S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/25/2018 - 01:47

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 24: అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందకుండా కుట్రపూరిత పాలన సాగించిన ఎపీ చంద్రబాబు నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా అడుగడుగున అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని, అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడంలో ఉన్న ఆంతర్యమేమిటని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు.

10/25/2018 - 01:45

కరీంనగర్, అక్టోబర్ 24: అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మరోసారి గ్రామాల్లోకి వస్తున్న టీఆర్‌ఎస్‌ను తన్నితరమాలని టీపీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

10/24/2018 - 16:36

హైదరాబాద్: ఓటరు జాబితాలోని పొరపాట్లు సవరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ఎన్నికలు పారదర్శికంగా నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీల వినతులను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అందరు ఓటు హక్కు వినియోగించుకునేలా చూస్తామని చెప్పారు.

10/24/2018 - 07:12

హైదరాబాద్, అక్టోబర్ 23: బతుకమ్మ చీరలు నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాయని, దీని వల్ల ఒక్కో కార్మికునికి నెలకు 10 వేల రూపాయల నుంచి 20 వేల ఆదాయం పొందుతున్నారని చేనేత శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. టెక్స్‌టైల్ పరిశ్రమను తమ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతా రంగంగా గుర్తించిందన్నారు. మరమగ్గాలను ఆధునీకరించడం వల్ల నేతన్నల ఆదాయం పెరిగిందన్నారు.

10/24/2018 - 07:12

హైదరాబాద్, అక్టోబర్ 23: దేశం కోసం యువతను సిద్ధం చేసే లక్ష్యంతో ఈ నెల 26 నుండి బీజేవైఎం జాతీయ సమ్మేళనాన్ని హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. విజయ్‌లక్ష్య- అటల్ యువ మహాధివేషన్ పేరిట దీనిని నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఈ సమ్మేళనానికి 72వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

10/24/2018 - 07:11

హైదరాబాద్, అక్టోబర్ 23: ఆదాయపన్ను అధికారుల(ఐటీ) విచారణకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరుకాలేదు. తన వద్ద ఉన్న ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అడిగారని వాటిని అనుచరుడి ద్వారా పంపినట్టు రేవంత్ వెల్లడించారు. వాస్తవానికి మంగళవారం ఐటీ అధికారుల విచారణకు ఆయన హాజరుకావల్సి ఉంది.

10/24/2018 - 07:11

హైదరాబాద్, అక్టోబర్ 23: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్ర సంచార జాతుల సంఘం మద్దతు ప్రకటించింది. సంచార జాతుల సంక్షేమాన్ని గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోకున్నా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే తమకు మేలు చేసిందని సంచార జాతుల సంఘం స్పష్టం చేసింది.

10/24/2018 - 07:10

హైదరాబాద్, అక్టోబర్ 23: కాంగ్రెస్‌కు అనుబంధ విభాగమైన రాష్ట్ర సేవాదళ్ చైర్మన్, జాతీయ సేవాదళ్ కోశాధికారి, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్ధన్ రెడ్డికి కోపం వచ్చింది. సేవాదళ్ అంటే అంత చిన్న చూపా..!? అని ప్రశ్నించారు. అన్ని కార్యక్రమాల్లో ముందుండే సేవాదళ్‌కు ఈ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

10/24/2018 - 04:14

కరీంనగర్ టౌన్, అక్టోబర్ 23: రాష్ట్రంలో మరికొద్దిరోజుల్లో జరుగనున్న ముందస్తు ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా సీపీఐ పనిచేస్తున్నట్లు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

10/24/2018 - 04:13

మహబూబ్‌నగర్, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి రాజ్యమేలిందని.. అందుకే కేసీఆర్‌ను అధికారానికి దూరం పెట్టడానికి ప్రజలు నిర్ణయించుకున్నారని తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తల సదస్సును నిర్వహించారు.

Pages