S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/18/2017 - 01:24

విజయవాడ, డిసెంబర్ 17: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ దాదాపు 1.75 లక్షల కోట్ల రూపాయలు ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.56 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ రూపొందించటం తెలిసిందే. ఈసారి అదనంగా 20వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ అంచనాలు తయారు చేయనున్నారు.

12/18/2017 - 01:22

విజయవాడ, డిసెంబర్ 17: ప్రతిష్ఠాత్మకమైన పోలవరం మెగా జల విద్యుత్కేంద్రం నిర్మాణాన్ని 2022 మార్చి నాటికి పూర్తి చేయాలని ఏపీ జెన్కో అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని, విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో నాణ్యతను పాటించాలన్నారు. వివిధ ఇంధన ప్రాజెక్టుల పురోగతిపై విజయవాడ నుంచి టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం సమీక్షించారు.

12/18/2017 - 00:39

హైదరాబాద్, డిసెంబర్ 17: హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాగుట్టు రట్టయింది. ఓ స్టార్ హోటల్‌లో సినీ, టీవీ ఆర్టిస్టులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు ముఠా సభ్యులతో పాటు ఇద్దరు ఆర్టిస్టులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 55,000లు నగదుతోపాటు మూడు సెల్‌ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.

12/17/2017 - 03:46

హైదరాబాద్, డిసెంబర్ 16: ఆంగ్లభాషా బోధనలో ప్రపంచ నిపుణులైన బ్రిటిష్ కౌన్సిల్ , రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ ‘జియో చాట్’పై ఇంగ్లీషు చానల్ ప్రారంభించింది. జియో చందాదారులకు అదే విధంగా జియోచాట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారికి ఉచితంగా ఈ ఇంగ్లీషు చానల్ అందుతుంది.

12/17/2017 - 02:18

రాజమహేంద్రవరం, డిసెంబర్ 16: పట్టిసీమ స్ఫూర్తితో అఖండ గోదావరి నది ఎడమ గట్టుపై సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకం నిర్మాణం గడువు దాటినా నీళ్లు మాత్రం పోలవరం కాలువ దాటలేదు. ఏలేరు జలాశయానికి ప్రత్యామ్నాయ విధానంలోనే గోదావరి జలాలు అదించడం జరిగింది. అది కూడా 750 క్యూసెక్కులు మాత్రమే. వాస్తవానికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణ గడువు 9 నెలలు పూర్తయింది.

12/17/2017 - 01:55

హైదరాబాద్, డిసెంబర్ 16: ఒక పదం ఎన్నో విస్ఫోటనాలను సృష్టించగల అణుబాంబు లాంటిదని తెలంగాణ విద్యుత్‌శాఖా మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లోభాగంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బిరుదురాజు రామరాజు ప్రాంగణంలో సామల సదాశివ వేదికపై నిర్వహించిన పద్య కవితా సౌరభం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భాష అవసరంగా పుట్టిన సాధనమని, ప్రపంచంలో ఎన్నో భాషలు ఉద్భవించి అంతరించిపోయాయని అన్నారు.

12/17/2017 - 01:51

హైదరాబాద్, డిసెంబర్ 16: ‘పైసల సమాజంగా కాకుండా మానవతా విలువలు ఉన్న సమాజంగా తీర్చిదిద్దండి..’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రచయితలు, కవులకు పిలుపునిచ్చారు. మాట కంటే పాట పదునైందన్న విషయాన్ని తెలంగాణ ఉద్యమం నిరూపించిందన్నారు. ప్రపంచ తెలుగు మహా సభల రెండో రోజు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన బృహత్ కవి సమ్మేళనం కార్యక్రమాలకు మంత్రి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

12/17/2017 - 01:49

హైదరాబాద్, డిసెంబర్ 16: ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసిన అతిథులకు, సాహిత్య అభిమానులకు నోరూరించే వంటకాలతో తెలంగాణ పౌరసరఫరాల శాఖ విందు ఏర్పాటు చేసింది. ఆరగించిన వారంతా ఆహా..! తెలుగు విందు బహు పసందు అంటూ సంబరపడ్డారు. ఐదు రోజులపాటు జరిగే సభలకు భోజన ఏర్పాట్ల బాధ్యతలను పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

12/17/2017 - 01:55

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణలో మాట్లాడే తెలుగు భాషకు ప్రత్యేకత ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల రెండోరోజు సందర్భంగా శనివారం ఎల్బీ స్టేడియంలోని పాల్కురికి సోమన ప్రాంగణంలో ‘తెలంగాణలో తెలుగు భాషావికాసం’ పేరిట జరిగిన సాహిత్య సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

12/17/2017 - 01:33

కంటినిండా తెలుగుదనం. కడుపునిండా తెలుగు భోజనం... ఇదీ రెండోరోజు ప్రపంచ తెలుగు మహాసభల ముఖచిత్రం. చారిత్రాక హైదరబాద్ నగరమంతా పల్లపరుచుకున్న ఆరు వేదికల మీద అనేక కార్యక్రమాలు తెలుగుదనాన్ని వండి వడ్డించాయ. తెలంగాణ భాషకు ఓ సాధికారత ఉందని, అసలు భాషా వికాసం సాగిందే ఇక్కడంటూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొంటే....

Pages