S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/09/2017 - 23:11

హైదరాబాద్, అక్టోబర్ 9: హైదరాబాద్-అమరావతి ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన నివేదిక రూపొందించేందుకు వీలుగా కన్సల్టెంట్ నియామక టెండర్లు పిలిచామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

10/09/2017 - 23:11

హైదరాబాద్, అక్టోబర్ 9: రాష్ట్రంలో తాగు, సాగునీటికి మొత్తం 122 టిఎంసిల నీరు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఇంజనీర్ ఇన్ చీఫ్ బి నాగేంద్ర రావు కృష్ణా బోర్డు మెంబర్ కార్యదర్శిని కోరుతూ లేఖ రాశారు.

10/09/2017 - 23:10

హైదరాబాద్, అక్టోబర్ 9: లంచం ఇవ్వనిదే కార్మికులకు ఫిట్‌మెంట్ సర్ట్ఫికేట్ జారీ చేయడం లేదని సింగరేణి కార్మికులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో సింగరేణి ప్రధాన ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్‌పై బదిలీ వేటు పడింది. ఈ మేరకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కురిడి ప్రసన్న సింహను బదిలీ చేస్తూ సింగరేణి కాలరీస్ పర్సనల్ మేనేజర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసారు.

10/09/2017 - 03:32

హైదరాబాద్, అక్టోబర్ 8: దేశంలో అన్ని న్యాయస్థానాల వద్ద భద్రత పెంచాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు తమ పరిధిలో కోర్టుల వద్ద తగిన పోలీసు భద్రత, నిఘా పెంచాలని కేంద్ర హోంశాఖ కోరింది. ఇటీవల ఒక కోర్టు వద్ద ఒక సాక్షిని ప్రత్యర్థులు హత్య చేశారు.

10/09/2017 - 03:32

మహబూబ్‌నగర్, అక్టోబర్ 8: లారీల సమ్మెలో అత్యవసర సరుకుల రవాణాను మినహాయిస్తున్నామని నేడు, రేపు రెండు రోజులపాటు జరిగే లారీల సమ్మెకు ప్రజలు కూడా సహకరించాలని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

10/09/2017 - 03:31

హైదరాబాద్, అక్టోబర్ 8: బ్రాడ్ బ్యాండ్‌ను ప్రాథమిక వినియోగ సేవగా గుర్తించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కేంద్ర సమాచార మంత్రి మనోజ్‌సిన్హాకు లేఖ రాశారు. ఇంటింటికి ఇంటర్నెట్ ద్వారా టివి, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సహకరించాలని అన్నారు.

10/09/2017 - 03:29

హైదరాబాద్, అక్టోబర్ 8: ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కంచ ఐలయ్య రచించిన ‘సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు’ అనే పుస్తకంపై చర్చిస్తామంటూ ఆదివారం ఆర్యవైశ్య సంఘాలు ఐలయ్య ఇంటిని ముట్టడించేందుకు యత్నించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఐలయ్య ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే క్రమంలో ఐలయ్య మద్దతుదారులు కూడా భారీ సంఖ్యలోనే తరలివచ్చారు.

10/09/2017 - 01:47

హైదరాబాద్, అక్టోబర్ 8: విద్యార్థులు, యువకుల జీవితాలను ప్రభావితం చేసే జోనల్ వ్యవస్థపై ఇష్టానుసారం ప్రకటనలు చేయకుండా తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకోవాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

10/09/2017 - 02:29

హైదరాబాద్, అక్టోబర్ 8: సికిందరాబాద్ వారాసిగూడలో విషాదం చోటుచేసుకుంది. ఓ క్యాబ్ డ్రైవర్/యజమాని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

10/09/2017 - 03:34

హైదరాబాద్, అక్టోబర్ 8: ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా పొగాకు ఉత్పత్తుల వినియోగమే మానవ జాతి ఎదుర్కొంటున్న అతి పెద్ద జాడ్యమని డాక్టర్ అర్షీద్ హెచ్.హకీం అన్నారు. పొగాకు వినియోగం వల్ల ఏటా ఏడు మిలియన్ల మంది దీనికి బలి అవుతున్నారని తెలిపారు.

Pages