S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/22/2018 - 02:32

హైదరాబాద్, అక్టోబర్ 21: స్విట్జర్లాండ్ దావోస్‌లో జనవరి 22 నుంచి 25 వరకు నిర్వహించనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సభలకు మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు నిర్వాహకుల నుంచి ఆహ్వానం అందింది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను మాత్రమే ఫోర మ్ ఆహ్వానించడం ఆనవాయితీ. అయితే గత ఏడాది జరిగిన సమావేశాలకు కూడా మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం లభించగా ఆయన హాజరైన విషయం తెలిసిందే.

10/22/2018 - 02:25

హైదరాబాద్, అక్టోబర్ 21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆర్థిక కుంభకోణాల్లో కూరుకుపోయాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ముఖ్దూం భవనంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల కుంభకోణాలను ప్రజలకు తెలియజేయడానికి వీలులేకుండా మీడి యా మొత్తం అధికార పక్షం చేతిలోనే ఉందని అన్నారు.

10/22/2018 - 02:18

హైదరాబాద్, అక్టోబర్ 21: రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత వ్యతిరేకి అని టీపీసీసీ కోశాధికారి గూడురు నారాయణ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కేసీఆర్ అవమానించారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కరెక్ట్‌గా విమర్శించారని గూడురు నారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

10/22/2018 - 02:18

హైదరాబాద్, అక్టోబర్ 21: యాసంగి పంటలకు సంబంధించిన రైతుబంధు పథకం సోమవారం నుండి అమల్లోకి వస్తోంది. ఈ పథకం అమలు చేసేందుకు నిధుల కొరత లేదని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. ఆదివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడారు. తొలిరోజు దాదాపు ఐదు లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బు జమచేసేందుకు ఏర్పాట్లు చేశారు.

10/22/2018 - 02:17

హైదరాబాద్, అక్టోబర్ 21: జనాభాలో సగం మంది ఉన్న బీసీలకు అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో బీసీ భవన్‌లో ఆదివారం బీసీ సంఘాల కోర్ కమిటీ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగింది.

10/20/2018 - 16:57

భైంసా: టీఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన రాహుల్ పాల్గొన్న భైంసా ఎన్నికల సభలో మాట్లాడుతూ డిసెంబర్ 12న వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కేసీఆర్ పాలనలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని అన్నారు.

10/20/2018 - 16:56

కామారెడ్డి:కాంట్రాక్టుల పేరిట కేసీఆర్ ప్రజాధనాన్ని దోపిడీచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి విమర్శించారు. ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఇద్దరు ఆంధ్రా గుత్తేదారులకు రూ.75 వేల కోట్ల కాంట్రాక్టులు అప్పగించారని అన్నారు. మైనార్టీలను మోసం చేసేందుకే కేసీఆర్ మోదీతో కుమ్మక్కై ముందస్తు ఎన్నికలకు వెళ్లారని అన్నారు.

10/20/2018 - 16:55

నిర్మల్: తెలంగాణలో తమకు అధికారం కట్టబెడితే అవినీతిలేని తెలంగాణను అందిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఆయన భైంసాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోదీ ఐదేళ్లు వృధాచేశారని, ఇప్పటికైనా మించిపోయిందేమి లేదని తమను గెలిపిస్తే నిరుద్యోగ భృతీ రూ.3వేలు అందిస్తామని వెల్లడించారు. ప్రజల కలలు సాకారం కావాలంటే కాంగ్రెస్ అధికారం కట్టబెట్టాలని అన్నారు.

10/20/2018 - 07:36

*అభ్యర్ధులపై ఎన్నికల కమిటీ సుదీర్ఘ మంతనాలు

10/20/2018 - 07:35

హైదరాబాద్, అక్టోబర్ 19: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యను కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కే. జానారెడ్డి ఆహ్వానించారు. దీనిపై కృష్ణయ్య స్పందిస్తూ బీసీల సంక్షేమం కోసం పోరాడుతున్న తమ సంఘాన్ని మహాకూటమితో జత కట్టి, కూటమి విజయం కోసం కృషి చేస్తానని చెప్పినట్లు సమాచారం.

Pages