S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/11/2016 - 06:13

శని, ఆదివారాల్లోనూ అసెంబ్లీ

03/10/2016 - 11:53

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి చందానగర్ సర్కిల్‌లో డిఇఇగా పనిచేస్తున్న పీర్‌సింగ్ ఇళ్లపై ఎసిబి అధికారులు గురువారం ఉదయం ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. నగరంలోని మాదాపూర్, హైటెక్ సిటీతో పాటు నిజమాబాద్ జిల్లాలో ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి 7 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను ఎసిబి అధికారులు గుర్తించినట్లు సమాచారం.

03/10/2016 - 11:52

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.

03/10/2016 - 07:39

హైదరాబాద్/సైదాబాద్: చదువుకున్నవారే..కానీ జల్సాలకు అలవాటు పడ్డారు. అందుకు కావలసిన డబ్బుకోసం దోపిడీకి పథకం వేశారు. ఓ ఇల్లును దోచేందుకు యత్నించిన క్రమంలో ఒక మహిళ పాత్ర అవసరమైంది. కాగా వారిలో ఒక ప్రబుద్ధుడు తన తల్లిని రంగంలోకి దింపాడు. దోపిడీ యత్నం బెడిసికొట్టింది. సిసి కెమెరాల ఫుటేజి ఆధారంగా మలక్‌పేట పోలీసులు కేసును ఛేదించారు. దోపిడీ ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్టు చేశారు.

03/10/2016 - 07:38

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే పిఇసెట్, పిజి ఇ సెట్, ఎడ్‌సెట్‌ల షెడ్యూళ్లను ప్రకటించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో చేరేందుకు పిఇసెట్‌ను, ఎంటెక్, ఎంఫార్మసీల్లో చేరేందుకు పిజిఇసెట్‌ను, బిఇడి కోర్సులో చేరేందుకు ఎడ్‌సెట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మూడు సెట్‌లను ఈ ఏడాది ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించబోతోంది. ఆ

03/10/2016 - 07:24

వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టిఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసినప్పటికీ పశ్చిమలో ఆ పార్టీ దాదాపు నాలుగు సీట్లను కోల్పోయి కాంగ్రెస్ చేతుల్లో పెట్టింది. గ్రేటర్ పరిధిలో మెజార్టీ డివిజన్లు తూర్పు పశ్చిమలోనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు తూర్పులో హవా కొనసాగినా పశ్చిమలో టిఆర్‌ఎస్ హవాకు కాంగ్రెస్ నేతలు జంగా రాఘవరెడ్డి అడ్డుపడ్డారు.

03/10/2016 - 07:22

నల్లగొండ: తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుండి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు యాదాద్రి దేవస్థానం సన్నాహాలు చేసింది. పంచనారసింహస్వామి క్షేత్రంగా, కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా భక్తుల పూజలందుకుంటున్న లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు.

03/10/2016 - 07:22

సంగారెడ్డి: శైవ భక్తులు, అమ్మ ఆరాధకులు భక్తి శ్రద్ధలతో మొక్కులు నిర్వహించుకునే మహా శివరాత్రి జాతర ఉత్సవాలు మెదక్ జిల్లాలో అట్టహాసంగా కొనసాగాయి. మూడు రోజుల జాతరలో భాగంగా ఏడుపాయల్లో బుధవారం నాడు వనదుర్గా మాత రథోత్సవం కన్నుల పండువగా శోభాయమానంగా కొనసాగింది.

03/10/2016 - 07:21

సూర్యాపేట: ఇంటర్మీడియట్ పరీక్షల్లో అక్రమాలకు అడ్డాగా పేరొందిన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఈ ఏడాది కూడా ఇంటర్ పరీక్షల్లో మాస్‌కాపీయంగ్ జోరుగా సాగుతోంది. పట్టణంలోని కొన్ని పరీక్షా కేంద్రాల నుండి పరీక్ష ప్రారంభమైన కొంతసేపటికే ప్రశ్నలు బయటకు పొక్కుతుండగా పరీక్ష ప్రారంభమైన అరగంటలోనే సంబంధిత సమాధానపత్రాలు పరీక్షా కేంద్రాలకు చేరుతున్నాయి.

03/10/2016 - 07:11

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాటి ఇంటర్ సెకండియర్ పేపర్ లీక్ అయిందనే వార్తలు గుప్పుమనడంతో విద్యార్ధులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరోపక్క పలు కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టు విద్యార్ధి సంఘాల నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం మాథ్స్ -ఎ పేపర్ పరీక్ష జరుగుతుండగా ఈ విషయం బయటపడింది.

Pages