S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/08/2017 - 01:20

రాజమహేంద్రవరం, అక్టోబర్ 7: సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి జలాలు ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి జిల్లాల్లో సాగును సస్యశ్యామలం చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 71.653 టిఎంసి జలాలు వినియోగించారు. రోజుకు సరాసరిగా సుమారు 8400 క్యూసెక్కుల

10/08/2017 - 01:18

అమరావతి, అక్టోబర్ 7: రైతు కళ్లలో నీళ్లు తుడిచేందుకే రుణమాఫీ అని సిఎం చంద్రబాబు అన్నారు. రైతు సంతోషమే జాతికి ముఖ్యం.. అన్నదాతను ఆదుకోవడం మన బాధ్యత అన్నారు. 3వ విడత రుణ ఉపశమన పత్రాల పంపిణీ సందర్భంగా శనివారం తన నివాసం నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో సిఎం మాట్లాడుతూ రైతుల రుణభారం రూ.24 వేల కోట్లు ప్రభుత్వమే భరిస్తోందన్నారు.

10/08/2017 - 01:16

అనంతపురం, అక్టోబర్ 7 : అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండల పరిధిలోని మడినేహళ్లి గ్రామంలో శనివారం డెంగ్యూ లక్షణాలతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మడినేహళ్లి గ్రామంలో గత వారం రోజుల నుంచి విషజ్వరాలు ప్రబలాయి.

10/08/2017 - 01:05

అమరావతి, అక్టోబర్ 7: విద్యుత్ రంగంలో ఆంధ్ర సాధించిన విజయాలు దేశానికి దిక్సూచిగా నిలిచిందని కేంద్రం ప్రశంసించింది. తక్కువ చార్జీలకే నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి విధానాలను కేంద్ర మంత్రి అభినందించారు.

10/07/2017 - 01:51

కొత్తగూడెం, అక్టోబర్ 6: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తొమ్మిది ఏరియాల్లో విజయం సాధించి గుర్తింపు సంఘంగా నిలిచింది. 11 ఏరియాల్లో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు గట్టి పోటీ ఇచ్చిన ఎఐటియుసి రెండు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.

10/07/2017 - 01:50

తిరుపతి, అక్టోబర్ 6: దేశంలోని శ్రీవారి భక్తులు టిటిడి వెబ్‌సైట్‌ను సులభంగా వినియోగించుకునేందుకు వీలుగా దశలవారీగా కన్నడం, తమిళం, హిందీ భాషల్లో వెబ్‌సైట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు.

10/07/2017 - 01:34

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణలో వర్శిటీల పనితీరుపై గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలో జరిగిన వైస్ ఛాన్సలర్ల సదస్సులో గవర్నర్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎదగడానికి బాధ్యులు కృషి చేయాలని సూచించారు. కేవలం నిధుల కోసం చూస్తూ కూర్చుంటే సరిపోదని, నిధుల అవసరం లేకుండానే కొన్ని పనులు చేయవచ్చన్నారు.

10/07/2017 - 01:31

హైదరాబాద్, అక్టోబర్ 6: వచ్చే రెండు రోజులు తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు యాజమాన్య కమిషనర్ కార్యాలయం పేర్కొంది. కాగా శ్రీశైలంలో నీటి నిల్వ 200 టిఎంసికి చేరింది. మొత్తం 215.81 టిఎంసికి 199.73 టిఎంసి నీటి నిల్వలున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 62805 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 15899 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.

10/07/2017 - 01:30

హైదరాబాద్, అక్టోబర్ 6: సింగరేణి ఎన్నికల ఫలితాలతోనైనా ప్రతిపక్షాలు బుద్ధితెచ్చుకొని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు హితవు పలికారు. ప్రజలు ప్రతీ ఎన్నికల్లోనూ బుద్ధిచెబుతున్నా ప్రతిపక్షాలకు జ్ఞానోదయం కావడం లేదని ఆక్షేపించారు.

10/07/2017 - 01:20

విశాఖపట్నం, అక్టోబర్ 6: ప్రతిష్టాత్మకమైన, ఏపీలోనే తొలి భారీ ప్రాజెక్టుగా చెప్పుకునే భూగర్భ విద్యుద్దీకరణ ప్రాజెక్ట్ పనులకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న మధ్యాహ్నం 12.10 గంటలకు విశాఖ నగరంలో పాండురంగాపురం 33/11కెవి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ప్రాజెక్టు నిర్మాణ పనులకు సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు.

Pages