S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/17/2018 - 05:13

తెనాలి, జూలై 16: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 1500 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలోని గ్రామ స్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును తెలుసుకునేందుకు, ప్రజలలో అవగాహన కలిగించేందుకు గ్రామదర్శిని కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

07/17/2018 - 05:21

రాజమహేంద్రవరం, జూలై 16:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. తూర్పు అటవీ ప్రాంతంలోని కొండకోనల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు రోడ్డు పైనుండి ప్రవహిస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతంలోని లోతట్టు, పల్లపు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వర్షాల కారణంగా ఈ ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. ఏజెన్సీలో కాజ్‌వేలు మునిగిపోయాయి.

07/17/2018 - 05:14

అనంతపురం, జూలై 16: ఈసారి కూడా వర్షాభావం అనంతపురం జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చేసేలా ఉంది. నెలన్నర క్రితమే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా, జిల్లాలో ఖరీఫ్ పంటల సాగు ముందుకు సాగడం లేదు. రుతుపవనాలు చెప్పుకోదగ్గ ప్రభావం చూపకపోవడంతో సాగుబడి కుదేలవుతోంది. దీంతో ఈసారి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి తలెత్తనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

07/17/2018 - 05:19

హైదరాబాద్, జూలై 16: డిండి ప్రాజెక్టు ఈ ఏడాది చివరిలోగా పూర్తవుతుందని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పంచ ప్రాజెక్టులుగా పిలిచే, తుమ్మిళ్ల, కల్వకుర్తి, నెట్టంపాడ్, కోయిల్‌సాగర్, బీమా ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత లేదని అన్నారు.

07/17/2018 - 05:24

హైదరాబాద్, జూలై 16: స్మార్ట్ ఫోన్ కోసం ఓ టీనేజర్ తన స్నేహితుడి ప్రాణాలనే హరించాడు. సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థి అదృశ్యం కేసులో మిస్టరీ సోమవారం వీడింది. స్నేహితుడే స్మార్ట్ ఫోన్ కోసం అతడిని కిడ్నాప్ చేసి, తలపై మోది హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి కాల్చి చంపిన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో సంచలనం కలిగించింది.

07/17/2018 - 01:21

హైదరాబాద్, జూలై 16: గ్రామ పంచాయతీలకు స్పెషలాఫీసర్లుగా వెళ్లేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. స్థానిక రాజకీయాలతో వేగలేమని, శాఖాపరమైన విధులకు కూడా ఆటంకం కలుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీ కాలం ఈ నెల చివరతో ముగుస్తుండటంతో స్పెషలాఫీసర్లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అయితే, సంబంధిత అధికారులు ఉదిసీనత వ్యక్తం చేస్తున్నారు.

07/17/2018 - 05:27

హైదరాబాద్, జూలై 16: ఇంత కాలం హైదరాబాద్ నగరంలో మజ్లిస్ పార్టీపై స్నేహపూర్వక పోటీ చేశామని, ఇక వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీపై బలమైన అభ్యర్థులను పోటీకి దించి గెలుపొందేందుకు సీరియస్‌గా పని చేద్దామని పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీసీపీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సమష్టిగా పని చేసి, మజ్లిస్‌ను ‘్ఢ’ కొట్టి ఓడిద్దామని ఆయన అన్నారు.

07/17/2018 - 00:53

హైదరాబాద్, జూలై 16: విదేశాల్లో తయారైన మత్తు చాక్లెట్లను దిగుమతి చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న వారిపై హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ఏక కాలంలో దాడి చేసి రెండున్నర లక్షల విలువైన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన చాక్లెట్ల కంపెనీ నుంచి వచ్చిన వాటిని బేగంబజార్‌లోని ఒక దుకాణంలో విక్రయిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.

07/17/2018 - 05:29

శ్రీకాకుళం, జూలై 16: జిల్లాలోని సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం సమీపంలో వంశధార వరద ప్రవాహంలో 53 మంది ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత చిక్కుకుపోయారు. ఇసుక ర్యాంపు నిర్వహిస్తున్న ప్రాంతంలో లారీల్లో పొక్లయిన్ల సహాయంతో ఇసుక లోడ్ చేస్తున్న సందర్భంగా ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో కూలీలు, డ్రైవర్లు, ఇతర సిబ్బంది జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.

07/17/2018 - 00:50

తిరుపతి, జూలై 16: పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు కాలినడకన తిరుమల గిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకున్నారని, వారి అడుగుజాడల్లో నడిచి ఆధ్యాత్మిక చైతన్యం పొందడమే మెట్లోత్సవం అంతరార్థమని ఉడిపి పేజావర్ మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థస్వామీజీ ఉద్ఘాటించారు.

Pages