S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/29/2017 - 01:31

హైదరాబాద్, ఆగస్టు 28: వచ్చే నాలుగు నెలలు క్షేత్రస్థాయి ప్రభుత్వ యంత్రాంగానికి కీలకం కానుంది. డిసెంబర్ నాటికి సమగ్ర భూ సర్వే, మిషన్ భగీరథ, 2 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి మూడు ప్రధాన కార్యక్రమాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం డెడ్‌లైన్‌గా విధించింది. సెప్టెంబర్ 1నుంచి డిసెంబర్ నెలాఖరుకు సమగ్ర భూ సర్వేను పూర్తి చేసే బాధ్యతను రెవిన్యూ, వ్యవసాయ శాఖకు అప్పగించింది.

08/29/2017 - 01:26

పాడేరు, ఆగస్టు 28: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విశాఖ మన్యం అతలాకుతలమైంది. ఏజెన్సీలో ఆది, సోమవారాల్లో భారీ వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ ఏకధాటిగా వర్షం పడటంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహించాయి. దీంతో గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

08/29/2017 - 01:23

హైదరాబాద్, ఆగస్టు 28: అధికారులు, ఉద్యోగుల విభజనపై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల అధికారులు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం లభిస్తుందని డివోపిటి (కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ) హితవు పలికింది. ఉద్యోగుల విభజనపై కమలనాథన్ కమిటీ సిఫారసుల మేరకు నడుచుకుంటే వివాదాలకు తావుండదని కూడా సూచించింది.

08/29/2017 - 01:13

ఈ ఉపఎన్నికలో భూమా వర్గంపై సానుభూతి బలంగా పని చేసింది. సర్కారు చేపట్టిన అభివృద్ధి దానికి మరింత బలాన్నివ్వడం వల్లే -గెలుపు తెదేపా పరమైందన్నది రాజకీయ నిపుణుల విశే్లషణ. తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చడానికి రాజకీయాల్లో కొనసాగుతున్నామంటూ ప్రస్తుత మంత్రి అఖిలప్రియ నిర్వహించిన విస్తృత ప్రచారంతో సెంటిమెంట్ బలంగా వర్కౌటైందని అంటున్నారు.

08/29/2017 - 01:12

కర్నూలు, ఆగస్టు 28: రాష్టవ్య్రాప్తంగా ఉత్కంఠ రేపిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 27 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 97,076 ఓట్లురాగా, సమీప ప్రత్యర్థి వైకాపాకు చెందిన శిల్పా మోహన్‌రెడ్డికి 69,610 ఓట్లు లభించాయి.

08/28/2017 - 23:40

విశాఖపట్నం, ఆగస్టు 28: ఛత్తీస్‌ఘడ్ పరిసరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. దీనికి అనుబంధంగా ఉపతర ఆవర్తనం 7.6 కిమీ ఎత్తున కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు.

08/28/2017 - 23:40

హైదరాబాద్, ఆగస్టు 28: ఉత్తరాదిన భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తూ, హర్యానాలో శాంతిభద్రతల దృష్ట్యా మరికొన్ని రైళ్లను కుదించినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ఈనెల 29న బయలుదేరాల్సిన ట్రైన్ నెం. 22501 కెఎస్‌ఆర్ బెంగుళూరు-న్యూ తిన్సుకియా ఎక్స్‌ప్రెస్ రైలును, ఈనెల 30, 31న బయలుదేరాల్సిన ట్రైన్ నెం.

08/28/2017 - 23:39

హైదరాబాద్, ఆగస్టు 28: దేశవ్యాప్తంగా 1160 కోట్ల రూపాయిల వ్యయంతో 50 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు స్కూళ్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ ఐదు స్కూళ్లు ఈ విద్యాసంవత్సరం నుండే ప్రారంభం అవుతాయి. కాగా రెండు రాష్ట్రాల్లో మరో 9 చోట్ల పాఠశాలల ఏర్పాటుకు పరిశీలన జరుగుతోంది.

08/28/2017 - 03:28

విజయవాడ, ఆగస్టు 27: సర్దార్ వల్లభాయ్ పటేల్ తనకు ఆదర్శమని, అటల్ బిహారీ వాజపేయి, ఎల్‌కె అద్వానీ అంటే తనకెంతో అభిమానమని ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో ఆదివారం ఆయన వివిధ కళాశాలల విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ ఆసక్తికరంగా సమాధానాలిచ్చారు.

08/28/2017 - 02:30

హైదరాబాద్, ఆగస్టు 27: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమవారం సమావేశమై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, అంశాలను చర్చించనున్నారు. ఈ సమావేశానికి గవర్నర్ చొరవ తీసుకున్నట్లు సమాచా రం. ఆంధ్రాలో తెలంగాణకు చెందిన 800మంది నాలుగో తరగతి ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరు తమను తెలంగాణకు బదిలీ చేయాలని ఆందోళన చేస్తున్నారు.

Pages