S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/15/2018 - 01:07

హైదరాబాద్: అయోధ్యలో రామ మందిర నిర్మాణం అంశం వివాదాస్పదం కావడంతో బీజేపీ వెనక్కు తగ్గింది. హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో పార్టీ అధినేత అమిత్ షా రామాలయం అంశాన్ని ప్రస్తావించలేదని కేంద్ర కమిటీ ప్రకటించింది.

07/15/2018 - 00:48

హైదరాబాద్, జూలై 14: రాష్ట్రంలో సర్పంచ్‌ల పాలనకు ఇత తెరపడనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల కాలపరిమితి ఈ నెల 31 తో ముగుస్తుండటంతో, వచ్చే నెల నుండి సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేక అధికారులను (స్పెషల్ ఆఫీసర్స్) నియమించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

07/15/2018 - 01:06

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీల్లో భాగంగా ఇవ్వాల్సిన నిధుల్లో 85 శాతం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరుచేసిందని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి స్పష్టం చేశారు. కేంద్రం ఉదారంగా నిధులిచ్చినప్పటికీ తమపై టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు.

07/15/2018 - 00:28

పెదపూడి, జూలై 14: రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు ఏర్పాటైన కేంద్రాలు దళారులకే ఉపయోగపడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1550 ఇస్తున్నామని చెబుతున్నా రూ.1130కి మించి రైతుకు అందడం లేదన్నారు.

07/15/2018 - 01:04

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లారీలు ఈ నెల 20 నుంచి ఎక్కడివక్కడ నిలిచిపోనున్నాయి. ఈ నిరవధిక బంద్‌కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో లారీలను వచ్చే శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి నిరవధికంగా నిలిపివేసేందుకు ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ నిర్ణయించడంతో దేశవ్యాప్తంగా ఉన్న దాని అనుబంధ సంఘాలన్నీ బంద్ సన్నాహాల్లో మునిగిపోయాయి.

07/15/2018 - 00:23

అమరావతి, జూలై 14: అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ‘రాజధాని లేకుండా విడకొట్టి ప్రజల్లో అభద్రతాభావం పెంచారు. ఇప్పుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలనేదే మా డిమాండ్. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి ఆగదు’ అని అన్నారు.

07/15/2018 - 04:27

అమలాపురం: తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర పడవ ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గల్లంతవ్వగా, వారిలో ఆరుగురు ఉన్నత పాఠశాల విద్యార్థినులే. వాస్తవానికి రెండో శనివారం కావడంతో పాఠశాలకు సెలవు ప్రకటించాల్సి వుంది.

07/15/2018 - 01:02

విజయవాడ: పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను తెలుసుకున్న సీఎం రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎంవో అధికారి రాజవౌళిని అదేశించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు కూడా దుర్ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి గాలింపు, సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేసిన ఆయన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

07/15/2018 - 00:36

అమలాపురం/ ఐ.పోలవరం, జూలై 14: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరి నదీపాయలో శనివారం సాయంత్రం ఘోర పడవ ప్రమాదం జరిగింది. హైస్కూలు విద్యార్థులు, గ్రామస్థులతో వెళుతున్న నాటు పడవ బోల్తాపడటంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. 19మంది సురక్షితంగా బయటపడగా, ఏడుగురు గల్లంతైనట్టు సమాచారం.

07/14/2018 - 23:43

ధర్మపురి, జూలై 14: జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా నిర్ణయస్తారు. చైత్ర పౌర్ణిమ రోజున చంద్ర సంచారం చిత్తా నక్షత్రమున అవుతుంది కనుక ఆ మాసానికి చైత్ర మాసమని, విశాఖ నక్షత్రంలో సంచరించడం వలన వైశాఖ మాసమని, ఇలా పనె్నండు మాసాల పౌర్ణిమలలో చంద్రుని సంచారం ఆధారంగా పేర్లను నిర్ణయించారు.

Pages