S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/02/2017 - 01:27

హైదరాబాద్, సెప్టెంబర్ 1: 3తెలుగునాట, తమిళనాడు పురాతన ఆలయాల్లోని అద్భుత శిల్పసంపద చూడగానే శ్రీకృష్ణదేవరాయలు గుర్తుకొస్తాడు. యాదాద్రి పూరె్తైన తరువాత ఇక్కడ ఏర్పాటు చేస్తున్న భారీ శిలా విగ్రహాలతో కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతాడు. ఇదీ యాదాద్రి వైశిష్ట్యానికి రాష్ట్ర సర్కారు ఇస్తోన్న ప్రాధాన్యత2 యాదాద్రిలో ఏర్పాటవుతోన్న శిల్ప సంపదను చూసి అబ్బుర పడుతున్నవారికి అక్కడి శిల్పులు చెబుతోన్న మాటలు.

09/02/2017 - 01:33

విజయవాడ, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో ఖాళీగావున్న 3,323 డీలర్ల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు పౌర సరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఈనెలలోనే అన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్లలో ఈపోస్ విధానం ద్వారా డీలర్లకు బియ్యం పంపిణీ చేపడతామని వెల్లడించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో సివిల్ సప్లయ్ శాఖాధికారులతో శుక్రవారం ఆయన సమీక్షా నిర్వహించారు.

09/02/2017 - 01:16

కాకినాడ, సెప్టెంబర్ 1: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం విజయకేతనం ఎగరేసింది. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల తరహాలో తెదేపాకు కాకినాడలో తిరుగులేని ఆధిక్యత లభించింది. మిత్రపక్షం సహకారం అవసరం లేకుండా మేయర్ పీఠాన్ని తెదేపా సునాయాసంగా చేజిక్కించుకోగలిగేలా విజయకేతనం ఎగరేసింది. మొత్తం 48 డివిజన్లకు ఎన్నికలు జరగగా 32 డివిజన్లలో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు.

09/02/2017 - 01:07

తిరుపతి, సెప్టెంబర్ 1: మహిళా సాధికారతే దేశ ప్రగతికి మూలమని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. రాష్టప్రతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి తిరుపతికి విచ్చేసిన రామ్‌నాథ్‌కు ఎస్వీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ప్రభుత్వం పౌరసన్మానం చేసింది. ముందుగా గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ శాలువాతో సత్కరించి వినాయక ప్రతిమను బహూకరించారు.

09/01/2017 - 03:25

ఇల్లందు, ఆగస్టు 31: ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక హరిహారం అని రాష్ట్ర మంత్రులు జోగు రామన్న, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో తెలంగాణలో 230 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా ప్రభు త్వం నిర్దేశించిందన్నారు.

09/01/2017 - 02:34

హైదరాబాద్, ఆగస్టు 31: ప్రయాణీకుల అధిక రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే కొన్ని రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా, మరికొన్ని రూట్లలో ప్రత్యేక చార్జీలతో కూడిన ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. బెంగళూరు కంటోనె్మంట్-హౌరా-బెంగళూరు కంటోనె్మంట్ మధ్య సూపర్‌ఫాస్ట్ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.

09/01/2017 - 01:52

హైదరాబాద్, ఆగస్టు 31: శాసనసభ కార్యదర్శిగా వేదాంతం నరసింహాచార్యులను నియమించారు. ప్రస్తుత కార్యదర్శి రాజా సదారామ్ గురువారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నరసింహాచార్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

09/01/2017 - 01:24

హైదరాబాద్, ఆగస్టు 31: విద్యాశాఖలో కొత్త పోస్టులు మంజూరయ్యాయి. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులకు గౌరవ వేతనాలు పెరిగాయి. గత కొనే్నళ్లుగా ఎదురుచూస్తున్న ఎస్‌ఎస్‌ఎ, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల బోధన, బోధనేతర ఉద్యోగుల గౌరవ వేతనాలు పెంపునకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదం తెలిపారు. 2008 తర్వాత ప్రారంభించిన 81 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1133 పోస్టుల భర్తీకి సిఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

09/01/2017 - 01:23

హైదరాబాద్, ఆగస్టు 31:రాష్ట్రంలో మొత్తం 18వేల కోట్లతో 2లక్షల, 65వేల ఇళ్లను నిర్మించనున్నట్టు ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు, మల్కాజిగిరి పార్లమెంటు నియోజక వర్గంలో అభివృద్ధి పై సమీక్ష జరిపిన మంత్రి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంపై వివరించారు.

09/01/2017 - 01:20

హైదరాబాద్, ఆగస్టు 31: ‘రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగగా మారుద్దాం. దీనికి రైతు సమన్వయ సమితులు ప్రధాన భూమిక పోషించాలి. వీటిలో 1.75లక్షల మంది సభ్యులుగా ఉంటారు. ఇదొక సైన్యం, రైతన్నలను సంఘటిత శక్తిగా మార్చి ప్రభుత్వం వీరి కోసం చేసే కార్యక్రమాలను విజయవంతం చేద్దాం’ అని కలెక్టర్లకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. అంకిత భావం తో చేసే ఏ పనైనా విజయవంతం అవుతుంది.

Pages