S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/07/2017 - 01:15

శ్రీశైలం, అక్టోబర్ 6: శ్రీశైలం జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతోంది. మరో మూడు అడుగుల నీరు చేరితో జలాశయం పూర్తిగా నిండుతుంది. 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా శుక్రవారం 882.10 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 199.73 టిఎంసిల నీరు ఉంది.

10/07/2017 - 19:13

అమరావతి, అక్టోబర్ 6: సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై ఏపీ ఘనతను అంతర్జాతీయ కంపెనీలు గుర్తించాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో పనిచేస్తూ అంతర్జాతీయ ఖ్యాతిపొందిన సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థలు ఏపీలోని సోలార్ పార్కులపై ఆసక్తి చూపుతున్నాయి.

10/06/2017 - 04:32

హైదరాబాద్, అక్టోబర్ 5: సమాజంలో పన్ను ఎగవేసే విధానం పోవాలని, ప్రతి ఒక్కరూ పన్ను చెల్లించే అంశంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. ‘జిఎస్‌టి ధర గుర్తింపు’ తెలుగు విభాగం మొబైల్ యాప్‌ను గురువారం రాజ్‌భవన్‌లో ప్రారంభిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి బాధ్యతలతో పాటు హక్కులు ఉంటాయన్నారు. జిఎస్‌టి రేట్ ఫైండర్ యాప్ వల్ల పూర్తి వివరాలు ప్రజలకు తెలుస్తాయన్నారు.

10/06/2017 - 02:16

హైదరాబాద్, అక్టోబర్ 5: హైదరాబాద్ పాతబస్తీలో ఎట్టకేలకు కాంట్రాక్టు పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, బార్కస్, సలార్ తదితర ప్రాంతాల్లో రోజూ ఎక్కడో ఓ చోట కాంట్రాక్టు పెళ్లి జరిగేది. కాంట్రాక్టు పెళ్లిళ్లు కుదర్చుతున్న బ్రోకర్లు, పెళ్లిళ్లు నిర్వహిస్తున్న ఖాజీలు, వీరికి ఆశ్రయం కల్పిస్తున్న లాడ్జీల యజమానులు కొందరిపై పీడీ యాక్టు పెట్టడంతో పాతనగరం ఒక్కసారిగా ఉలికిపడింది.

10/06/2017 - 02:15

హైదరాబాద్, అక్టోబర్ 5: రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం కోసం గురువారం జరిగిన ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయ బావుటా ఎగురవేసింది.

10/06/2017 - 02:11

హైదరాబాద్, అక్టోబర్ 5: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసర్వే కార్యక్రమం వేగవంతమైంది. రాష్ట్రంలోని 10875 గ్రామాలకు 1219 గ్రామాల్లో 80 శాతం భూముల్లో సర్వే గుర్తింపు, తనిఖీ పనులు దాదాపు పూర్తయ్యాయి. మూడు నెలల పాటు కొనసాగనున్న భూసర్వే కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్ 15వ తేదీన ప్రారంభించిన సంగతి విదితమే. భూ తగదాలు, వివాదాల నిర్మూలనకు ఈ ప్రాజెక్టును చేపట్టారు.

10/06/2017 - 02:00

హైదరాబాద్, అక్టోబర్ 5: శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ రికార్డు స్ధాయిలో 200 టిఎంసికి చేరుకుంది. ఇదే వరద నీటి ప్రవాహం కొనసాగితే, మరో వారం రోజుల్లో పూర్తి స్ధాయి నీటి నిల్వ 215 టిఎంసికి చేరుకుంటుంది. మరో వైపు పోతిరెడ్డి పాడు ద్వారా నీటి తరలింపును నిలుపుదల చేయాలన్న కృష్ణాబోర్డు ఆదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ సాగునీటి ఇంజనీర్లు బోర్డుకు ఫిర్యాదు చేశారు.

10/06/2017 - 01:56

హైదరాబాద్, అక్టోబర్ 5: సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన పథకాన్ని 76 శాతం మహిళలే వినియోగించుకున్నారని కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు.

10/06/2017 - 01:53

విజయవాడ, అక్టోబర్ 5: రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు 5 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన పంచాయతీరాజ్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

10/06/2017 - 01:50

అమరావతి, అక్టోబర్ 5: రాష్ట్రంలో వచ్చే మార్చి నాటికి ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం కింద 5లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్.. గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణంపై ఆయన సమీక్షించారు.

Pages