S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/12/2017 - 09:15

కొడిమ్యాల, జనవరి 11: ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో బైక్‌పై వెడుతున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మంగళవారం సంభవించింది. కొడిమ్యాల మండలం, నల్లగొండ గ్రామంలోని లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించినవారిని అప్పరావుపేట గ్రామానికి చెందిన రేకులపల్లి కిషన్‌రెడ్డి (45), అతడి భార్య పద్మ (38), సమీప బంధువు తిప్పాయిపల్లి గ్రామానికి చెందిన దారం శ్రావణి (28)గా గుర్తించారు.

01/12/2017 - 09:15

వాంకిడి, జనవరి 11: ఇక్రిశాట్, ఉట్నూరు ఐటిడిఎ అధికారుల స్ఫూర్తితో రాష్టవ్య్రాప్తంగా రైతులు పండించే పంటలకు ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర భారీనీటి పారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు పేర్కొన్నారు.

01/12/2017 - 07:45

హైదరాబాద్, జనవరి 11: తెలంగాణ ప్రభుత్వం నియామకాలు జరిపే ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపునిచ్చింది. ఉద్యోగాల భర్తీకి సాధారణ అర్హతగా ప్రకటించే వయస్సుకు ఐదేళ్లు సడలింపునిస్తూ నిర్ణయించింది.
ఈ నిర్ణయం 2021 మే 31 వరకు అమల్లో ఉండేలా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

01/11/2017 - 08:19

హైదరాబాద్, జనవరి 10: ప్రఖ్యాత సాహితీవేత్త, మాజీ ఉప కులపతి రవ్వా శ్రీహరికి తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ఆయనతో పాటు మొత్తం 9 మందికి వివిధ రంగాలకు సంబంధించి పురస్కారాలను ప్రకటించింది.

01/11/2017 - 08:18

హైదరాబాద్, జనవరి 10: పౌరసరఫరాల శాఖ ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటం, భారీ ఎత్తున నిత్యావసర సరకులను పంపిణీ చేయడం, ఆదాయం తెచ్చే శాఖగా కాకుండా సంక్షేమ శాఖగా కొనసాగుతుండటంతో అడుగడుగునా అవాంతరాలే ఎదురౌతున్నాయని కమిషనర్ సి.వి. ఆనంద్ తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తాను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకుని ఐదు నెలలు పూర్తయిందన్నారు.

01/11/2017 - 08:17

హైదరాబాద్, జనవరి 10: ప్రతి జిల్లాలో ఐదేసి చేపల మార్కెట్లను ఏర్పాటు చేయబోతున్నట్టు పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మార్కెట్లను ఏర్పాటు చేయడానికి స్థలాలను ఎంపిక చేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. సచివాలయంలో మంగళవారం మత్స్య, పాడి పరిశ్రమ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

01/11/2017 - 05:27

మార్చినాటికి లైన్ పనులు పూర్తికావాలి కొత్త గ్రిడ్‌లను దక్షిణాదికి అనుసంధానించండి
పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను కోరిన కెసిఆర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్‌లో పెట్టుబడులకు రెడీ
సంసిద్ధత వ్యక్తం చేసిన పిజిసిఐఎల్ సిఎంతో పిజిసిఐఎల్ చైర్మన్ భేటీ

01/11/2017 - 05:24

హైదరాబాద్, జనవరి 10: కాంట్రాక్టు లెక్చరర్లు సమ్మె చేస్తే వారి సర్వీసులు క్రమబద్ధీకరించడం కష్టమవుతుందని, తక్షణం విధుల్లోకి చేరాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తేల్చి చెప్పారు. లేకుంటే జీవో 16 ప్రకారం అనర్హులుగా ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించారు. గత మూడు నెలలుగా కాంట్రాక్టు లెక్చరర్లు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

01/11/2017 - 05:12

గిరిజన ప్రాంతాల్లో మళ్లీ వస్తుమార్పిడి
చీపురుపుల్లలిచ్చి నిత్యావసరాల సేకరణ
నోట్ల రద్దుతో బార్టర్ విధానానికి ప్రాణం
అవగాహన లేక గిరిజనుల కష్టాలు

01/10/2017 - 03:55

ఎల్లారెడ్డిపేట, జనవరి 9:ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థినులలో 60మంది అస్వస్థతకు గురికాగా వారిలో ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎంపి వినోద్‌కుమార్ దత్తత గ్రామమైన వీర్నపల్లిలోని ఆదర్శ పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది.

Pages