S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/30/2017 - 02:30

హైదరాబాద్, ఆగస్టు 29: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కన్యాకుమారి-శాంత్రగచ్చి మధ్య (వయా విజయవాడ) రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ట్రైన్ నెం. 06906 కన్యాకుమారి-శాంత్రగచ్చి ప్రత్యేక రైలు ఈనెల 31న, సెప్టెంబర్ 4న గం. 23:00లకు కన్యాకుమారి నుంచి బయలుదేరి మరుసటి రోజున గం. 21:15లకు శాంత్రగచ్చి చేరుకుంటుంది.

08/30/2017 - 02:28

హైదరాబాద్, ఆగస్టు 29: వచ్చే నెల 21 నుంచి 28 వరకు టెరిటోరియల్ ఆర్మీలో (టిఏ) సైనిక (హౌస్ కీపర్) నియామకాలు జరుగుతాయని రక్షణ విభాగం అధికారులు తెలిపారు. హైదరాబాద్ వౌలాలీలోని కార్యాలయంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు కనీస అర్హత ఎస్‌ఎస్‌సిలో 45శాతం మార్కులు కలిగి, ప్రతి సబ్జెక్టులో కనీసం 33శాతం మార్కులు పొంది ఉండాలని డిఫెన్స్ వింగ్ తెలిపింది.

08/30/2017 - 01:57

నిజామాబాద్, ఆగస్టు 29: గత నాలుగు మాసాల నుండి ఒమన్‌లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు దశల వారీగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారుల తోడ్పాటుతో రెండవ విడతగా మంగళవారం తెలుగు రాష్ట్రాలకు చెందిన 22 మంది బాధితులు స్వదేశానికి చేరుకున్నారు.

08/30/2017 - 01:33

హైదరాబాద్, ఆగస్టు 29: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులను నత్తనడక సాగడం పట్ల నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పురోగతిని మంగళవారం జలసౌధలో సమీక్షించారు. ఆరులక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

08/30/2017 - 01:44

హైదరాబాద్, ఆగస్టు 29: రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులకు కొత్త ఆపరేషన్ మ్యాన్యువల్స్ రూపొందించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత నీటిని మిషన్ భగీరథకు వినియోగించాలో మదింపు చేయాలన్నారు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని యావత్ రాష్ట్రం అవసరాలను తీర్చడానికి డ్రింకింగ్ వాటర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేయాలని సూచించారు.

08/30/2017 - 01:28

హైదరాబాద్, ఆగస్టు 29: భూరికార్డుల ప్రక్షాళనకు సంబంధించి క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమంపై మార్గనిర్దేశం చేసేందుకు ఈనెల 31న కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో సమావేశం కానున్నారు.

08/30/2017 - 01:23

కాకినాడ, ఆగస్టు 29: చెదురు మదురు ఘటనలు వినా కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా సాగింది. పోలింగ్ మందకొడిగా కేవలం 64.78 శాతంగా నమోదయ్యింది. ఉదయం 7నుంచి నగరంలోని 48 డివిజన్లలో ఏర్పాటుచేసిన 196 కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభం కాగా, కొన్ని పోలింగ్ స్టేషన్లలో మధ్యాహ్నం వరకు ఓటర్లు కనిపించకపోవడం విశేషం.

08/30/2017 - 01:17

విజయవాడ, ఆగస్టు 29: తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం చేయాల్సినంత కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భావితరాలకు మన వారసత్వ సంపద అందించేందుకు అహరహం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం రాత్రి అధికారికంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సభలో చంద్రబాబు ముఖ్య అతిధిగా మాట్లాడారు.

08/30/2017 - 01:15

విజయవాడ, ఆగస్టు 29: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించటంలో భాగంగా చంద్రన్న సంచార వైద్య కేంద్రాలను జిపిఎస్ విధానంతో అనుసంధానించనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. దీనివల్ల ఏ వాహనం ఎక్కడ ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు.

08/30/2017 - 00:05

హైదరాబాద్, ఆగస్టు 29: టిడిపి నేతలపై నమోదైన క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలన్న జీవోపై సంబంధించిన కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దరఖాస్తులను దాఖలు చేసే ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతామని ఏపి అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. ఈ జీవోను సవాలు చేస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

Pages