S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/03/2017 - 02:18

శ్రీశైలం, సెప్టెంబర్ 2: చాలాకాలం తరువాత శ్రీశైలం జలాశయానికి భారీ ఇన్‌ఫ్లో నమోదయింది. జూరాల నుంచి శనివారం 32 వేల క్యూసెక్కు ల నీరు శ్రీశైలం జలాశయం చేరుకుంది. శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 885 అడుగులు కాగా, శనివారం 790.50 అడుగులుగా నమోదైంది. ఇన్‌ఫ్లో 32 వేల క్యూసెక్కులు ఉంది. ఇటీవలి కాలంలో ఇంత పెద్దమొత్తంలో వరద నీరు శ్రీశైలం రావడం ఇదే మొదటిసారి.

09/03/2017 - 02:04

హైదరాబాద్, సెప్టెంబర్ 2: భూముల రీ-సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. భూముల రీ-సర్వే ఆషామాషీగా పూర్తిచేసి చేతులు దులుపేసుకోవద్దని సర్కారు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తోంది. సర్వే సమగ్రంగా నిర్వహించి భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తలెత్తకుండా, రికార్డులు చెక్కు చెదరకుండా డిజిటలైజేషన్ చేయాలని సిఎం చంద్రశేఖర్ రావు అధికారులకు ఆదేశాలిచ్చారు.

09/03/2017 - 02:03

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: హైదరాబాద్ నగరంలో సెక్రటేరియట్ నిర్మాణానికి, మేడ్చల్ రహదారి, కరీంనగర్ రాజీవ్ రహదారి విస్తరణకు అవసరమైన రక్షణ శాఖ భూములను తెలంగాణకు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. సిఎం కెసిఆర్ శనివారం అరుణ్ జైట్లీతో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వం ఈ విషయం తెలిపింది. నీటిపారుదల ప్రాజెక్టుల వంటి ప్రజాప్రయోజన పథకాలపై విధించిన జిఎస్టీని తగ్గించేందుకూ జైట్లీ అంగీకరించారు.

09/03/2017 - 03:56

హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో మెగా ప్రాజెక్టుగా చరిత్ర సృష్టించనుందని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. డిసెంబర్ చివరినాటికి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీటి పంపింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్ల్లూ పూర్తి చేయాలని చెప్పారు. అతి తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ క్రెడిట్ ప్రభుత్వంతో పాటు ఏజెన్సీలకూ దక్కుతుందన్నారు.

09/03/2017 - 01:54

తిరుపతి, సెప్టెంబర్ 2: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో పరిశ్రమలు స్థాపనకు అమెరికా ఫ్లోరిడా నుంచి వచ్చిన మ్యానుఫ్యాక్చరీ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇనె్వస్టర్స్‌తో సిఎం శనివారం తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో సమావేశం నిర్వహించారు.

09/03/2017 - 01:53

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని శనివారం ఉదయం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
అనంతరం టిటిడి ఉన్నతాధికారులు, సిఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్, తిరుమల జీయర్లతో రాష్టప్రతి కుటుంబ సభ్యులు దిగిన గ్రూప్ ఫోటో. రెండు రోజుల ఏపీ రాష్ట్ర పర్యటన ముగించుకుని శనివారం రాష్టప్రతి ఢిల్లీకి బయలుదేరారు.

09/03/2017 - 01:50

కడప, సెప్టెంబర్ 2: ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టనున్న పాదయాత్ర ముగిసేలోగా రాష్ట్ర రాజకీయాల్లో భారీమార్పులు చేర్పులు సంభవిస్తాయని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజును ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు.

09/03/2017 - 01:46

విజయవాడ, సెప్టెంబర్ 2: రాష్ట్రంలో ఫ్లగ్-ఇన్ హైబ్రీడ్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటుకు టయోటా కిర్లోస్కర్ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకు అవసరమైన సహకారం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉండవల్లిలోని సిఎం నివాసంలో టయోటా మేనేజింగ్ డైరెక్టర్ అకిటో టకిబానా శనివారం చంద్రబాబుని కలుసుకున్నారు. ఈ సంస్థ తయారు చేసే వాహనాలు ఇంజన్‌తో, ఎలక్ట్రికల్ చార్జింగ్‌తో కూడా పని చేస్తాయి.

09/02/2017 - 01:31

హైదరాబాద్, సెప్టెంబర్ 1: మిషన్ భగీరథ పథకానికి టి-ఫైబర్ ప్రాజెక్టు అనుసంధానించి ఇంటింటికి మంచినీళ్లు, ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించబోతున్నట్టు మున్సిపల్, ఐటీ మంత్రి కె తారకరామారావు వెల్లడించారు. టి-ఫైబర్ ప్రాజెక్టు ఫలాలను పట్టణాలు, నగరాలకు సైతం అందిస్తామన్నారు. వాటర్ పైపులైన్‌తోపాటు ఆఫ్టిక్ ఫైబర్ లైన్ వేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.

09/02/2017 - 01:30

హైదరాబాద్, సెప్టెంబర్ 1: ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సిపిఎస్) రద్దుకు డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా నిర్వహించిన సామూహిక సెలవు విజయవంతమైంది.

Pages