S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/31/2017 - 00:45

కొలంబో: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురువారం శ్రీలంకతో జరిగే నాలుగో వనే్డలో సరికొత్త మైలురాయిని చేరుకోనున్నాడు. కెరీర్‌లో అతనికి ఇది 300వ వనే్డ కావడం విశేషం. భారత్ తరపున ఇప్పటి వరకూ సచిన్ తెండూల్కర్ (463 మ్యాచ్‌లు), రాహుల్ ద్రవిడ్ (344 మ్యాచ్‌లు), మహమ్మద్ అజరుద్దీన్ (334 మ్యాచ్‌లు), సౌరవ్ గంగూలీ (311 మ్యాచ్‌లు) మాత్రమే ఇంత వరకూ మూడు వందల వనే్డల క్లబ్‌లో ఉన్నారు.

08/31/2017 - 00:44

ఢాకా: ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. టెస్టుల్లో ఆసీస్‌పై ఆ జట్టుకు ఇదే తొలి విజయం. మొత్తం మీద 101 టెస్టుల్లో బంగ్లాదేశ్ 10వ విజయాన్ని సాధించింది.

08/31/2017 - 00:44

ముంబయి: ప్రో కబడ్డీలో బుధవారం జరిగిన మ్యాచ్‌ని యు ముంబా గెల్చుకుంది. హర్యానా స్టీలర్స్‌పై ఆ జట్టు ఆరు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. అనూప్ కుమార్ 8, కుల్దీప్ సింగ్ 7, శ్రీకాంత్ జాధవ్ 6 చొప్పున పాయింట్లతో రాణించడంతో యు ముంబా 38 పాయింట్లు సాధించగలిగింది. హర్యానా 32 పాయింట్లతో సరిపుచ్చుకుంది. వికాస్ కంకోలా 9, వజీర్ సింగ్ 7 పాయింట్లు చేసినప్పటికీ, తమ జట్టును ఆదుకోలేకపోయారు.

08/30/2017 - 01:04

న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును గెలుచుకున్న తొలి పారా అథ్లెట్‌గా దేవేంద్ర జఝరియా చరిత్ర సృష్టించాడు.

08/30/2017 - 01:49

హైదరాబాద్, ఆగస్టు 29: అంతర్జాతీయ బాడ్మింటన్ మ్యాచ్‌లలో పోటీ మరింత తీవ్ర రూపం దాల్చిందని, దీంతో సుదీర్ఘమైన ర్యాలీలతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయని ‘తెలుగు తేజం’ పివి.సింధు (22) అభిప్రాయపడింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆదివారం సుదీర్ఘంగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి నొజోమీ ఒకుహరాతో హోరాహోరీగా తలపడిన సింధు చివరికి రజత పతకాన్ని గెలుచుకుంది.

08/30/2017 - 00:57

హాంబర్గ్, ఆగస్టు 29: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ గౌరవ్ బిధూరీ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. వైల్డ్‌కార్డుతో ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్న అతను మంగళవారం ఇక్కడ 56 కిలోల బాంటమ్ వెయిట్ విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో ట్యునీషియాకి చెందిన బిలెల్ మహ్మదీని మట్టికరిపించి భారత్‌కు పతకాన్ని ఖాయం చేశాడు.

08/30/2017 - 00:55

న్యూయార్క్, ఆగస్టు 29: డోపింగ్ వ్యవహారంలో 15 నెలల పాటు నిషేధాన్ని పూర్తి చేసుకుని మళ్లీ ర్యాకెట్ చేతబట్టిన రష్యా అందాల భామ మరియా షరపోవా (30) యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభాన్ని సాధించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో ఆమె 6-4, 4-6, 6-3 తేడాతో రుమేనియాకి చెందిన ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణి సిమోనా హాలెప్ (25)ను మట్టికరిపించి తన సత్తా చాటుకుంది.

08/30/2017 - 00:54

కొలంబో, ఆగస్టు 29: ఇటీవలి కాలంలో తన సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడలేక పోతున్న శ్రీలంక క్రికెట్‌లో టీమిండియాతో సిరీస్ ముగియక ముందే పెనుమార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

08/30/2017 - 00:53

న్యూఢిల్లీ, ఆగస్టు 29: బిసిసిఐ డొమెస్టిక్ క్యాలెండర్‌నుంచి దులీప్ ట్రోఫీని తొలగించవద్దని బిసిసిఐ పాలకుల కమిటీ (సిఓఏ) బిసిసిఐని మంగళవారం ఆదేశించింది.

08/30/2017 - 00:52

హైదరాబాద్, ఆగస్టు 29: ఇటీవల ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మ్యాచ్‌ల షెడ్యూలింగ్ నిజంగా ఒక సమస్యగానే ఉందని, అయితే క్రీడాకారులు అలాంటి వాటికి అలవాటు పడాల్సిన అవసరం ఉందని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పి గోపీచంద్ అన్నాడు.‘ఒక విధంగా అది ఒక సమస్యే. అయితే ఒక్కోసారి ఆటగాళ్లు ఆ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. పివి సింధు సెమీఫైనల్ మ్యాచ్ శనివారం రాత్రి జరిగింది.

Pages