S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/27/2018 - 01:14

హైదరాబాద్, అక్టోబర్ 26: ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది పనితనం, వారి జీవన పరిస్థితులు మెరుగుపరిచేందుకు అసోసియేషన్ ఆఫ్ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీస్ (ఎపిఎస్‌ఎ), బెటర్ ప్లేస్ అవగాహన ఒప్పందం (ఎంవోయు) చేసుకున్నాయి. శుక్రవారం బేగంపేటలోని ఒక హోటల్‌లో జరిగిన సదస్సుకు 250 మందికి పైగా సిఇవోలు, ఎండీలు, ప్రభుత్వ అధికారులు, వివిధ ప్రైవేటు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

10/27/2018 - 01:13

హైదరాబాద్, అక్టోబర్ 26: పాఠశాల విద్య ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని, అపుడే ప్రయోజనం నెరవేరుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యుడు బి.మన్మధరెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు ఆధీనంలో ఉండటం వల్ల విద్య కంటే వ్యాపారంపై ఎక్కవ దృష్టి ఉంటుందని, అదే ప్రభుత్వ ఆధీనంలో ఉంటే వ్యాపారం కంటే విద్యపై ఎక్కువ దృష్టి ఉంటుందని అన్నారు.

10/27/2018 - 01:04

హైదరాబాద్, అక్టోబర్ 26: కేసీఆర్ కుటుంబం దోపిడీని ఆపేందుకే మహాకూటమి ఆవిర్భవించిందని టీటీడీపీ ప్రధానకార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఆశీర్వాద సభలను కేసీఆర్, కేటీఆర్‌లు కలిసి శాపనార్థాల సభలుగా మార్చినట్టుందని ఎద్దేవా చేశారు. 2004, 2009లో గడ్డాలు, కాళ్లు పట్టుకుని పొత్తులు పెట్టుకున్న కేసీఆర్ ఈసారి పొత్తులపై విడ్డూరమైన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.

10/27/2018 - 01:03

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగం
రహదారి అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా
నేడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
=====================================

10/26/2018 - 13:47

హైదరాబాద్: గజ్వేల్ మాజీ శాసనసభ్యుడు తూంకుంట నర్సారెడ్డిపై టీఆర్‌ఎస్ అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్య తీసుకున్నది. కాగా నర్సారెడ్డి త్వరలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.

10/26/2018 - 13:44

హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, కవిత పరామర్శిస్తే తప్పేంటని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన శుక్రవారంనాడు న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న వైఎస్ జగన్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించిన తీరుపై మండిపడ్డారు. గవర్నర్ డీజీపీకి ఫోన్‌చేసి నివేదికను కోరితే తప్పేంటని ప్రశ్నించారు.

10/26/2018 - 12:39

హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైకాపా నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఆయన సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న వైఎస్ జగన్‌ను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జగన్‌పై దాడి విషయంలో ముఖ్యమంత్రి స్పందించిన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని, అసలు ఆయనకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు.

10/26/2018 - 05:47

ఆదిలాబాద్, అక్టోబర్ 25: ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద ఐదు రోజుల క్రితం పోలీసుల తనిఖీల్లో ఓ కారులో పట్టుబడ్డ రూ. 10 కోట్ల హవాలా డబ్బుపై ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు.

10/26/2018 - 05:46

ఆర్మూర్, అక్టోబర్ 25: త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెసోళ్లను నమ్మవద్దని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే మళ్లీ తెలంగాణ వెనుకబడిపోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా ఆర్మూర్‌లోని క్షత్రియ కళ్యాణ మండపంలో గొల్ల, కుర్మల మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

10/26/2018 - 05:45

సిరిసిల్ల, అక్టోబర్ 25: 67 ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మొండి చేయి చూపిందని, ఇపుడు చంద్రబాబు, కోదండరాం, సీపీఐలకు భస్మాసుర హస్తం కానుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మాజీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడి ఎనిమిది గ్రామాలలో పర్యటించారు.

Pages