S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/21/2017 - 02:21

హైదరాబాద్, జూన్ 20: వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా హరిత హారం నిర్వహించనున్నారు. 40 కోట్ల మొక్కలను నాటుతారు. మొక్కలు నాటేందుకు విస్తృతంగా ప్రచారం చేసేందుకు కళాకారుల బృందాలను సైతం హరిత హారంకు ఉపయోగించుకోనున్నారు. రవీంద్ర భారతిలో కళాకారులకు మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 550 మంది సాంస్కృతిక సారథి కళాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

06/21/2017 - 02:19

హైదరాబాద్, జూన్ 20: రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్‌డిఏ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభాపక్షం స్వాగతిస్తోందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

06/21/2017 - 02:15

హైదరాబాద్, జూన్ 20: తెలంగాణలో అన్యాక్రాంతమైన భూదాన భూములపై సిబిఐ విచారణ జరిపించాలని సర్వే సేవా సంఘ్, తెలంగాణ సర్వోదయ మండలి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేవారు. ప్రభుత్వం వెంటనే భూదాన యజ్ఞ బోర్డును ఏర్పాటు చేయాలని సర్వ సేవా సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ హుస్సేన్, తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షుడు వి. అరవింద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్.

06/21/2017 - 02:15

హైదరాబాద్, జూన్ 20: రైతుల సమస్యలు, భూకుంభకోణాలు, జోనల్ వ్యవస్థ రద్దు వంటి ప్రజా సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన టి.టిడిపి కార్యవర్గ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ప్రసంగిస్తూ భూ కుంభకోణాలపై ముఖ్యమంత్రి కె.

06/21/2017 - 00:10

హైదరాబాద్, జూన్ 20: ముత్తూట్ ఫైనాన్స్ చోరీ కేసులో అసలు దొంగ దొరికితేనే మొత్తం బంగారం రికవరీ అయ్యే అవకాశం ఉందని, అసలు దొంగ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఏసిపి రవికుమార్ తెలిపారు.

06/21/2017 - 00:09

హైదరాబాద్, జూన్ 20: ఇస్లాం, క్రిస్టియన్లు మన దేశానికి బయటి నుంచి వచ్చారు కాబట్టి వారికి రిజర్వేషన్లు ఇవ్వరాదని రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీకి దిగిన రామ్‌నాథ్ కోవింద్ లోగడ అన్నారని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.

06/21/2017 - 00:09

హైదరాబాద్, జూన్ 20: రాష్టప్రతి పదవికి ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న వ్యక్తిని తాము అంగీకరించేది లేదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాంనాథ్ కోవింద్ పేరు ప్రకటించడానికి ముందు తమను సంప్రదించలేదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు.

06/21/2017 - 00:08

హైదరాబాద్, జూన్ 20: హైదరాబాద్‌లో బిచ్చగాళ్ల కిడ్నాప్ కలకలం రేపుతోంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్‌బినగర్‌లో మంగళవారం తెల్లవారుజామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యాన్‌లో నలుగురు బిచ్చగాళ్లను బలవంతంగా ఎక్కించుకుని పరారైన సంఘటన కలకలం సృష్టించింది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తుండగా దుండగులు కిడ్నాప్‌కు పాల్పడ్డారు.

06/21/2017 - 00:08

హైదరాబాద్, జూన్ 20: డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది.

06/20/2017 - 03:17

గద్వాల, జూన్ 19: ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గత ఏడాదితో పోల్చుకుంటే ముందస్తు నీరు చేరి ఆయకట్టు రైతులను ఆనందపరుస్తోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు కృష్ణానది, జూరాల ప్రాజెక్టు పరివాహాక ప్రాంతాల నుండి వచ్చిన నీటి చేరికతో ప్రాజెక్టుకు జలకళ వచ్చింది.

Pages