S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/22/2017 - 23:39

హైదరాబాద్, జూన్ 22: హైదరాబాద్‌లోని భరోసా కేంద్రంలో పాలకమండలి గురువారం సమావేశమైంది. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరోసా కేంద్రం నిర్వహణ, బాధితులకు అందుతున్న పోలీస్ సహాయం, వైద్యం, పునరావాసంపై చర్చించారు.

06/22/2017 - 23:38

హైదరాబాద్, జూన్ 22: దేశం అంతా నగదు చెల్లింపులను నియంత్రించి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నా రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్, పార్మసీ కాలేజీల యాజమాన్యాలు మాత్రం యధేచ్ఛగా నగదు చెల్లింపులనే డిమాండ్ చేస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులు జరిగితే ఫీజుకు మించి ఒక్క రూపాయి కూడా అదంగా తీసుకోవడానికి వీలు లేని పరిస్థితి కావడంతో నగదు చెల్లింపుల ద్వారా సీట్ల అమ్మకం పూర్తి చేస్తున్నాయి.

06/22/2017 - 23:35

హైదరాబాద్, జూన్ 22: రాష్ట్రంలోని చేనేత కార్మికుల కోసం ఒక నూతన పొదుపు పథకాన్ని ప్రారంభించనున్నట్టు చేనేత, జౌళి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. చేనతే కార్మికులతో పాటు, పవర్ లూమ్ కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. గతంలో ఉన్న పొదుపు పథకాన్ని మార్చి, నేత కార్మికులకు ప్రయోజనం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఈనెల 24న పోచంపల్లిలో పొదుపు పథకాన్ని ప్రారంభిస్తారు.

06/22/2017 - 02:36

హైదరాబాద్, జూన్ 21: పంటల సాగు పెట్టుబడి కోసం వచ్చే ఏడాది నుంచి రబీ, ఖరీఫ్ రెండు సీజన్లకు కలిపి ఒక్కో ఎకరాకు రూ. 8 వేల చొప్పున నగదు చెల్లించడం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు సమగ్ర సర్వే గందరగోళంగా మారింది. ఒక్కో సీజన్‌కు నాలుగు వేల చొప్పున ప్రభుత్వం ఉచితంగా చెల్లించనుండటంతో ఇబ్బడి ముబ్బడిగా రైతులు దరఖాస్తులు చేసుకున్నారు.

06/22/2017 - 02:36

హైదరాబాద్, జూన్ 21: తెలంగాణలోని రెవిన్యూ శాఖలో 2506 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తాజాగా అటవీ శాఖలో మరో 1857 బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. అటవీశాఖలో 1857 బీట్ ఆఫీసర్ పోస్టులను ప్రత్యక్ష రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె రామకృష్ణారావు విడుదల చేశారు.

06/22/2017 - 02:17

హైదరాబాద్, జూన్ 21: యోగ శారీర దారుఢ్యంతోపాటు మానసిక ప్రశాంతతకు దోహదపడుతుందని తెలంగాణ డిజిపి కె అనురాగ్‌శర్మ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా బుధవారం ఆక్టోపస్ క్యాంప్ మూడో బెటాలియన్‌లో టిఎస్‌ఎస్‌పి ఐజిపి అభిలాషా బిస్త్, ఆక్టోపస్ ఐజిపి కె శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో యోగ వేడుకలు ఘనంగా జరిగాయి.

06/22/2017 - 02:17

హైదరాబాద్, జూన్ 21: రాష్ట్ర రాజధానిలోని ప్రతిష్టాత్మకమైన నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (నిమ్స్) లో కొత్తగా నిర్మించిన పేయింగ్ రూమ్స్ భవనాన్ని వైద్యమంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి గురువారం ప్రారంభిస్తారు. మొత్తం ఆరుఫ్లోర్లతో నిర్మించ తలపెట్టిన ఈ భవనంలో తొలిదశలో మూడుఫ్లోర్లు పూర్తయ్యాయి.

06/22/2017 - 02:18

హైదరాబాద్, జూన్ 21: తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా రైతులు తాము వేసే పంటలకు బీమా చేయించాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఇక్కడ అధికారికంగా ప్రకటన విడుదల చేస్తూ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం (పిఎంఎఫ్‌బివై) కింద వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు, వేరుసెనగ, సోయాబీన్, పసుపు పంటలకు బీమా చేయించుకునే సౌకర్యం ఉందన్నారు.

06/22/2017 - 02:15

హైదరాబాద్, జూన్ 21: నకిలీ విత్తనాలు, నాణ్యతలేని విత్తనాలను నిలువచేస్తున్న వారిపై, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన ఇక్కడ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి నకిలీ విత్తనాల విక్రయాలు, నివారణపై చర్చించారు.

06/21/2017 - 02:23

హైదరాబాద్, జూన్ 20: ‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి మరో ఇందిరా గాంధీ అవసరం ఉంది..’ అని ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ అన్నారు. ఇందిరా గాంధీలాంటి నాయకత్వం దేశానికి అవసరం కాగా దురదృష్టవశాత్తు నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని ఆయన తెలిపారు. టి.పిసిసికి అనుబంధ విభాగమైన కిసాన్, ఖేత్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఎం.

Pages