S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/09/2017 - 04:02

హైదరాబాద్/ ఉప్పల్, ఏప్రిల్ 8: కూతురుగా భావించాల్సిన గురువే కీచకుడిగా మారి ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరించిన స్కూల్ ప్రిన్సిపాల్‌పై విద్యార్థిని తల్లిదండ్రులు చెప్పులతో దాడి చేసిన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది.

04/09/2017 - 04:17

నిర్మల్, ఏప్రిల్ 8: దేశంలోని హిందువులను సంఘటితం చేసేందుకే వీరహనుమాన్ విజయయాత్రను నిర్వహిస్తున్నామని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి అన్నారు. శనివారం నిర్మల్‌లో విహెచ్‌పి, బజరంగ్‌దళ్, ఇతర హిందూ సంస్థల ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్రను అట్టహాసంగా నిర్వహించారు.

04/09/2017 - 03:52

సిద్దిపేట, ఏప్రిల్ 8: ఒకేరోజు 2.10లక్షల చెట్లు నాటడం, వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం, సంపూర్ణ పారిశుద్ధ్యం, కందకాల తవ్వకం, నగదురహిత తొలి గ్రామంగా పలు రివార్డులు, అవార్డులు సొంతం చేసుకున్న సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ సిగలో మరో మణిహారం చేరనుంది. ఉత్తమ గ్రామసభల నిర్వహణలో, సమష్టి నిర్ణయాలతో సంక్షేమ పథకాల అమలులో జాతీయ స్థాయిలో రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్‌కు ఈ గ్రామం ఎంపికైంది.

04/09/2017 - 03:50

హైదరాబాద్, ఏప్రిల్ 8: బడుగుల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఈనెల జరగనున్న మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ముద్రించిన ఆహ్వానపత్రాన్ని సచివాలయంలో శనివారం మంత్రి ఆవిష్కరించారు.

04/09/2017 - 03:49

తాండూర్, ఏప్రిల్ 8: కుమ్రభీం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ ప్రయాణిస్తున్న పోలీసు వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేపల్లెవాడ వద్ద శనివారం చోటుచేసుకుంది. తాండూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గజ్జల శారద అలియస్ భాయక్క (65)అనే మహిళ ఆదిలాబాద్‌లో ఉంటున్న తన కోడలు, మనమళ్లను చూసేందుకు ఇంటి నుండి బయలుదేరింది.

04/08/2017 - 07:48

దుబ్బాక, ఏప్రిల్ 7: మంత్రాల నెపంతో దాడికి గురైన దంపతులు గురువారం అర్దరాత్రి మృతి చెందారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన కడవేర్గు సుదర్శన్, రాజేశ్వరీలకు దుబ్బాకలో ప్రాథమిక పరీక్షలు చేసి హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయతే రాజేశ్వరి మార్గం మధ్యంలో మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుదర్శన్ మృతి చెందాడు.

04/08/2017 - 07:48

హైదరాబాద్, ఏప్రిల్ 7: చౌకదుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు త్వరలో ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) విధానాన్ని అమలు చేయబోతున్నామని పౌరసరఫరాల కమిషనర్ సివి.ఆనంద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, జూన్ చివరివరకు రాష్ట్రంలోని అన్ని చౌకదుకాణాల్లో (15,606) మూడుదశల్లో ఈ విధానం వస్తుందన్నారు.

04/08/2017 - 07:47

హైదరాబాద్, ఏప్రిల్ 7: తెలంగాణ లారీ యజమానుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న లారీ యజమానులు సమ్మె విరమించారు. తెలంగాణ లారీ యజమానుల సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా లారీ యజమానులు పెట్టిన డిమాండ్లలో 15 డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

04/08/2017 - 05:38

శరవేగంగా ప్రాజెక్టులు పూర్తి
సవాళ్లకు వ్యూహాత్మక పరిష్కారం
ఈసారీ ఇబ్బడిముబ్బడిగా వర్షాలు
వచ్చే ఖరీఫ్‌నాటికి మేడిగడ్డ జలాలు
చైనా ప్రాజెక్టుల అధ్యయనానికి ఇంజనీర్లు
అటవీ అనుమతులపై బెంగలేదు
అవసరమైతే కేంద్రాన్ని కలుస్తా: కెసిఆర్

04/08/2017 - 05:32

హైదరాబాద్, ఏప్రిల్ 7: భూ సేకరణపై తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టానికి కేంద్రం నుంచి త్వరలోనే క్లియరెన్స్ వస్తుందని, సమస్యలు అన్నీ తీరిపోతాయని సిఎం కె చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల సమస్యలపై ప్రగతి భవన్‌లో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. భూసేకరణ కోర్టు కేసులు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆవరోధంగా మారిన అంశంపై సమావేశంలో చర్చించారు. ‘చిక్కులన్నీ తొలగిపోతాయి.

Pages