S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/16/2018 - 00:23

అమరావతి, జూలై 15: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపర్చిన హామీల అమలులో అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రానున్న పార్లమెంట్ సమావేశాల్లో మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

07/16/2018 - 01:40

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అద్భుత ఆర్థిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ నగరాల సదస్సుతో అమరావతి బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగిందన్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సీఆర్‌డీఏ అధికారులతో ప్రపంచ నగరాల సదస్సు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక, తదితరు అంశాలపై ఆదివారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

07/15/2018 - 04:36

తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు భక్తులను అనుమతించరాదని టీటీడీ ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. 9వ తేదీ సాయంత్రం 6గంటల లోపు వచ్చే భక్తులను మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి అనుమతిస్తారు. వీరికి 11వ తేదీలోపు స్వామి దర్శనం భాగ్యం కల్పిస్తారు.

07/15/2018 - 03:58

హైదరాబాద్, జూలై 14: ఉమ్మడి హైకోర్టులో గత మూడేళ్లుగా ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ల సంఘం , ఏపీ హైకోర్టు అడ్వకేట్ల సంఘం ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ టి బి రాధాకృష్ణన్‌ను కోరుతున్నాయి.

07/15/2018 - 01:44

బళ్లారి, జూలై 14: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. శనివారం సుమారు 76వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. జలాశయం పరివాహక ప్రాంతాలైన శివమొగ్గ, చిక్కమంగళూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరుజలాశయానికి చేరుతోంది. శనివారం ఏకంగా 76,527 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరింది. జలాశయంలో 66 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

07/15/2018 - 01:42

తిరుపతి, జూలై 14: అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఐ.రవి, జి.శ్రీనివాసు టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ. 13.5 కోట్లు విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శనివారం ఉదయం ఈ విరాళం డీడీలను దాతలు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌కు అందించారు. అమెరికాలోని బోస్టన్ నగరంలో ఆర్ ఎక్స్ అడ్వాన్స్, ఫార్మ పరిశ్రమ వ్యవస్థాపకులు, సీఈఓ ఐకా రవి శ్రీవారి హుండీకి రూ.

07/15/2018 - 01:40

విజయవాడ, జూలై 14: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి శనివారం తెల్లవారుజాము నుంచి వరద నీటి తాకిడి క్రమేణ పెరుగుతోంది. ముందుగా కృష్ణా డెల్టా ఆయకట్టు 13లక్షల ఎకరాలకు సాగునీరందించే కాలువలన్నింటికీ పుష్కలంగా నీరు వదలుతూ మిగిలిన నీటిని సముద్రంలోకి వదలటం ప్రారంభించారు.

07/15/2018 - 01:39

హైదరాబాద్, జూలై 14: కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వంలో వైకాపా చేరాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖా మంత్రి రామదాస్ అఠావలె పేర్కొన్నారు. ఎన్‌డీఎ నుండి టీడీపీ వైదొలగిన కారణంగా వైకాపా చేరాలని రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థిగా జగన్మోహన్‌రెడ్డిని నిలిపేందుకు తాను ప్రధాని నరేంద్రమోదీతోనూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోనూ మాట్లాడతానని అఠావలె చెప్పారు.

07/15/2018 - 00:54

ప్రగతి భవన్‌లో ‘భారీ, మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుల కాలువల ద్వారా గొలుసు కట్టు చెరువుల అనుసంధానం’ అనే కార్యక్రమంపై శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్

07/15/2018 - 00:52

నల్లగొండ, జూలై 14: రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ను 12 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో ఓడించే లక్ష్యం దిశగా కాంగ్రెస్ ముందస్తు కసరత్తుకు శ్రీకారం చుట్టింది.

Pages