S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/15/2017 - 03:49

మహబూబ్‌నగర్, ఆగస్టు 14: పాలమూరు ప్రాజెక్టులను కాపాడుకుందామని, నీళ్ల కోసం, నిర్వాసితుల కోసం అండగా నిలుద్దామని వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు గొంతెత్తారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని అన్నపూర్ణ గార్డెన్‌లో టిజెఎసి, పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నీళ్ల కోసం, నిర్వాసితుల కోసం అనే అంశంపై వివిధ పార్టీల నేతలతో కలిసి టిజెఎసి నేతలు రాజేందర్‌రెడ్డి, రాఘవచారి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.

08/15/2017 - 03:47

బీర్కూర్, ఆగస్టు 14: రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కెసిఆర్ ప్రభుత్వం కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పునరుద్ఘాటించారు. సోమవారం ఆయన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.

08/15/2017 - 03:45

కట్టంగూర్, ఆగస్టు 14: 65వ నెంబర్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామశివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కమ్యూనిస్టు యోధుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత మద్దికాయల ఓంకార్ తనయుడు, అతని అత్త అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

08/15/2017 - 03:25

హైదరాబాద్, ఆగస్టు 14: పద్రాగస్టు సందర్భంగా ఉగ్రవాదులచే విమానాలు హైజాక్ అయ్యే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్డ్ ప్రకటించారు. విదేశీ విమానాల రాకపోకలపై గట్టి నిఘా పెట్టారు. ప్రయాణికులను క్షుణ్ణంగా సోదాలు నిర్వహించిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నట్టు ఎయిర్‌పోర్ట్ విభాగం భద్రతాధికారులు తెలిపారు.

08/15/2017 - 03:23

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణలో కొత్త జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సిఎం కెసిఆర్‌ను కోరారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు 8972 కాదని 40వేల వరకు ఖాళీలు ఉన్నాయని, వాటన్నింటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం సిఎం కెసిఆర్‌కు ఆయన లేఖ రాశారు.

08/15/2017 - 03:23

హైదరాబాద్, ఆగస్టు 14: అనేక జబ్బులకు ఆహార అలవాట్లు, జీవన విధానమే కారణమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి తెలిపారు. అనారోగ్యానికి సంబంధించిన అంశాలపై ప్రజలకు ముందుగానే అవగాహన కలిగించాలని అన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

08/15/2017 - 03:22

హైదరాబాద్, ఆగస్టు 14: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా పట్టుబడింది. గుట్టు చప్పుడు కాకుండా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో ఒక నైజీరియన్‌తోపాటు మరో ముగ్గురు ఉన్నారు. వారి వద్ద నుంచి భారీ ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాచకొండ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

08/15/2017 - 03:19

చిత్రాలు.. పంద్రాగస్టు వేడుకలు నిర్వహించనున్న గోల్కొండ కోటలో సోమవారం తనిఖీలు చేస్తున్న బాంబు స్క్వాడ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు. బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమైన పోలీసులు

08/15/2017 - 02:33

హైదరాబాద్, ఆగస్టు 14: ఆర్ట్ ఆఫ్ లివింగ్, యోగ పట్ల ఆసక్తి ఉన్న వారికో శుభవార్త. ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా, ఆనందంగా, ఉత్సాహంగా జీవించేందుకు ఉపయోగపడే ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ను ఈ నెల 18నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్‌లో శ్రీశ్రీరవిశంకర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా నేర్పించనున్నారు.

08/15/2017 - 02:31

చిత్రం.. రాజ్‌భవన్‌లో సోమవారం కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్న గవర్నర్ నరసింహన్ దంపతులు.

Pages