S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/26/2018 - 04:31

హైదరాబాద్, అక్టోబర్ 25: కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సమాచారం అందింది. కొండగట్టు ప్రమాద మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.5 లక్షలు, క్షతగ్రాతులకు రూ.2.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

10/25/2018 - 04:45

హైదరాబాద్, అక్టోబర్ 24: ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టు రాని నాయకులు బాధపడరాదని, త్యాగాలకు సిద్ధం కావాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా కోరారు. ప్రజాకూటమి ఏర్పాటు కావడం అనివార్యమైనందున కొన్ని సీట్లు మిత్రపక్షాలకు ఇవ్వాల్సి వస్తున్నదని ఆయన తెలిపారు. బుధవారం గాంధీ భవన్‌లో టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్.

10/25/2018 - 04:43

హైదరాబాద్, అక్టోబర్ 24: తమ దేశంలో ఆహోరోత్పత్తిని పెంచేందుకు తెలంగాణ సహకారం తీసుకుంటామని సీ షెల్స్ దేశం వ్యవసాయ మంత్రి చార్లెస్ బాస్టెన్ పేర్కొన్నారు. మూడురోజుల పాటు తెలంగాణలో వ్యవసాయ పంటలను పరిశీలించేందుకు బాస్టేన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం హైదరాబాద్ వచ్చింది. బుధవారం ఈ కమిటీ సభ్యులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి సచివాలయంలో సమావేశమయ్యారు.

10/25/2018 - 04:22

మంగపేట, అక్టోబర్ 24: మండలంలోని బోరునర్సాపురంకు చెందిన మనె్నం నాగేశ్వరరావుకు అరుదైన అవకాశం లభించింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకం అయిన సీబీఐ డైరక్టర్‌గా మనె్నం నాగేశ్వరరావు నియమితులయ్యారు. భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం బోరునర్సాపురంకు చెందిన మనె్నం నాగేశ్వరరావు అంచెలంచెలుగా ఎదిగి నేడు సీబీఐ పీఠాన్ని అధిష్టించారు.

10/25/2018 - 04:16

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 24: తెలంగాణ రాష్ట్రాన్ని అటు అంధ్రకు, ఇటు ఢిల్లీకి తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మహాకూటమిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం జిల్లా కేంద్రమైన నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మర్రి యువగర్జన రోడ్‌షోను నిర్వహించారు.

10/25/2018 - 04:14

అల్లాదుర్గం, అక్టోబర్ 24: ప్రధాని నరేంద్రమోదీ 29 రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారే తప్ప ఎలాంటి అప్పు చేయలేదని అందోల్ బీజేపీ అభ్యర్థి బాబుమోహన్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో రేణుకామాత ఆలయ ప్రాంగణంలో ఎనిమిది మండలాల బీజేపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

10/25/2018 - 04:10

ఆదిలాబాద్,అక్టోబర్ 24: నిజాం నిరంకుశత్వాన్ని ఎదురొడ్డి పోరాడి అసువులు బాసిన మన్యం వీరుడు, ఆదివాసీల ఆరాధ్యదైవం కుమురంభీం 78వ వర్ధంతి సంధర్భంగా బుధవారం జోడెఘాట్‌లో సంప్రదాయ పూజలతో ఆదివాసీలు ఘనంగా నివాళులర్పించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో ఐటీడీఏ అధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన భీం వర్ధంతి కార్యక్రమం ఈసారి నిరాడంబరంగా సాగింది.

10/25/2018 - 04:28

నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ ఆశావహులకు ఎదురుతెన్నులు తప్పడం లేదు. నవంబర్ మొదటి వారంలో అభ్యర్థులను ఖరారు చేయాలని అధిష్ఠానం నిర్ణయించడం వారిని ఉసూరుమనిపిస్తోంది.

10/25/2018 - 04:08

సూర్యాపేట, అక్టోబర్ 24: రాష్ట్రంలో బీసీలకు 60సీట్లు ఇచ్చే దమ్ము ఏ రాజకీయ పార్టీకి ఉందో ముందుకు వచ్చి ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బీఎల్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలోని సీతారామ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం నిర్వహించిన సీపీఎం నియోజకవర్గస్ధాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హజరయ్యారు.

10/25/2018 - 04:08

పాపన్నపేట, అక్టోబర్ 24: మెదక్ జిల్లా శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానిమాత అమ్మవారి 80 రోజుల హుండీ ఆదాయం రూ.21 లక్షల 74 వేల 844 లభించింది. బుధవారం ఏడుపాయల్లోని అమ్మవారి హుండీని గోఖుల్ షెడ్‌లో ఆలయ కమిటీ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, మెదక్ జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, ఆలయ ఈఓ మోహన్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలు, సత్యసాయి సేవా సమితి సభ్యులు హుండీని లెక్కించారు.

Pages