S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/25/2017 - 01:33

హైదరాబాద్, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో గొర్రెల సంపద పెంచి గొల్ల, కుర్మలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడిచేలా దళారుల దందాను జోరుగా కొనసాగుతోంది. మరో వైపు ప్రభుత్వం సబ్సిడీతో కొనుగోలు చేసి ఇచ్చిన గొర్రెలను దసరా సీజన్‌లో అమ్మేసుకుంటున్న పరిస్థి తీ కనిపిస్తోంది. ప్రభుత్వ ఆశయం నెరవేరకముందే అక్రమార్కుల దందాను క్షేత్రస్థాయి సిబ్బంది నిస్సహా యంగా చూస్తున్నారు.

09/25/2017 - 04:12

హైదరాబాద్, సెప్టెంబర్ 24: రేషన్ బియ్యం తినేవారు మాత్రమే రేషన్ దుకాణాల్లో బియ్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణ తదితర పనులపై సమీక్షిస్తూ రబీ సీజన్‌కు ప్రణాళిక రూపొందించేందుకు వీలుగా ఆదివారం జిల్లాస్థాయి, రాష్టస్థ్రాయి అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

09/25/2017 - 01:21

హైదరాబాద్, సెప్టెంబర్ 24: దేశ వ్యాప్తంగా ఉగ్రవాదం, తీవ్రవాదం, విధ్వంసకర శక్తుల కార్యకలాపాలను ముందుగా పసిగట్టి మొగ్గలోనే తుంచేందుకు కొత్తగా ‘నేరాలు సంభవించే ప్రాంతాలు’ మ్యాపింగ్‌ను కేంద్ర హోంశాఖ రూపొందిస్తోంది. ఈ బాధ్యతను అంతర్జాతీయంగా ప్రతిష్టాకరమైన నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరోకు అప్పగించారు. క్రైమ్ డేటా అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్‌ను ఈ సంస్ధ రూపొందించింది.

09/25/2017 - 01:19

విజయవాడ, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో జనాభా ముఖచిత్రం మారుతోంది. పని చేసేందుకు అనువుగా ఉన్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది ఆనందించదగ్గ పరిణామమే అయినా, అదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం, టీనేజ్ యువత సంఖ్య తగ్గుతుండటం మరోవైపు కలవరపెట్టే అంశంగా మారింది. ఏ దేశానికి, ఏ రాష్ట్రానికైనా 20 నుంచి 35ఏళ్ల మధ్య ఉన్న యువతను డెమోగ్రాఫిక్ డివిడెండ్‌గా భావిస్తారు.

09/25/2017 - 01:16

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 24: గోదావరి తీరంలో విరివిగా పర్యాటక ప్రాజెక్టులు విస్తరిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి. సహజ సిద్ధ అందాలతో అలరారే తూర్పు గోదావరి జిల్లా గోదావరి తీర ప్రాంతంలో ఇటు పిచ్చుకలంక, అటు కోనసీమ, పాపికొండలు, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం శరవేగంగా విస్తరిస్తున్నాయి.

09/25/2017 - 01:12

విజయవాడ, సెప్టెంబర్ 24: విదేశీ పెట్టుబడులకు రాజధాని అమరావతి స్వర్గ్ధామం కానుందని సిఎం చంద్రబాబు అన్నారు. వౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కంపెనీలు ఇక్కడికి క్యూకట్టేలా ఉన్న అవకాశాల గురించి మనం విదేశీ పెట్టుబడిదారులకు వివరించాలన్నారు. సింగపూర్‌లో ఈ నెల 25 నుంచి 27 వరకూ ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజ్ అనే సంస్థ వౌలిక సదుపాయాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది.

09/25/2017 - 01:08

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 867.7 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 132.4436 టిఎంసిలుగా నమోదైంది. ఎగువ ప్రాజెక్టులైన జూరాల నుంచి 1,57,767 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ఇక జలాశయం నుంచి ఔట్‌ఫ్లోగా 57,403 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది.

09/25/2017 - 01:05

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద కొనసాగుతుంది. ఆదివారం ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలతోపాటు, భీమా నది నుంచి వస్తున్న వరదనీటి కారణంగా జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లుతొక్కుతోంది. జూరాల జలాశయంలో 318.330 మీటర్ల స్థాయిలో నీటి నిల్వ ఉండగా ఎగువనుంచి 1,84,000 క్యూసెకుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 18 గేట్లను ఎత్తి 1,83,951 క్యూసెకులను దిగువకు విడుదల చేస్తున్నారు.

09/25/2017 - 01:02

హైదరాబాద్/ శ్రీశైలం/ గద్వాల, సెప్టెంబర్ 24: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలంచేసి ఆధునిక దేవాలయంగా కీర్తిని అందుకున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు, జల విద్యుత్ రంగానికి దిక్సూచిగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు భవిష్యత్తు అయోమయంలో పడిం ది. ఈ రెండూ ప్రస్తుతానికి నీటి నిల్వ చేసే డ్యాములు గా మారిపోయాయ.

09/25/2017 - 00:41

హైదరాబాద్, సెప్టెంబర్ 24: సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానంటూ మాయమాటలతో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు, సినీ నిర్మాత కరీం మొరానిని హయత్‌నగర్ పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరీం మొరాని అత్యాచారం కేసులో నిందితుడే కాకుండా 2జి-స్ప్రెక్ట్రం కేసులో కూడా నిందితుడని పోలీసులు తెలిపారు.

Pages