S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/26/2018 - 05:43

గజ్వేల్, అక్టోబర్ 25: కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షా 50వేల ఎకరాలు సస్యశ్యామలం కానుండగా, నోటికాడి బుక్క ఎత్తగొట్టేందుకే టీడీపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నట్లు రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. గురువారం గజ్వేల్‌లో నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొని ఆయన ప్రసంగించారు.

10/26/2018 - 05:41

కరీంనగర్, అక్టోబర్ 25: ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయం మేమేనంటూ బరిలోకి దిగుతున్న భారతీయ జనతాపార్టీ ఉమ్మడి జిల్లాలో గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తోంది. టార్గెట్ తెలంగాణ లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆపార్టీ అగ్రనేతలు ఎలాగైనా ఈసారి రాష్ట్రంలో పట్టుసాధించాలనే సంకల్పంతో ఉండగా, అంగబలం ఉన్న నాయకుల కోసం అనే్వషిస్తోంది.

10/26/2018 - 05:41

వరంగల్, అక్టోబర్ 25: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు జయశంకర్ భూపాలపల్లి,మహబూబూబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పిలుపునిచ్చారు. గురువారం ఆంధ్రభూమి కార్యాలయానికి ఐదు పేజీల లేఖను ఆయన పంపించారు. సీఎం కేసీఆర్ గత నాలుగు సంవత్సరాల కాలంలో నియంత పరిపాలన కొనసాగించారని ఆయన అన్నారు.

10/26/2018 - 05:12

హైదరాబాద్, అక్టోబర్ 25: అధికార పక్షానికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని మహాకూటమి నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి గురువారం నాడు ఫిర్యాదు చేశారు. మహాకూటమి నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ, చాడ వెంకటరెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్‌లు సీఈఓను కలిసి ఒక వినతి పత్రం అందజేశారు.

10/26/2018 - 05:10

హైదరాబాద్, అక్టోమర్ 25: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నగరా మోగినప్పటి నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒకరికొకరు పోటీ పడుతూ మద్యం, డబ్బును పంపిణీ చేస్తున్నారని, దీన్ని వెంటనే అరికట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం జాయింట్ యాక్షన్ కమిటీ(ఓయూ జేఏసీ) నేతలు ఎల్చల దత్తాత్రేయ, ఎనుగంటి రాజు నేత ఆరోపించారు.

10/26/2018 - 05:08

హైదరాబాద్, అక్టోబర్ 25: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవల్సిన చర్యలపై డీజీపీ మహేందర్‌రెడ్డి గురువారం ఇక్కడ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పరిధిలోని సీనియర్ పోలీస్ అధికారులతో దాదాపు మూడు గంటలపాటు వివిధ అంశాలపై ముఖాముఖి చర్చలు జరిపారు. ముఖ్యంగా అధికారులు ప్రాధాన్యత అంశాలపై లక్ష్యాలను నిర్ధేశించారు.

10/26/2018 - 05:04

హైదరాబాద్: పార్టీ కోరితే తప్పకుండా పోటీ చేస్తా, ప్రచారంలో పాల్గొంటా, అభ్యర్ధులను గెలిపిస్తా అని స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆయన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ , ఇతర సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారం, తన పాత్ర గురించి ఆరా తీశారు.

10/26/2018 - 05:01

హైదరాబాద్, అక్టోబర్ 25: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అధర్మాన్ని పెంచి పోషించే విధంగా ఉందని ప్రతిపక్షాలపై నిఘా పెట్టడం, ఫోన్ ట్యాపింగ్‌లు, నేతల వాహనాలు ఆపి సోదాలు చేయించడం తద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారని టీటీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యవహారాలపై ఇప్పటికే తాము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.

10/26/2018 - 05:00

హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణ పోలీసులు శాంతిభద్రతలో దేశానికే ఆదర్శంగా నిలువగా వారి మనస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శిస్తున్నారని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.

10/26/2018 - 04:39

హైదరాబాద్, అక్టోబర్ 25: రైతులకు 2018-19 యాసంగి పంటకోసం రుణాలు ఇవ్వడాన్ని బ్యాంకులు నిలిపివేశాయి. వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం ఈ యాసంగికి పంట రుణాలుగా 10,385 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 10 శాతం రుణాలు కూడా ఇవ్వలేదు. వాస్తవంగా ఇప్పటి వరకే 50 శాతం రుణాలను ఇవ్వాల్సి ఉంది. అలాగే వ్యవసాయ టర్మ్‌లోన్స్, వ్యవసాయ అనుబంధ రంగాలకు 10,972 కోట్ల రూపాయలు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు.

Pages