S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/03/2017 - 01:44

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణలో టిడిపికి బ్రహ్మాండమైన, అద్భుతమైన భవిష్యత్తు ఉందని, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన సమయంలో రాజకీయ వ్యూహాలను ఆవిష్కరిస్తానని, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రజాసమస్యల సాధనకు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చా రు.

11/03/2017 - 01:41

అమరావతి, నవంబర్ 2: శాసనసభకు పూర్తిస్థాయి కార్యదర్శి లేకుండానే సమావేశాలు ప్రారంభం కానుండటం చర్చనీయాంశమయింది. అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేసిన రామాచార్యులు ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు వద్ద చేరడంతో కొద్దినెలల నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది.

11/03/2017 - 01:39

హైదరాబాద్, నవంబర్ 2: కృష్ణా జలాలను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పంపకం చేసే అంశంపై శనివారం కృష్ణాబోర్డు సమావేశమై ఈ ఏడాది నీటి వినియోగం కేటాయింపులు ఖరారు చేయనుంది. 270 టిఎంసి నీరు కావాలని ఆంధ్ర, 150 టిఎంసి నీరు కేటాయించాలని తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే ఇండెంట్ పెట్టాయి. నాగార్జునసాగర్ కుడి, ఎడమకాల్వలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నీటిని రోజుకు ఐదు క్యూసెక్కుల చొప్పున విడుదల చేసింది.

11/03/2017 - 01:37

కాకినాడ, నవంబర్ 2: ప్రభుత్వం పేదలకు చౌకడిపోల ద్వారా సరఫరా చేసే బియ్యం దొడ్డిదారిలో విదేశాలకు తరలిపోకుండా గట్టి నిఘా ఏర్పాటుచేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. రాష్ట్రంలో ఏటా ధాన్యం దిగుబడిలో అగ్రస్థానంలో కొనసాగుతున్న తూర్పు గోదావరి జిల్లా నుండి బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతున్నట్టు ఆరోపణలున్నాయి. దీనిపై ప్రభుత్వానికి

11/03/2017 - 00:24

హైదరాబాద్, నవంబర్ 2: రాష్ట్ర రాజధానిలోని జలాశయాలను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో గురువారం ప్రజాప్రయోజనాల వాజ్యం (పిల్) దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన ఎం. షహీరాబేగం అనే మహిళ ఈ పిటీషన్‌ను వేశారు. జలాశయాలన్నీ కబ్జాకు గురవుతున్నాయని, పరిశ్రమల వ్యర్థాలు, గృహాల్లోని వ్యర్థాలు ఈ జలాశయాల్లోకి చేరి జలాశయాల నీరు కలుషితం అవుతున్నాయన్నారు.

11/03/2017 - 00:26

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణలో పగటివేళ, రాత్రివేళ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. గత వారం రోజుల నుండి ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడంతో చలి బాగా ఉంటోంది. జనం స్వెట్టర్లు వేసుకోవడం ప్రారంభించారు. రాజధాని నగరంలో సాధారణంగా వర్షాలు, ఎండలు ఏ విధంగా ఎక్కువగా ఉంటాయో, అదే విధంగా చలి కూడా ఎక్కువగా ఉంటోంది.

11/03/2017 - 00:20

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా యూనిట్‌గా టీచర్ పోస్టుల భర్తీలో న్యాయ అంశాలను ప్రశ్నిస్తూ కె బాలకృష్ణ ముదిరాజ్, కె భాను, రామమోహనరెడ్డిలు దాఖలు చేసిన పిటీషన్లను జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు కొట్టి వేశారు.

11/02/2017 - 01:11

నాగార్జునసాగర్, నవంబర్ 1: నాగార్జునసాగర్ నుండి బుధవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ లాంచి శ్రీశైలానికి బుధవారం ఉదయం 11గంటలకు మొదటిసారిగా బయలుదేరి వెళ్లిం ది. సాగర్ జలాశయం సాగర్ నుండి శ్రీశైలానికి లాంచి వెళ్లడానికి అనుకూలంగా నీటిమట్టం పెరగడంతో గత వారంరోజుల క్రితం శ్రీశైలానికి ట్రయల్ రన్ వేశారు. పర్యాటకులను బుధవారం నాడు మొదటిసారిగా 90 మందిని తీసుకెళ్లారు.

11/02/2017 - 01:09

హైదరాబాద్, నవంబర్ 1: జాతీయ స్థాయిలో ఉమ్మడి (సెంట్రల్ పూల్) వైద్య సీట్ల పరిధిలో చేరాలని ఎపి, తెలంగాణ రాష్ట్రాలు నిర్ణయించడం పట్ల లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రాలకు మేలే జరుగుతుందని, ప్రభుత్వాల తీరు అభినందనీయమని అన్నారు.

11/01/2017 - 23:50

న్యూఢిల్లీ, నవంబర్ 1: తెలుగు రాష్ట్రాల్లోని జడ్జీలు, న్యాయాధికారుల నియామకం, విభజన విషయంలో ఉమ్మడి హైకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను అందరూ పరిగణనలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ జడ్జీల అసోషియేషన్ సుప్రీం కోర్టు ముందు వాదనలు వినిపించింది.

Pages