S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/11/2016 - 13:16

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి ఉద్యమాన్ని ఎపి సిఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని, ఇందుకు నిరసనగా వారం రోజుల పాటు ఏపిలో చైతన్యయాత్ర నిర్వహిస్తామని ఎంఆర్‌పిఎస్ నేత మంద కృష్ణమాదిక శుక్రవారం తెలిపారు. సిఎం స్వగ్రామం అయిన నారావారిపల్లె నుంచి చైతన్య యాత్ర ప్రారంభిస్తామంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, ఆ గ్రామం ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా? అని ఆయన ప్రశ్నించారు.

03/11/2016 - 13:14

హైదరాబాద్: ఈ నెల 29వ తేదీవరకూ టి.అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, 14న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారని స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. ఈ రోజు అసెంబ్లీ బిఎసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శని, ఆదివారాల్లోనూ సభ జరుగుతుందని, 15, 23,25 తేదీలను సెలవుదినాలుగా నిర్ణయిస్తూ బిఎసీ సమావేశంలో తీర్మానించారు.

03/11/2016 - 13:12

సికింద్రాబాద్‌: వేసవి రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లలో అదనపు రిజర్వుడు బోగీలను దక్షిణమధ్య రైల్వే ఏర్పాటు చేస్తోంది. దీని వల్ల 83,232 సీట్లు వెయిటింగ్‌ జాబితాలోని వారికే కాకుండా, రిజర్వు చేసుకోని ప్రయాణికులకు కూడా అందుబాటులోకి వస్తాయి.

03/11/2016 - 11:44

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ సిఎం కేసీఆర్‌తో సహా పలువురు నేతలు మాట్లాడారు. అనంతరం సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.

03/11/2016 - 11:43

హైదారాబాద్: సైదాబాద్‌లో ఉంటున్న నీటిపారుదల శాఖ డిఇఇ మాణిక్ ప్రభు ఇంట్లో ఎసిబి అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు ప్రారంభించారు. ఆయన ఇటీవల 1.37 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన నేపథ్యంలో ఎసిబి అధికారులు క్షుణ్ణంగా సోదాలు చేసి భారీగా అక్రమ ఆస్తులున్నట్లు కనుగొన్నారు.

03/11/2016 - 11:42

నల్గొండ: అర్వపల్లి మండలం డి.కొత్తపల్లి వద్ద ఓ వ్యవసాయ బావి వద్ద శుక్రవారం ఉదయం శ్రీనివాస్, వినయ్ అనే తండ్రి, కుమారుడు హత్యకు గురైనట్లు స్థానికులు కనుగొన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు వచ్చి ఈ ఘటనకు సంబంధించి కారణాలను ఆరా తీస్తున్నారు.

03/11/2016 - 11:42

హైదరాబాద్: ఇక్కడి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడిని సోదా చేసి కస్టమ్స్ అధికారులు 465 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

03/11/2016 - 11:40

హైదరాబాద్: ఖమ్మం జిల్లా గరిమెళ్లగూడ నర్సరీలో ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్న సాయిబాబా ఇళ్లలో ఎసిబి అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు ప్రారంభించారు. ఈయన 30వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ గురువారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. భారీగా అక్రమాస్తులున్నట్లు సమాచారం అందడంతో రాజేంద్రనగర్ రాధాకృష్ణ కాలనీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆయనకు ఉన్న ఇళ్లపై సోదాలు జరుపుతున్నారు.

03/11/2016 - 07:09

వంద రోజుల ప్రణాళికపై మంత్రి కెటిఆర్
పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో సమీక్ష

03/11/2016 - 07:08

నీరు లేక కళతప్పిన సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు

Pages