S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/09/2017 - 02:02

తిరుపతి, అక్టోబర్ 8: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం తెల్లవారుజామున సతీ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. రాంభగీచా అతిథిగృహం వద్దకు చేరుకున్న మైత్రిపాల సిరిసేనకు జెఇఓ కెఎస్ శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. అక్కడ నుంచి బ్యాటరీ కారులో వారు ఆలయ మహాద్వార సమీపానికి చేరుకున్నారు.

10/09/2017 - 01:45

హైదరాబాద్, అక్టోబర్ 8: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయాలన్నీ ప్రజా వ్యతిరేక విధానాలేనని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు, మా జీ ఎంపి కెఈ ఇస్మాయిల్ ఆరోపించారు. కేంద్ర ప్రభు త్వ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థిక వృద్ధి రేటు క్షీణించడం, అసహనం, నిరుద్యోగుల సంఖ్య పెరగడం, ధర ల పెరుగుదల వంటివి చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు.

10/09/2017 - 01:44

హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణలో బిసిలకు సామాజిక న్యాయం, సమాన వాటా దక్కాలనే ప్రధాన డిమాండ్‌తో లక్ష మంది విద్యార్థులతో డిసెంబర్ 20న హైదరాబాద్‌లో బిసి విద్యార్థి మహా గర్జన నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

10/09/2017 - 01:38

హైదరాబాద్, అక్టోబర్ 8: పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న కొలతల అక్రమాలు, కల్తీలపై యువత, వాహన యజమానులు ఖర్చు లేని లీటర్ క్యాన్లు, టిష్యూ కాగితాలతో పోరాడాలని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపునిచ్చారు. ఒక్క హైదరాబాద్‌లోనే పెట్రోల్ అక్రమాల విలువ రోజుకు రూ.1.5 కోట్లు ఉంటుందని, ఈ అక్రమాన్ని అడ్డుకునేందుకు పోరాడాలని అన్నారు.

10/09/2017 - 01:25

హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు తిష్టవేశాయి. నైరుతీ రుతుపవనాలు (సౌత్‌వెస్ట్ మాన్‌సూన్) ఇప్పటికే రాష్ట్రం నుంచి వెళ్లిపోయి, ఈశాన్య రుతుపవనాలు (నార్త్-ఈస్ట్ మాన్‌సూన్) ప్రారంభం కావల్సి ఉన్నప్పటికీ, అది జరగలేదు. సీజన్ చివరిలో తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏటా జూన్ నుండి సెప్టెంబర్ చివరి వరకు అంటే నాలుగు నెలలపాటు నైరుతి రుతుపవనాలు తెలంగాణలో కీలక భూమిక పోషిస్తాయి.

10/09/2017 - 01:24

నైరుతి సీజన్ చివరిలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆదివారం సైతం నగరంపై కుండపోత కురియడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. అనేక రహదార్లు జలయమయమైతే, కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండకు వెళ్లే రోడ్డు భూమిలోకి కుంగిపోయింది. భారీ గుంత పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. మరో 24 గంటలపాటు భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది.

10/09/2017 - 01:19

హైదరాబాద్, అక్టోబర్ 8: కృష్ణా జలాలపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. శ్రీశైలం జలాశయానికి అంచనాలు తలకిందులు చేస్తూ 210 టిఎంసి నీరు చేరింది. దీంతో ఈ నీటిలో వంద టిఎంసికిపైగా వాటా తమకు కావాలని తెలంగాణ ఇండెంట్ పెట్టింది. తమకు కేటాయించిన 512 టిఎంసిలో నిష్పత్తి మేరకు నీటి లభ్యతలో 63శాతం వదలాలని ఏపీ కోరుతోంది.

10/09/2017 - 01:17

హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణలో తెలుగు దేశం పార్టీ భవిష్యత్ ఏమిటీ?. అధికారంలోకి రావడం పక్కన పెడితే కనీసం బలమైన ప్రతిపక్షంగానైనా నిలబడగలదా?. వచ్చే ఎన్నికల్లో ‘సైకిల్’ తునాతునకలై పోతుందా? అన్న సందేహాలు, అనుమానాలకు బలం చేకూరుస్తూ, రెండు రోజుల క్రితం సిఎం కెసిఆర్ చేసిన ఘాటైన విమర్శలు పార్టీ శ్రేణుల్లో అంతర్మథనాన్ని లేపాయి.

10/09/2017 - 01:13

హైదరాబాద్, అక్టోబర్ 8: హైదరాబాద్ శివారులోని రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో ట్రైనీ కానిస్టేబుల్ నవీన ఆత్మహత్యకు పాల్పడింది. తన స్నేహితురాలైన తోటి కానిస్టేబుల్ మాధవి శనివారం ఆత్మహత్యకు పాల్పడటంతో తీవ్ర మనస్థాపానికి గైరైన నవీన, ఆదివారం ఉదయం పోలీస్ అకాడమీ హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకుంది. నవీన నల్లగొండ ప్రాంతవాసి అని పోలీసులు గుర్తించారు.

10/09/2017 - 01:11

హైదరాబాద్, అక్టోబర్ 8: సింగరేణిలో అవినీతికి పాల్పడేవారికి చెప్పుతో సమాధానమివ్వాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ‘లంచం అడిగినా, తీసుకున్నా, ఇప్పించేందుకు ప్రయత్నించినా.. ఎవరైనా కానీ అలా చేసే వారిని చెప్పుతో కొట్టండి’ అని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. సింగరేణిలో లంచాలు నేటినుంచే బంద్ కావాలన్నారు. సింగరేణిలో ఏం జరుగుతుందో తాను కూడా ఇంతవరకు దృష్టి సారించలేదన్నారు.

Pages