో అతిష్ లుబాను ఢీకొన్న శ్రీకాంత్ 21-13, 21-10 తేడాతో గెలిచాడు.

04/12/2018 - 03:51

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 11: భారత టీనేజ్ సంచలనం హిమ దాస్ పతకం కోసం చెమటోడ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. కామనె్వల్త్ గేమ్స్ మహిళల 400 మీటర్ల పరుగులో ఆమె తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసినప్పటికీ, ఆరో స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. మంళవారం నాటి సెమీ ఫైనల్స్‌లో లక్ష్యాన్ని 51.53 సెకన్లలో చేరుకొని, స్వదేశంలో తన ఉత్తమ ప్రదర్శనను అధిగమించింది.

04/12/2018 - 04:32

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 11: కామనె్వల్త్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు టైటిల్ వేటను కొనసాగిస్తున్నది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌లో పటిష్టమైన ఇంగ్లాండ్‌తో చివరి వరకూ పోరాడి, 4-3 తేడాతో విజయం సాధించి, ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఇరు జట్ల ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డి గోల్స్ కోసం ప్రయత్నించడంతో, ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

04/11/2018 - 04:15

హైదరాబాద్: క్రికెట్‌లో అంపైర్ నిర్ణాయమే ప్రధానం. అలాంటి అంపైర్ తప్పులు చేస్తే ఎలా? సోమవారం రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఘోర తప్పిదం చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ పేస్‌బౌలర్ బెన్ లాగ్లిన్ ఓవర్‌లో ఏడు బంతులు వేశాడు.

04/11/2018 - 01:53

బ్రిస్బేన్, ఏప్రిల్ 10: భారత ఏస్ షూటర్ హీనా సిధు కామనె్వల్త్ గేమ్స్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఈ పోటీల్లో ఆమెకు ఇది రెండో పతకం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 16 ఏళ్ల యువ సంచలనం మనూ భాకర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, హీనాకు రజత పతకం లభించిన విషయం తెలిసిందే. ఆమె మొత్తం 38 పాయింట్లు సంపాదించి, తన ప్రత్యర్థులను వెనక్కు నెట్టేసి, అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

04/11/2018 - 01:51

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 10: కామనె్వల్త్ గేమ్స్‌లో మంగళవారం భారత్ ఖాతాలో పారా-పవర్‌లిఫ్టర్ సచిన్ చౌదరి మరో పతకాన్ని చేర్చాడు. క్వాలిఫయింగ్ హీట్స్‌ను పూర్తి చేసుకొని ఫైనల్‌లోకి అడుగుపెట్టిన 10 మంది పవర్‌లిఫ్టర్ల మధ్య తీవ్ర స్థాయిలో పోరు కొనసాగింది. చౌదరి 181 కిలోల బరువునెత్తి కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

04/11/2018 - 01:50

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 10: కామనె్వల్త్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది. మంగళవారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌ని 2-1 తేడాతో గెల్చుకొని, సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్టు హర్మన్‌ప్రీత్ సింగ్ చేసిన రెండు గోల్స్ భారత్‌ను విజయపథంలో నడిపించాడు.

Pages