S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/16/2015 - 07:29

యు.కొత్తపల్లి, డిసెంబర్ 15: ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) భూముల్లో జరుగుతున్న ఫెన్సింగ్ నిర్మాణ పనులను రైతులు అడ్డుకోవడంతో తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెజ్ పరిధిలోని యు.కొత్తపల్లి, తొండంగి మండలాలకు చెందిన రైతులు భారీ సంఖ్యలో రమణక్కపేట గ్రామానికి చేరుకుని ఆందోళనలో పాల్గొని పనులను అడ్డుకున్నారు.

12/16/2015 - 07:28

కడప, డిసెంబర్ 15: కడప జిల్లాలో కాల్‌మనీ మాఫియాపై పోలీసులు కనె్నర్రజేశారు. రాష్ట్ర డిజిపి జెవి రాముడు ఆదేశాలతో మంగళవారం జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోలీసులు కాల్‌మనీ వ్యాపారులపై మూకుమ్మడిగా దాడులు చేసి, పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారివద్ద నుంచి భారీమొత్తంలో నగదుతోపాటు బాధితుల వద్ద రాయించుకున్న ప్రామిసరీనోట్లను స్వాధీనం చేసుకున్నారు.

12/16/2015 - 07:32

విశాఖపట్నం, డిసెంబర్ 15: విజయవాడలో కాల్ మనీ పేరుతో వడ్డీ వ్యాపారులు సాగిస్తున్న వేధింపులు వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడింది. ఇటువంటి వ్యాపారం కేవలం విజయవాడలోనే కాదు, రాష్ట్రం నలుమూలలా జరుగుతోంది. విశాఖ నగరంలో చాలా కాలం కిందటే ఈ వ్యాపారం మొదలైంది. విజయవాడలో వడ్డీ వ్యాపారులు వసూలు చేస్తున్న స్థాయిలోనే ఇక్కడి వ్యాపారులు కూడా వడ్డీలు వసూలు చేస్తున్నారు.

12/16/2015 - 07:10

హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్కరణల్లో భాగంగా పాఠశాల విద్యలో ప్రతి జిల్లాకూ ఇద్దరు డిఇఓలను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు గరిష్టంగా 5వేల వరకూ ఉన్నాయి.

12/16/2015 - 07:09

హైదరాబాద్, డిసెంబర్ 15: దక్షిణ భారతదేశంలో రానున్న రోజుల్లో భారీ ఎత్తున వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని అంతర్జాతీయ వాతావరణ కేంద్రం ప్రకటించడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి గమనం తెలుసుకునేందుకు, వర్షపాతం వివరాల నమోదు, అంచనాల నివేదికను తయారుచేసేందుకు కొత్తగా 14 వరద హెచ్చరిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయించింది.

12/16/2015 - 07:07

విజయవాడ (క్రైం), డిసెంబర్ 15: కాల్‌మనీ పేరుతో వేధిస్తే పిడి చట్టం ప్రయోగిస్తామని రాష్ట్ర డిజిపి జెవి రాముడు హెచ్చరించారు. విజయవాడ కాల్‌మనీ సెక్స్ రాకెట్ వెనుక ఎంతటి వారున్నా వదిలేది లేదని, కేసు విచారణపై అపోహలు వద్దని స్పష్టం చేశారు. ఈకేసుకు సంబంధించి వస్తున్న రాజకీయ ఊహాగానాలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

12/16/2015 - 07:06

విజయవాడ, డిసెంబర్ 15: రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో తిరుపతి, అమరావతి, విజయవాడలలో నైపుణ్య శిక్షణకు ప్రత్యేక భవనాలు నిర్మించాలని ఆదేశించిన ఆయన జిల్లా స్థాయిలో డిఆర్‌డిఎకి శిక్షణ బాధ్యతలు అప్పగించాలని చెప్పారు.

12/16/2015 - 07:02

హైదరాబాద్, డిసెంబర్ 15: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో 8,44,328 సీట్లు మిగిలిపోయినట్టు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. వీటిలో గరిష్ఠంగా దాదాపు లక్షన్నర సీట్లు తెలుగురాష్ట్రాల్లోనే మిగిలిపోయాయి.

12/16/2015 - 07:00

తిరుచానూరు, డిసెంబర్ 15:శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో నిర్వహించే వాహన సేవలలో ముఖ్యమైన రథోత్సవం మంగళవారం భక్తుల గోవింద నామస్మరణల నడుమ అంగరంగ వైభవంగా సాగింది. రథంపై అమ్మవారు ప్రసన్నమూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆత్మ రధికుడని, శరీరం రథమని, బుద్ధి సారధి కాగా, మసస్సు పగ్గమై, ఇంద్రియాలు గుర్రాలుగా, విషయాలనే వీధులలో సాగుతాయని కఠోరోపనిషత్తు చెబుతోంది.

12/16/2015 - 06:59

హైదరాబాద్, డిసెంబర్ 15: నగర పోలీసు కమిషనర్ కావాలనే ఓ బాలుడి కోరిక తీరింది. నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన అరౌనా అనే ఎనిమిదేళ్ల బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. గత కొంతకాలంగా రక్తహీనతతో బాధపడుతున్న ఆ బాలుడు పోలీసు కమిషనర్ కావాలనే కోరిక బలంగా ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన మేక్-ఎ-విష్ ఫౌండేషన్ సంస్థ సదరు బాలుడి కోరిక గురించి నగర పోలీసు కమిషనర్‌కు విన్నవించింది.

Pages