S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/23/2016 - 04:56

రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం జిల్లాలు, వాటి పరిధిలోని రెవిన్యూ డివిజన్లు, మండలాల వివరాలు:
1. రంగారెడ్డి జిల్లా
వికారాబాద్ డివిజన్: మర్పల్లి, మొమీన్‌పేట, వికారాబాద్, ధరూర్, బంఠ్వారం, పెద్దేమూల్, తాండూర్, బషీరాబాద్, యలాల్ మండలాలు.

08/23/2016 - 04:55

హైదరాబాద్, ఆగస్టు 22: పట్టణ పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్టవ్య్రాప్తంగా 2లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే!

08/23/2016 - 04:53

హైదరాబాద్, ఆగస్టు 22: 2013 చట్టం ప్రకారం భూ సేకరణ చేయాలని హైకోర్టు తెలంగాణ సర్కార్‌ను సోమవారం నాడు ఆదేశించింది. ఈతీర్పు హైకోర్టును ఆశ్రయించిన 70 మంది మల్లన్నసాగర్ రైతులకు ఊరట కలిగించింది. కోర్టును ఆశ్రయించిన రైతులకు పరిహారం చెల్లించాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

08/23/2016 - 04:53

హైదరాబాద్, ఆగస్టు 22: గోదావరి నదీ జలాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (23న) చేసుకోనున్న ఒప్పందాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

08/22/2016 - 18:05

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు సినిమా పెద్దల అండ కూడా ఉందని నిర్మాత నట్టికుమార్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పలువురు సినియర్ నిర్మాతలు, పెద్దలతొో నయీమ్‌కు సంబంధాలు ఉన్నాయని, తెలుగు సినీ ప్రముఖులను సిట్‌ బృందం విచారించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రాంతంలోని థియేటర్లన్నిటిలో నయీమ్ క్యాంటిన్లే ఉన్నాయన్నాడు.

08/22/2016 - 17:40

ఖమ్మం: పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులే ట్రావెల్స్ బస్సులను నడుపుతున్నారని, ప్రైవేటు బస్సులను నియంత్రించే శక్తి ఎపి సర్కారుకు లేదని వైకాపా అధినేత జగన్ విమర్శించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటనలో క్షతగాత్రులను ఆయన సోమవారం పరామర్శించారు. మృతులకు 5 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

08/22/2016 - 17:39

హైదరాబాద్,విజయవాడ: కృష్ణా పుష్కరాలు మంగళవారంతో ముగియనున్నందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో కృష్ణానదీ తీరాన పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివెళుతున్నారు. ఎపిలో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోను, తెలంగాణలో నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలలో పుష్కర ఘాట్ల వద్ద ఆదివారం నుంచి అనూహ్యంగా రద్దీ పెరగడంతో అధికారులు, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటున్నారు.

08/22/2016 - 16:27

హైదరాబాద్: తెలంగాణలో జిల్లాల పునర్విభజనకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. తొమ్మిది జిల్లాలకు వేర్వేరుగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లతో కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో పది జిల్లాలు, 44 రెవెన్యూ డివిజన్లు, 459 మండలాలున్నాయి.

08/22/2016 - 16:17

నల్గొండ: యాదాద్రిని జిల్లా చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సోమవారం అభినందనలు తెలిపారు. సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని ఆయన దర్శించుకున్నారు.

08/22/2016 - 16:09

హైదరాబాద్: హైదరాబాద్‌‌లో లక్ష గణేష్ మండపాలు ఏర్పాటు చేయనున్నట్లు, గణేష్ విగ్రహాల ఎత్తులో ఎలాంటి ఆంక్షలు లేవని భాగ్యనగర ఉత్సవ సమితి ప్రకటించింది. గణేష్ ఉత్సవ కమిటి సభ్యులు సోమవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవం యాప్ ఆవిష్కరించారు. విగ్రహాల ఏర్పాటుపై పోలీసులకు సమాచారం ఇస్తే చాలని ఉత్సవ సమితి తేల్చిచెప్పింది. ట్యాంక్ బండ్‌లోనే గణేష్ నిమజ్జనంకు అనుమతి ఇవ్వాలని ఉత్సవ సమితి డిమాండ్ చేస్తోంది.

Pages