S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/17/2018 - 00:48

అమలాపురం, జూలై 16: తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పశుపుల్లంక పడవ ప్రమాదంలో గల్లంతైన విద్యార్థినుల్లో ఒకరి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థినులు సహా మొత్తం ఏడుగురు గల్లంతవ్వగా, వారిలో వివాహిత మృతదేహాన్ని ఆదివారం గుర్తించిన సంగతి విదితమే. సోమవారం సాయంత్రం ఐ.పోలవరం మండలం భైరవపాలెం సమీపంలో ఒక విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించారు.

07/16/2018 - 17:24

శ్రీకాకుళం: ప్రధాని మోదీ విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, రాహుల్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని ఏపీపీసీసీ చీఫ్ ఉమెన్‌చాందీ అన్నారు. ఆయన శ్రీకాకుళంలో పర్యటిస్తూ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను వీడినవారంతా తిరిగి పార్టీలో చేరాలని అన్నారు.

07/16/2018 - 17:20

హైదరాబాద్: సోమవారంనాడు జరిగిన నగర కాంగ్రెస్ కమిటీ సమావేశం రసాభాసగా జరిగింది. సికింద్రాబాద్ స్థానం నుంచి అజారుద్దీన్ పోటీ చేస్తానని ప్రకటించటంపై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ వర్గం మండిపడింది. సికింద్రాబాద్ నుంచి తానే పోటీచేస్తానని అంజన్‌కుమార్ యాదవ్ స్పష్టం చేయటం జరిగింది.

07/16/2018 - 13:42

కొల్లూరు : గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనెపూడిలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పోతర్లంకలో ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు.

07/16/2018 - 12:54

విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని గంటకు 50 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

07/16/2018 - 12:53

నల్లగొండ: జిల్లాలోని కొండమల్లెపల్లి వద్ద కారు చెట్టును ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు నాగర్ కర్నూల్ వాసులు, ఒకరు షాద్‌నగర్ వాసి. విజయవాడ నుంచి వస్తుండగా అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

07/16/2018 - 12:52

సరుబుజ్జిలి: వంశధార నదిలో చిక్కుకున్న కూలీలు, డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. రెండు గంటలు పాటు శ్రమించిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలించి బాధితులను ఒడ్డుకు చేర్చారు. శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి మండలం పురుషోత్తపురంలో ఇసుకర్యాంప్‌లో ఇసుకను తోడేందుకు వెళ్లిన కూలీలు వంశధార నది ప్రవాహంలో చిక్కుకుపోయారు.

07/16/2018 - 04:00

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పురాతన భవనాలు ఆందోళనకర స్థితికి చేరాయ. వందేళ్ల నాటి ఈ భవనాల్లో నేటికీ ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతూనే ఉన్నాయ. ఇవి ఎప్పుడు కూలిపోతాయో అంచనావేయలేని పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్ర సచివాలయంలో వందేళ్ల క్రితం నిర్మించిన ‘సర్వహిత’ భవనం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

07/16/2018 - 02:01

హైదరాబాద్, జూలై 15: మజ్లీస్ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా పట్టించుకోరా? అని బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నశించిందని, పోలీసుల రాజ్యం, నిర్బంధకాండ అమలు అవుతున్నదని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల్లో ఆరుగురిపై కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు.

07/16/2018 - 02:00

హైదరాబాద్, జూలై 15: ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెంబర్ 550పై హైకోర్టు స్టే విధించినందున మెడికల్ కౌన్సిలింగ్ వెంటనే నిలిపివేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి విజ్ఞప్తి చేశారు.

Pages