S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/23/2018 - 02:38

విశాఖపట్నం, ఏప్రిల్ 22: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి చుట్టూ ముసిరిన వివాదాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. టీటీడీ బోర్డు సభ్యురాలిగా విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెలువడిన కొద్దిసేపటికే ఆమె హిం దువు కాదని క్రిష్టియన్ అంటూ వీడియోలు వైరల్ అయ్యాయి.

04/23/2018 - 02:21

హైదరాబాద్, ఏప్రిల్ 22: కాశ్మీర్ సమస్యపై రాజకీయ చర్చల ప్రక్రియను ప్రారంభించాలని సీపీఎం 22వ జాతీయ మహాసభలు ఆదివారం ఇక్కడ తీర్మానంలో డిమాండ్ చేశాయి. కాశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి దిగజారడంపై సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది. మోదీ ప్రభుత్వం కాశ్మీర్ పట్ల అనుసరిస్తున్న విధానాలు విఫలమయ్యాయన్నారు. మోదీ పాశవిక వైఖరివల్ల మిలిటెంట్లవైపు యువత ఆకర్షితులవుతున్నారన్నారు.

04/23/2018 - 02:19

హైదరాబాద్, ఏప్రిల్ 22: సీపీఎం పార్టీ 22వ జాతీయ మహాసభలు ముగిశాయి. గత ఐదు రోజులుగా కొననసాగిన మహాసభలు ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభతో ముగిశాయి. ఈ నెల 18న ఆర్టీసీ కళ్యాణ మండలంలో పార్టీ సీనియర్ నాయకురాలు మల్లు స్వరాజ్యం జెండా ఆవిష్కరణతో సమావేశాలు ప్రారంభమయ్యాయి.

04/23/2018 - 02:16

హైదరాబాద్, ఏప్రిల్ 22: ప్రతి వ్యక్తి సాధించే విజయం వెనకా తప్పకుండా మహిళా మూర్తి ఉంటుందని, తన విజయం వెనకా తన తల్లి, సతీమణి ఉన్నారని రాజ్యసభ సభ్యుడు టీ.సుబ్బరామి రెడ్డి అన్నారు. ట్యూటర్స్ ప్రైడ్ ఆధ్వర్యంలో విద్య, కళా, సాంస్కృతిక, క్రీడా, సేవా తదితర రంగాల్లో అత్యుత్తమైన సేవలందించిన వంద మంది మహిళలకు లేడీ లెజెండ్ అవార్డుల ప్రదానోత్సవ సభ ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్క్ హోటల్‌లో జరిగింది.

04/23/2018 - 01:29

హైదరాబాద్, ఏప్రిల్ 22: ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత మంచి నీరు ఇవ్వలేకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు అడగబోమని చెప్పిన మాటకు కట్టుబడి మిషన్ భగీరథ పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలిపారు. మిషన్ భగీరథ పనులపై ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

04/23/2018 - 01:25

సెట్ కోడ్ విడుదల చేసిన మంత్రి గంటా

04/23/2018 - 01:25

కాకినాడ, ఏప్రిల్ 22: ఏపీ ఎంసెట్-2018 ఆదివారం తొలిరోజు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా జరిగినట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు తెలిపారు. ఈ పరీక్షకు 94.98 శాతం విద్యార్థులు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఉదయం 32,772 మంది హాజరుకావల్సి ఉండగా 31,157 మంది హాజరయ్యారని, 1615మంది గైర్హాజరయ్యారని ఆయన చెప్పారు. మొత్తం 95.07 శాతం విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.

04/23/2018 - 01:19

విజయవాడ, ఏప్రిల్ 22: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలపై గత నాలుగేళ్లుగా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రజలను ఏవిధంగా వంచించిందీ తెలియజేసేందుకు ఈ నెల 30న ‘వంచన దినం’ పాటిస్తూ విశాఖలో ఒకరోజు సామూహిక నిరసన దీక్ష నిర్వహించాలని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా ఆగిరిపల్లి శిబిరంలో జరిగిన కీలక సమావేశం నిర్ణయించింది.

04/23/2018 - 01:16

హైదరాబాద్, ఏప్రిల్ 22: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు రోజులపాటు జరిగిన 22వ సీపీఎం మహాసభలు ఆదివారం ఇక్కడ ముగిశాయి. చివరి రోజు సీపీఎం ప్రతినిధులు 95మందితో కూడిన కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం కేంద్ర కమిటీ సభ్యులు సీతారాం ఏచూరిని, 17మంది పొలిట్ బ్యూరో సభ్యులను ఎన్నుకున్నారు. ఆదివారం ఇక్కడ ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో

04/23/2018 - 01:12

విజయవాడ, ఏప్రిల్ 22: రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఇక్కడ సమావేశమయ్యారు. విశాఖ పర్యటన ముగించుకుని నేరుగా హైదరాబాద్ చేరుకోవాల్సి ఉన్నప్పటికీ గవర్నర్ తన పర్యటనలో మార్పు చేసుకుని, రైలులో విజయవాడ చేరుకున్నారు. నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో ఆయనకు వసతి కల్పించారు. నగరానికి వచ్చిన గవర్నర్‌ను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు.

Pages