S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/04/2017 - 01:49

హైదరాబాద్, సెప్టెంబర్ 3: ఐటి శాఖ మంత్రి కె తారక రామారావుకు ఐటి మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రకటించారు. ఈనెల తొమ్మిదిన ఢిల్లీలో జరిగే 49వ స్కోచ్ సమ్మిట్‌లో ప్రదానం చేస్తారు.

09/04/2017 - 01:41

విజయవాడ, సెప్టెంబర్ 3: ఎల్‌ఇడి బల్బుల వినియోగంలో ప్రపంచంలో నెంబర్-1గా నిలవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. మున్సిపల్ ప్రాంతాల్లో ఈ బల్బుల వినియోగం ద్వారా ఇప్పటికే 133 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఆదా అవుతోందని తెలిపారు. ఎల్‌ఇడి బల్బుల వినియోగం వల్ల విద్యుత్ ఆదా, తదితర అంశాలపై శాస్ర్తియ అధ్యయనం చేయాలని సూచించారు.

09/04/2017 - 01:40

హైదరాబాద్, సెప్టెంబర్ 3: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని భారత ఉపరాష్టప్రతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ‘78 వ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా’ సమావేశాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్టప్రతి మాట్లాడుతూ, తీవ్రవాదం వల్ల భారత్‌తో సహా ప్రపంచంలోని అన్ని ముఖ్యమైన దేశాలకు ముప్పు ఉందన్నారు.

09/04/2017 - 01:35

హైదరాబాద్, సెప్టెంబర్ 3: హమ్మయ్య... ఎన్నాళ్ల కెన్నాళ్ల కెన్నాళ్లకూ... అన్నట్లుగా శ్రీశైలం డ్యాంకు కృష్ణవేణి తరలివస్తోంది. దీంతో ఏడారిని తలపిస్తున్న కృష్ణా బేసిన్‌కు జల కళ ఇప్పుడిప్పుడే వస్తోంది. జూరాల గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో తెలంగాణ పులకించింది. శ్రీశైలం మల్లన్న పాదాలను కడిగేందుకు 32 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉరుకురికి వస్తోంది.

09/04/2017 - 00:17

శ్రీశైలం, సెప్టెంబర్ 3: ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి 32 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 793 అడుగులు, నీటి నిల్వ 25.703 టిఎంసిలు ఉన్నాయి. శ్రీశైలం జలాశయానికి ఆదివారం నాటికి జూరాల నుంచి 32 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

09/04/2017 - 00:15

భద్రాచలం టౌన్, సెప్టెంబర్ 3: శ్రీ సీతారామచంద్రస్వామి కొలువైన భద్రాచలం పట్టణంలో కేజీ టూ పీజీ విద్యార్థులకు ఈ ఏడాది జాతీయ స్థాయి బాలోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నవంబర్ 10, 11, 12 తేదీల్లో బాలోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

09/03/2017 - 03:20

హైదరాబాద్, సెప్టెంబర్ 2: జనసేనను పటిష్టం చేసే దిశగా ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి ఒక రూపాన్ని ఇచ్చి, అక్కడ నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచుకున్న తర్వాత తెలంగాణలో పార్టీని నిలపాలని సహచరులు ఇస్తున్న సలహాను పవన్ పాటిస్తున్నట్టు తెలిసింది.

09/03/2017 - 02:32

హైదరాబాద్/చార్మినార్, సెప్టెంబర్ 2: రెండు తెలుగు రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను వారి సొంత రాష్ట్రాలకు పంపాలని జాతీయ బిసి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. ఇందుకు అవసరమైతే రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో తాను చర్చిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు.

09/03/2017 - 02:30

గుంటూరు, సెప్టెంబర్ 2: సినీ హీరో నిఖిల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. గుంటూరు నగరంలోని చంద్రవౌళినగర్‌లో ఓ ప్రైవేటు వ్యాయామశాల (జిమ్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యేందుకు శనివారం నిఖిల్ గుంటూరు చేరుకున్నారు. ఐదంతస్తుల భవనంలోని నాలుగో ఫ్లోర్‌లో జిమ్ ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేశారు. లిఫ్టు నాలుగో ఫ్లోర్‌కు చేరుకునే సమయంలో సాంకేతికలోపం కారణంగా ఉన్నట్టుండి ఆగిపోయింది.

09/03/2017 - 02:20

తిరుపతి, సెప్టెంబర్ 2: శ్రీవారి లడ్డూప్రసాదాలు తయారు చేసేందుకు ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన పోటు (వంటశాల)లో శనివారం మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పోటు సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. పోటులో అగ్నిప్రమాదం జరిగిందని, తీవ్ర నష్టం జరిగిందని ప్రచారం సాగింది.

Pages