S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/16/2018 - 02:55

అమలాపురం, జూలై 15: తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పశువుల్లంక-సలాదివారిపాలెం మధ్య వృద్ధ గౌతమీ గోదావరి నదీపాయలో శనివారం సాయంత్రం పడవ బోల్తా పడిన దుర్ఘటనలో గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం ఆదివారం సాయంత్రం లభ్యమయ్యింది. ఈ ప్రమాదంలో ఒక గృహిణితోపాటు ఆరుగురు విద్యార్థినులు గల్లంతైన సంగతి విదితమే.

07/16/2018 - 01:28

హైదరాబాద్, జూలై 15: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను నెవేర్చటాన్ని కేంద్రం ప్రభుత్వం విస్మరించే అంశాన్ని తీవ్రంగా పరిగణించి పార్లమెంట్ వేదికగా తాము చేపట్టబోయే ఆందోళనకు మద్దతు ఇవ్వాల్సిందిగా టీడీపీ ఎంపీల బృందం టీఆర్‌ఎస్‌ను కోరింది.

07/16/2018 - 01:18

హైదరాబాద్, జూలై 15: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్ళ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్భ్రావృద్ధికి చేసింది ఏమీ లేదని వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్‌కె రోజా విమర్శించారు. ఒక్క చేనేత కార్మికుడికీ రుణ మాఫీ జరగలేదని ఆమె ఆదివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. రుణ మాఫీ చేస్తానని చెప్పి రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేశారని, డ్వాక్రా మహిళలను నమ్మించి మోసగించారని ఆమె మండిపడ్డారు.

07/16/2018 - 01:15

తిరుపతి, జూలై 15: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17వ తేదీన జరగనున్న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినానికి సర్వం సిద్ధమైంది. ఆలయంలోని బంగారువాకిలి వద్ద ఉదయం 7 నుండి 9 గంటల మధ్య ఈ సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకి ఊరేగింపు జరగనుంది. ఇందుకోసం ఆదివారం పల్లకీని సిద్ధం చేశారు.

07/16/2018 - 00:46

తెలంగాణలో బోనాల జాతర మొదలైంది.
సంప్రదాయం ప్రకారం, ఆషాఢమాసం మొదటి ఆదివారం గోల్కొండలోని అమ్మవారి ఆలయంలో తొలి పూజలు జరగడంతో
బోనాల ఉత్సవాలు మొదలయ్యాయ.

07/16/2018 - 04:49

నల్లగొండ: కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తెలంగాణ కాంగ్రెస్ నా యకులు, కార్యకర్తలంతా ఐక్యతతో పనిచేయాలని ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ అహ్మద్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చి న సోనియాగాంధీకి తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి కృతజ్ఞత చాటాలన్నారు.

07/16/2018 - 04:50

హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేసారు. కేంద్ర ప్రభుత్వ తీరుపైగానీ, ప్రధాని మోదీ పట్లగానీ సంతృప్తిగా లేమని అన్నారు. ఉత్తమ సీఎం కేసీఆరా? వైఎస్‌ఆరా? అని ఒకరు అడిగిన ప్రశ్నకు ‘సమాధానం మీకే తెలుసు’ అంటూ దాటవేసారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రజలతో గంటన్నర పాటు కేటీఆర్ ముఖాముఖి నిర్వహించారు.

07/16/2018 - 00:36

హైదరాబాద్, జూలై 15: గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం మధ్యాహ్నం భేటీ అయ్యారు.

07/16/2018 - 01:27

రాజమహేంద్రవరం, జూలై 15: గోదావరి నదిలో వరద జలాల ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజికి ఎగువ నుండి చేరుతున్న వరద జలాలను వచ్చింది వచ్చినట్టుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం ఉదయం కాటన్ బ్యారేజి వద్ద 9.10 అడుగుల నీటి మట్టం నమోదైంది.

07/16/2018 - 01:34

విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ ప్రస్తుతం 3వేల కోట్ల రూపాయల నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ సంస్థ శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడుతున్న 54వేల మంది ఉద్యోగులు, కార్మికుల కోసం నూతన వేతనాల చెల్లింపు జరిగే వరకు తక్షణం 19శాతం మధ్యంతర భృతి అందించాలని నిర్ణయించినట్టు చైర్మన్ వర్ల రామయ్య ప్రకటించారు. ఆర్టీసీ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన మధ్యంతర భృతి వల్ల సంస్థపై తక్షణం రూ.

Pages