S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/01/2017 - 01:56

హైదరాబాద్, ఆగస్టు 31: అక్రమాస్తుల కేసులో వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. సిబిఐ కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టాలని వైకాపా అధ్యక్షుడు జగన్ నిర్ణయించిన విషయం విదితమే.

09/01/2017 - 01:05

కాకినాడ, ఆగస్టు 31: రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాలు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాలు శుక్రవారం తేటతెల్లం కానున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లమధ్య శుక్రవారం ఉదయం 8 గంటలకు స్థానిక రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లుచేసింది. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

09/01/2017 - 01:02

విజయవాడ, ఆగస్టు 31: రాష్ట్భ్రావృద్ధి కోసం, ప్రజల మేలు కోసం శాశ్వతంగా తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉండటం తన కోసం కాదని, ప్రజలకు మేలు జరగడం కోసమేనని తెలిపారు.

09/01/2017 - 00:59

హైదరాబాద్, ఆగస్టు 31: గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడంపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. ఈ ఏడాది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 42టిఎంసిల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించింది. నిరుడు 53టిఎంసిల గోదావరి జలాలను ఇదే ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించారు. ఒక వైపు కృష్ణా బేసిన్ ఎండిపోయి బోసిపోయింది.

08/31/2017 - 01:47

విజయవాడ: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు బుధవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రపంచ మహిళల బాడ్మింటన్‌షిప్‌లో రజిత పతకం సాధించినందుకు సింధుని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. సింధు మరిన్ని పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్, భారతదేశ పేరు ప్రఖ్యాతలు నిలపాలని ఆకాంక్షించారు.

08/31/2017 - 01:33

హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆంధ్రకు కేటాయించిన భవనాలపై ఉన్నతస్థాయిలో సమీక్షించాలని గవర్నర్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మూడంచెల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తొలుత రోడ్లుభవనాల శాఖకు చెందిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం జరపాలని భావిస్తున్నారు.

08/31/2017 - 02:07

హైదరాబాద్: రైతులు పంట రుణాల కోసం పట్టాదారు పాసు పుస్తకాలను బ్యాంకులలో తనఖా పెట్టే విధానానికి స్వస్తి పలుకనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేశాక ఆన్‌లైన్‌లోని సమాచారం ఆధారంగానే బ్యాంక ర్లు రైతులకు రుణాలివ్వాలని సూచించారు. భూసంబంధమైన వ్యవహారాలన్నీ రాజ్యాంగ పరంగా రాష్ట్ర పరిధిలోనే ఉండటంతో, భూరికార్డుల ప్రణాళనకు పూనుకున్నామన్నారు.

08/31/2017 - 02:09

అమరావతి: రాష్ట్రంలో సింహభాగంగా ఉన్న బడుగులపై సిఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. బీసీల ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లకు రూ.25 వేల సాయం అందించనున్నట్టు ప్రకటించారు.

08/31/2017 - 01:31

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల సంక్షేమానికి కేంద్రం భారీగా నిధులు విడుదల చేసింది. ఈమేరకు బుధవారం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వివరాలు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.90 కోట్లతో 1,52,128 కుంటుబాలకు ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్ షిప్పులకుగాను రూ.448.46 కోట్లు విడుదల చేసిందని, వీటితో 22,00,181 మందికి లబ్ది చేకూరనుందని చెప్పారు.

08/30/2017 - 02:57

హైదరాబాద్, ఆగస్టు 29: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాఉద్యమాలను అణచివేస్తున్న ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ, సెప్టెంబర్ 2,3 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు సిఎస్‌ఆర్‌ఓ నాయకులు ప్రొఫెసర్ లక్ష్మణ్, ఎన్ నారాయణ రావు, చిలుక చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.

Pages