S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/25/2017 - 01:41

హైదరాబాద్, జూలై 24: వ్యవసాయదారులను ఆదుకోవడంలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడుతూ సోమవారం సిపిఐ తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని నిర్వహించింది. జైల్ భరో కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా రైతులూ పాల్గొన్నారు.

07/25/2017 - 01:40

సిద్దిపేట, జూలై 24 : రైతుల సమస్యలను పరిష్కరించాలని,వ్యవసాయ సంక్షోభాన్ని నివారించాలని, ప్రజాసమస్యల పరిష్కారం కోసం భారతీ కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శన, జైలుభరో కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.

07/25/2017 - 19:25

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పాఠశాలల్లో 5, 8 తరగతుల్లో డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం చేస్తున్న యోచనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీనికి తోడు రానున్న రోజుల్లో డిగ్రీలోనూ డిటెన్షన్ అమలుచేసే యోచనలో కేంద్రం ఉంది. ఇది బలహీనవర్గాల విద్యార్థులకు నష్టం చేస్తుందని, ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలల వెలుపలే ఉండిపోవల్సి వస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు.

07/25/2017 - 00:04

హైదరాబాద్, జూలై 24: ఎంఐఎం నేత , ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై జరిగిన హత్యాయత్నం కేసులో ఏడో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రప్రభుత్వం అప్పీలు పిటిషన్‌లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం రెండు పిటిషన్లను వేర్వేరుగా దాఖలు చేసింది. హత్యాయత్నం కేసులో తొమ్మిది మందిని నిర్దోషులుగా సెషన్స్ కోర్టు విడుదలచేయడాన్ని ప్రభుత్వం సవాలు చేసింది.

07/25/2017 - 00:03

హైదరాబాద్, జూలై 24: పోలీసులు ఎవరి అండ చూసుకుని సిరిసిల్లలో రెచ్చిపోయి దళితులపై అమానుషంగా దాడి చేశారని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసులు అమాయకులైన దళితులను, బిసిలను ఐదు రోజుల పాటు అక్రమంగా నిర్భంధించి చిత్ర హింసలు పెట్టారని ఆయన విమర్శించారు.

07/25/2017 - 00:03

హైదరాబాద్, జూలై 24: రజకులకు, నారుూ బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం వచ్చే నెలలో వారికి పరికరాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఈ పరికరాలు అందించనున్నట్లు వారు సోమవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు.

07/25/2017 - 00:02

హైదరాబాద్, జూలై 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్‌కో (ఎపి ట్రాన్స్‌కో), తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో (టిఎస్ ట్రాన్స్‌కో) మధ్య విద్యుత్ బకాయిల విషయంలో ఉన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు తాము (టిఎస్ ట్రాన్స్‌కో) సిద్ధంగా ఉన్నట్టు టిఎస్ ట్రాన్స్‌కో, జెన్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు.

07/24/2017 - 02:42

కరీంనగర్ టౌన్, జూలై 23: తెలంగాణ ప్రజానీకానికి ప్రయాణబంధువైన రాష్ట్ర రోడ్డురవాణాసంస్థను ప్రైవేటీకరించే ప్రసక్తేలేదని, వదంతులు నమ్మాల్సిన పనిలేదని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి స్పష్టం చేశా రు. ప్రయాణీకుల రవాణాకు ఆయువుపట్టైన బస్టాండ్ల ఆధునీకరణలో భాగంగా ఆదివారం నగరంలోని ప్రధాన బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

07/24/2017 - 02:40

గజ్వేల్, జూలై 23: సిఎం కెసిఆర్ సారధ్యం లో హరిత విప్లవం సాధిద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్ర రవాణ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిదిలోని ప్రజ్ఞాపూర్ బస్‌డిపో వద్ద మొక్కలు నాటిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి జిల్లాలో 2కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, వాటిని సంరక్షించే బాధ్యత కూడా చేపట్టాలని సూచించారు.

07/24/2017 - 02:36

మఠంపల్లి, జూలై 23: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్‌టితో సిమెంట్ రంగానికి మేలు జరుగుతుందని నాగార్జున సిమెంట్స్ ఎండి కలిదండి రవి అన్నారు. సూర్యాపేట జిల్లాలోని పరిశ్రమ పరిధిలోని ఎన్‌సిఎల్ పాఠశాల 26వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు.

Pages