S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/28/2017 - 00:00

న్యూయార్క్, ఆగస్టు 27: ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ఆండీ ముర్రే గాయం కారణంగా యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఏడాది చివరి గ్రాండ్ శ్లామ్ నుంచి గాయాల కారణంగా వైదొలగిన స్టార్ల జాబితాలో ముర్రే కూడా చేరాడు.

08/27/2017 - 23:59

లాస్ వెగాస్, ఆగస్టు 27: ఓటమి ఎరుగని స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ కెరీర్‌లో 50వ విజయాన్ని పూర్తి చేశాడు. 49 ఫైట్స్‌లో ఒక్క పరాజయం కూడా లేకుండా కెరీర్‌ను రెండేళ్ల క్రితం ముగించిన మేవెదర్ ఆతర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నాడు. భారీ ప్రైజ్‌మనీతో ఆఫర్ రావడంతో కానర్ మెక్‌గ్రెగర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు.

08/27/2017 - 01:07

పల్లేకల్, ఆగస్టు 26: శ్రీలంకతో ఆదివారం జరిగే మూడో వనే్డను గెల్చుకొని, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా విరాట్ కోహ్లీ బృందం బరిలోకి దిగుతున్నది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా మూడో విజయాన్ని సాధించడం ఖాయంగా కనిపిస్తున్నది.

08/27/2017 - 01:07

పల్లేకల్, ఆగస్టు 26: ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో వరుసగా రెండు పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ, భారత్‌ను ఓడించే సత్తా తమకు లేకపోలేదని శ్రీలంక స్టాండ్-ఇన్ కెప్టెన్ చామర కపుగడేర అన్నాడు. టీమిండియాపై గెలుస్తామని శనివారం అతను విలేఖరులతో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశాడు. వరుస పరాజయాలతో జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోయిందని వస్తున్న విమర్శలను అతను తోసిపుచ్చాడు.

08/27/2017 - 01:05

లంకను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో టాప్ పేసర్ లసిత్ మలింగ ఫామ్‌లో లేకపోవడం ఒకటి. మలింగ మొదటి వనే్డలో 8 ఓవర్లు బౌల్ చేసి 52 పరుగులు సమర్పించుకున్నాడు. భారత బ్యాటింగ్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన అతను ఒక్క వికెట్ కూడా కూల్చలేదు. రెండో మ్యాచ్‌లో మరోసారి 8 ఓవర్లు వేశాడు. 49 పరుగులిచ్చినప్పటికీ వికెట్‌ను సాధించడంలో విఫలమయ్యాడు. అతని ఫామ్‌పై లంక మీడియాలో చర్చ జరుగుతున్నది.

08/27/2017 - 01:03

పల్లేకల్: అజింక్య రహానేకు మూడో వనే్డలో ఆడే అవకాశం లభిస్తుందా అన్నది అనుమానమే. కేదార్ జాధవ్ విఫలమయ్యాడు కాబట్టి, రహానేను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ, రోహిత్ శర్మను కాదని అతనిని జట్టులోకి తీసుకునే అవకాశం లేదని విశే్లషకులు అంటున్నారు. గాయాల కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ ఇప్పుడు ఫిట్నెస్‌తో ఉన్నాడు. ఫామ్‌ను కూడా కొనసాగిస్తున్నాడు.

08/27/2017 - 01:01

గ్లాస్గో, ఆగస్టు 26: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో నిరుటి రన్నరప్‌గా బరిలోకి దిగిన హైదరాబాదీ సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్స్‌లో ఓటమిపాలైంది. నొజోమీ ఒకుహరాతో ఒక గంట, 14 నిమిషాలు పోరాడిన ఆమె చివరికి 18-21, 21-14, 21-15 తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

08/27/2017 - 00:59

హాంబర్గ్, ఆగస్టు 26: ఇక్కడ జరుగుతున్న 19వ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ శుభారంభం చేసింది. పురుషుల 49 కిలోల విభాగంలో అమిత్ ఫంగల్, 56 కిలోల ఈవెంట్‌లో గౌరవ్ బింధూరి విజయాలను నమోదు చేశారు. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన 21 ఏళ్ల అమిత్ తన తొలి రౌండ్ ఫైట్‌లో ఇటలీకి చెందిన ఫెడెరికో సెరాను ఓడించాడు.

08/27/2017 - 00:59

లాస్ వెగాస్, ఆగస్టు 26: పరాజయం అన్నదే ఎరుగని ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ కెరీర్‌లో 50వ విజయాన్ని నమోదు చేస్తాడా? లేక చాలెంజర్ కానన్ మెక్‌గ్రెగర్ చేతిలో కంగుతిని, కెరీర్‌లో తొలి పరాజయాన్ని చవిచూస్తాడా? అన్న ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. ఇప్పటి వరకూ 49 ఫైట్స్‌లో పాల్గొని, అన్నింటినీ గెల్చుకున్న మేవెదర్ మరో విజయాన్ని నమోదు చేసి, 50 ఫైట్లు.. 50 విజయాలతో కెరీర్‌ను ముగించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

08/27/2017 - 00:57

లండన్: ఫ్లాయిడ్ మేవెదర్‌ను ఢీ కొంటున్న కానర్ మెక్‌గ్రెగర్‌కు తీవ్ర గాయాలు తప్పవేమోనని బ్రిటన్ స్టార్ బాక్సర్ అమిర్ ఖాన్ అనుమానం వ్యక్తం చేశాడు. 28 ఏళ్ల మెక్‌గ్రెగర్ ఇప్పటి వరకూ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్‌లో పాల్గొనకపోవడమే తన అనుమానానికి కారణమని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

Pages