S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/09/2016 - 02:15

భద్రాచలం, నవంబర్ 8: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా మదారి గ్రామానికి చెందిన సర్పంచ్ భీమా, మరో ఇద్దరు మహిళలను మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. మదారి గ్రామంలోకి సాయుధులైన మావోయిస్టులు వచ్చి భీమాతో పాటు మరో ఇద్దరు మహిళలను నిద్రలేపి తమ వెంట అడవుల్లోకి తీసుకెళ్లారు.

11/08/2016 - 03:33

ఖమ్మం, నవంబర్ 7: ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఇల్లందు నుండి తెల్లవారుఝామున 5గంటలకు ఖమ్మం బయలుదేరిన టాటా ఏస్ వాహనాన్ని కారేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద లారీ ఢీకొంది. ఈ దుర్ఘటనలో టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మరణించగా మరో ఐదుగురికి గాయలయ్యాయి. టాటా ఏస్‌లో డ్రెవర్ సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారు.

11/08/2016 - 03:30

భద్రాచలం, నవంబర్ 7: భద్రాచలానికి షాక్ మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. విభజన, జిల్లాల పునర్విభజనలో ఏకంగా రూపు మారిపోయిన భద్రాచలం నియోజకవర్గం ఐటిడిఏ కేంద్రం తర్వాత పలు ప్రభుత్వ కార్యాలయాలను కోల్పోయింది. ఇప్పటికే పలు కార్యాలయాలు ఇక్కడి నుంచి తరలిపోయాయి. ఐటిడిఏలోని జిల్లా మలేరియా, నీటిపారుదల శాఖ కార్యాలయాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి తరలాయి.

11/08/2016 - 03:15

హైదరాబాద్, నవంబర్ 7: అగ్రిగోల్డు బాధితులను ఆదుకునేందుకు ఆ సంస్థకు ఉన్న ఆస్తులను అమ్మే బాధ్యతను ఎపి ప్రభుత్వం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు ఆదేశించింది. విజయవాడ పరిసరాల్లోని ఏడు ఆస్తులను అమ్మాలని సూచించింది. జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్ వి భట్‌లతో కూడిన డివిజన్ బెంచ్ అగ్రి గోల్డు డిపాజిటర్సు ఏజెంట్స్ సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిల్‌ను విచారించింది.

11/08/2016 - 03:08

హైదరాబాద్, నవంబర్ 7: ఈ నెల 11 నుండి జరుగుతున్న గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మొబైల్ యాప్‌ను రూపొందించారు. ఈ సదుపాయం దేశంలో మొట్టమొదటిది అవుతుందని చెబుతున్నారు.

11/08/2016 - 03:13

హైదరాబాద్, నవంబర్ 7: ఓటుకు నోటు కేసు విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సోమవారం నాడు కోర్టులో తన వాదనలు వినిపించారు.

11/08/2016 - 02:43

శంషాబాద్, నవంబర్ 7: త్రిదండి చిన జీయర్ స్వామిని సోమవారం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆర్ట్ ఆఫ్ లీవింగ్ సంస్థ వ్యవస్థాపకులు రవిశంకర్ కలిశారు. ముచ్చింతల్‌లోని జీయర్ ఆశ్రమానికి వచ్చిన ఆయన జీయర్‌తో కాసేపు ముచ్చటించారు. షష్టిపూర్తి జరుపుకున్న జీయర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఆయన సాతంరాయి సమీపంలోని ఎంఎస్ కనె్వన్షన్‌లో జరిగిన రుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొని పూజలు జరిపారు.

11/08/2016 - 02:40

తిరుపతి, నవంబర్ 7: పవిత్ర కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిఏటా నిర్వహించే పుష్పయాగ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. సుగంధ సువాసనలు వెదజల్లే 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్పస్వామికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం అద్భుతంగా సాగింది.

11/08/2016 - 02:38

భద్రాచలం, నవంబర్ 7: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సోమవారం ఓ ఎస్సైను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని బాగ్‌నది పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై నర్మదబోగాను గుర్తుతెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చిచంపారు. ఇది మావోయిస్టుల ఘాతుకమేనని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఆ దిశగా విచారణ చేపట్టారు.

11/08/2016 - 02:36

హైదరాబాద్/ ఖైరతాబాద్, నవంబర్ 7: వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువచ్చినందుకు మీడియాపై ఆంక్షలు విధించడం సమంజసం కాదని పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ మీడియా సంస్థ ఎన్‌డిటివి, న్యూస్ అసోంపై కేంద్రం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు.

Pages