S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/02/2017 - 00:48

కొలంబో, సెప్టెంబర్ 1: శ్రీలంక సీనియర్ పేసర్ లసిత్ మలింగ త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ విషయాన్ని అతనే సూచనప్రాయంగా వెల్లడించాడు.

09/02/2017 - 00:47

పోర్టో, సెప్టెంబర్ 1: వరల్డ్ కప్ సాకర్ యూరోపియన్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో ఫారో ఐలెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ సూపర్‌స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మరోసారి అద్భుతమైన హ్యాట్రిక్‌తో సత్తా చాటుకోవడంతో పాటు ఆల్‌టైమ్ ఇంటర్నేషనల్ గోల్‌స్కోరర్ల జాబితాలో బ్రెజిల్‌కు చెందిన మాజీ దిగ్గజ ఆటగాడు పీలేని అధిగమించాడు.

09/01/2017 - 00:28

న్యూఢిల్లీ, ఆగస్టు 31: గ్లాస్గోలో ఇటీవల జరిగకిన ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకం సాధించిన తెలుగు తేజం పివి సింధు, కాంస్య పతకాన్ని అందుకున్న సైనా నెహ్వాల్‌కు గురువారం క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది.

09/01/2017 - 00:26

కొలంబో, ఆగస్టు 31: ఓపెనర్ రోహిత్ శర్మ, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకాలతో రెచ్చిపోవడంతో, శ్రీలంకతో గురువారం జరిగిన నాలుగో వనే్డలో భారత్ వీరవిహారం చేసింది. చివరిలో మనీష్ పాండే (50 నాటౌట్), మహేంద్ర సింగ్ ధోనీ (49 నాటౌట్) కూడా రాణించడంతో, టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 375 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది.

09/01/2017 - 00:23

భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సి నిరోషన్ డిక్‌విల్లా బి ఏంజెలో మాథ్యూస్ 104, శిఖర్ ధావన్ సి మిలింద పుష్పకుమార బి విశ్వ ఫెర్నాండో 4, విరాట్ కోహ్లీ సి దిల్షాన్ మునవీర బి లసిత్ మలింగ 131, హార్దిక్ పాండ్య సి వనిదు హసరంగ బి ఏంజెలో మాథ్యూస్ 19, లోకేష్ రాహుల్ సి వనిదు హసరంగ బి అకిల దనంజయ 7, మనీష్ పాండే 50 నాటౌట్, మహేంద్ర సింగ్ ధోనీ 49 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 375.

09/01/2017 - 00:21

న్యూయార్క్, ఆగస్టు 31: నిషిద్ధ మాదక ద్రవ్యాన్ని వినియోగించిన కారణంగా సస్పెన్షన్‌కు గురై, శిక్షాకాలం ముగిసిన తర్వాత మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్న ప్రపంచ మాజీ నంబర్ వన్, రష్యా బ్యూటీ మరియా షరపోవా ఇక్కడ యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మూడో రౌండ్ చేరింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన ఆమె రెండో రౌండ్‌లోలో హంగరీకి చెందిన తిమియా బబోస్‌ను 6-7, 6-4, 6-1 తేడాతో ఓడించింది.

09/01/2017 - 00:19

న్యూయార్క్, ఆగస్టు 31: మేటి స్టార్లకు సైతం వణుకు పుట్టిస్తున్న జర్మనీ యువ ఆటగాడు, నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రస్థానం రెండో రౌండ్‌లోనే ముగిసింది. క్రొయేషియాకు చెందిన బొర్నా కొరిక్ అతనిపై 3-6, 7-5, 7-6, 7-6 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేశారు.

09/01/2017 - 00:28

ముంబయి, ఆగస్టు 31: ప్రో కబడ్డీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ పోరాడి గెలిచింది. తమళ తలైవాస్‌ను ఢీకొన్న టైటాన్స్ 33 పాయింట్లు సాధించింది. తలైవాస్ 28 పాయింట్లే చేయడంతో, టైటాన్స్ ఐదు పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఈ జట్టు తరఫున సోమ్‌వీర్ 10 పాయింట్లతో రాణించాడు. నీలేష్ సాలంకే 5, ఫర్హాద్ మిల్గర్ధన్ 4 చొప్పున పాయింట్లు చేశారు.

08/31/2017 - 00:46

హైదరాబాద్: వచ్చే ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం సాధించాలని తెలుగు తేజం పివి సింధును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఇటీవల గ్లాస్గోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఫైనల్ చేరినప్పటికీ నవోమీ ఒకుహరా చేతిలో పరాజయాన్ని చవిచూసిన సింధు రజత పతకాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

08/31/2017 - 00:51

కొలంబో: శ్రీలంకపై ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను ఇప్పటికే 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా వనే్డల్లోనూ లంకకు వైట్‌వాష్ వేయాలని కోహ్లీ బృందం పట్టుదలతో ఉంది.

Pages