S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/24/2017 - 03:52

న్యూఢిల్లీ: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అఖిలపక్ష నేతలు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ అఖిలపక్ష నేతలు, టిజెఎసి నేతలు సీపీఐ నేత డి.రాజా నేతృత్వంలో బుధవారం నాడు రాష్టప్రతిని కలిశారు.

08/23/2017 - 03:58

గోదావరిఖని, ఆగస్టు 22: విప్లవ పోరాటాలకు పుట్టినిల్లుగా పేరున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం కళల కాణాచిగా వర్ధిల్లుతూ రోజురోజుకూ రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా జాతీయ సమైక్యతను పెం పొందించే జెండా ప్రదర్శనలు... జాతీయ భావాలను ఇనుమడింపజేసే నృత్య ప్రదర్శనలు... సంస్కృతికి అద్దం పట్టే జానపద నృత్య ప్రదర్శనలు చేస్తూ... అంతర్జాతీయ స్థాయిలో మెప్పును పొందుతున్నారు.

08/23/2017 - 03:56

సిరిసిల్ల, ఆగస్టు 22: ప్రభుత్వ ఆసుపత్రులపై అపోహలు తొలగించి, ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంచడానికి పూర్తి స్థాయిలో తీర్చిదిద్ది మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు.

08/23/2017 - 03:55

వాంకిడి, ఆగస్టు 22: కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలం బెండార గ్రామం వద్ద గల మూలమలుపు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాంకిడి మండలంలో జరిగిన భవానిమాత జాతరకు వచ్చి టిఎస్ 1యుబి 5055 అనే నెంబర్ గల ఆటోలో తిరిగి వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.

08/23/2017 - 03:54

తిమ్మాజిపేట, ఆగస్టు 22: భారతదేశంలోని అతి పెద్ద వినాయకుడిగా నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల పరిధిలోని ఆవంచ గ్రామంలో వెలసిన ఐశ్వర్య గణపతి ప్రసిద్ధికెక్కాడు. క్రీ.పూ. 1175లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన పశ్చిమ చాళుక్యుల వంశస్థుడైన తైలంపుడు అనే రాజు తన అన్నతో గొడవపడి తండ్రి విక్రమాదిత్యునికి తన రాజ్యాన్ని వదిలి ఆవంచ గ్రామానికి చేరుకొని ఆవంచను రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాడు.

08/23/2017 - 03:34

హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్రంలో పులులు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. పులులను రక్షించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వేటగాళ్ల తుపాకులు, విద్యుత్ తీగలకు పులులు నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. రాష్ట్రంలో రెండు పులుల అభయారణ్యాలు (టైగర్ రిజర్వ్) ఉన్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, మంచిర్యాల జిల్లాలోని కవాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయి.

08/23/2017 - 03:25

హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డును దేశంలోనే ఉత్తమమైన బోర్డుగా తయారుచేస్తామని ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మంగళవారం నాడు బోర్డు కార్యాలయంలో జరిగిన రెండో సర్వ సభ్య సమావేశంలో కడియం పాల్గొన్నారు. ఇంత వరకూ దేశంలో బెస్టు డిజిటలైజ్డ్ బోర్డుగా వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో తెలంగాణ బోర్డుకు అవార్డు లభించిందని అన్నారు. ఇందుకు కృషి చేసిన బోర్డు అధికారులను ఆయన అభినందించారు.

08/23/2017 - 03:16

హైదరాబాద్, ఆగస్టు 22: హరిత హారం పథకాన్ని రొటీన్‌గా చూడవద్దని తెలంగాణలో భవిష్యత్తు ప్రజాజీవితంతో ముడిపడి ఉన్న పథకంగా ప్రాధాన్యత ఇవ్వాలని, కలెక్టర్లు, ఇతర అధికారులు పథకం అమలుపై దృష్టిసారించాలని అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ సూచించారు. కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరిత హారం అమలు ఆధారంగా అధికారుల పనితీరు మదింపు ఉంటుందని, జిల్లాలకు ర్యాంకులు ఉంటాయని చెప్పారు.

08/23/2017 - 03:15

హైదరాబాద్, ఆగస్టు 22: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆరు రైల్వే డివిజన్లకు చెందిన అధికారులతో జిఎం వినోద్‌కుమార్ మంగళవారం సికిందరాబాద్‌లోని రైల్వే నిలయంలో సమీక్ష నిర్వహించారు. రైల్వే భద్రత, స్వచ్ఛ రైల్వే, స్వచ్ఛ భారత్‌పై సమావేశం జరిగింది. రైల్వే అధికారులు ఆరు డివిజన్ల పరిధిలోని ఆయా రైల్వే స్టేషన్లలో జరిపిన ప్రత్యేక డ్రైవ్‌పై చర్చ జరిగింది.

08/23/2017 - 03:15

హైదరాబాద్, ఆగస్టు 22:ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని, అలాంటి సంస్కారహీనులతో చర్చించే ప్రసక్తే లేదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

Pages