S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/31/2017 - 04:03

హైదరాబాద్, అక్టోబర్ 30: ‘సిఎం కె. చంద్రశేఖర్‌రావుపై ఇది ఆఖరి పోరాటం’ అని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి అన్నారు. తనలో పసుపు రంగు రక్తం ఉన్నా, తెరాసను గద్దె దింపేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నానని అన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

10/31/2017 - 02:15

హైదరాబాద్, అక్టోబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రధానమైన హైడ్రాలజీకి అనుమతి లభించింది. కేంద్ర జల సంఘం నుం చి ఈమేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది.

10/31/2017 - 02:14

యాదగిరిగుట్ట రూరల్, అక్టోబర్ 30: హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని బాహుపేట సమీపంలో ఆర్టీసీ వజ్ర బస్సు ఆటోను ఢీకొట్టింది.

10/31/2017 - 02:12

హైదరాబాద్, అక్టోబర్ 30: హరితహారం కోసం ఖర్చు చేసిన ప్రతీ పైసాకు లెక్కుంది. ఆ వివరాలను, ఆడిట్ నివేదికను వారంలో శాసనసభ ముందు పెడతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అడవుల సర్వనాశనానికి కారకులైన వారే తమపై విమర్శలు గుప్పిస్తే ఎలా? అంటూ కాంగ్రెస్ ను ఎత్తిపొడిచారు.

10/31/2017 - 04:00

హైదరాబాద్, అక్టోబర్ 30: పంచాయతీరాజ్ చట్టంలో సమూల మార్పులు తీసుకరావడానికి ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే కొత్త చట్టం తీసుకవస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సామాజిక బాధ్యతను విస్మరించి పనితీరు బాగా లేని పంచాయతీలపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టంలో మార్పులు చేస్తామన్నారు. కొన్ని గ్రామ పంచాయతీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు.

10/31/2017 - 02:09

హైదరాబాద్, అక్టోబర్ 30: రాష్ట్రంలో 1.12 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు. సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పిందానికి కట్టుబడి ఉంటుందని, అవసరమైతే ఒక వెయ్యి ఉద్యోగాలు ఎక్కువే భర్తీ చేస్తామని తెలిపారు.

10/31/2017 - 02:00

అమరావతి, అక్టోబర్ 30: ‘చేయూతనిచ్చే బాధ్యత నాది. అందిపుచ్చుకునే అవకాశం మీది’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం అమరావతి సచివాలయ ప్రాంగణంలో ఆయన సింగపూర్ వెళుతున్న 34 మంది రైతులకు వీడ్కోలు పలికారు. సక్రమ మార్గంలో ముందుకు వెళితేనే ఎంతటి అభివృద్ధయినా సాధ్యమవుతుందని ఈ సందర్భంగా అన్నారు.

10/31/2017 - 03:46

శ్రీశైలం, అక్టోబర్ 30: కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీగిరికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చారు. అంతకంతకు భక్తులు పెరగడంతో దేవస్థానం వారు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ వేళల్లో మార్పులు చేశారు.

10/31/2017 - 01:52

పెరవలి, అక్టోబర్ 30: అప్పుల బాధ తాళలేక ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తలు సామూహికంగా గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు అదృశ్యమవ్వడం, నదివద్ద లభించిన వారి బైక్, చెప్పులు, ఆధార్ కార్డులు, ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు రాసిన లేఖ ఆధారంగా మాత్రమే వారు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు.

10/31/2017 - 01:46

అమరావతి, అక్టోబర్ 30: పోలవరాన్ని 2019లోగా పూర్తి చేసేందుకు 60-సి నిబంధన అమలు చేయాలని నిర్ణయించినట్టు సిఎం చంద్రబాబు చెప్పారు. దీనిపై 1న జరిగే మంత్రిమండలి సమావేశంలో మరింత వివరంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. సోమవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో పోలవరం, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.

Pages